Tenali Ramakrishna (1956)

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ – రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల
నటీనటులు: యన్.టి.ఆర్ , ఏ. యన్.ఆర్, జమున
దర్శకత్వం: బి.యస్.రంగా
నిర్మాత: బి.యస్.రంగా
విడుదల తేది: 12.01.1956

పల్లవి:
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే
ఆ ఆ ఆ ఆ ఆ అ
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత సాలి
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే

చరణం: 1
కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం
ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే

చరణం: 2
ఇష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం
సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామ
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి

**********  **********  **********

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ – రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.లీలా

పల్లవి:
జగములా దయనేలే జనని
జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని

చరణం: 1
మరుని గెలిచినవానికి మరులు
మరుని గెలిచినవానికి మరులు
మరిపే సుందరవదనా
ఆపదలందున ఆదరించవే లలితా శైలసుధా ఆ ఆ లలితా శైలసుధా

జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని

*************  ************  ************

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ – రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి

పల్లవి:

ఈ వాలు కన్నులు ఈ వన్నె చిన్నెలు
మారాజ రాజుకు నీరాజనములు
కన్నులు నిండె కన్నెలమిన్న మన్ననలీరా రాజా
కన్నులు నిండె కన్నెలమిన్న మన్ననలీరా రాజా

చరణం: 1
కుషీమీర కొనరా కోరి చేరినారా
ఈ సొగసొంతా నీసొమ్మేరా ఫాదుషా
కుషీమీర కొనరా కోరి చేరినారా
ఈ సొగసొంతా నీసొమ్మేరా ఫాదుషా
కుషీమీర కొనరా

చరణం: 2
కోయిల కూన కులికే జాణ
పలికించేరా పాటలలో
కోయిల కూన కులికే జాణ
పలికించేరా పాటలలో
సరసాల వేళ విరజాజి పానుపున కొలువుచేయించి లాలించుదాన
సరిచెయ్యాలా నేనే నాకు సాటిరా
కుషీమీర కొనరా కోరి చేరినారా
ఈ సొగసొంతా నీసొమ్మేరా ఫాదుషా
కుషీమీర కొనరా

*************  ************  ************

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ – రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి

పల్లవి:
నీవెగా రార నీవెగా
నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగా
నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగా
నీవెగా రార నీవెగా

చరణం: 1
విరిసి నెరితావి కొలతే విరితాన
విరిసి నెరితావి కొలతే విరితాన
పరువు మురిపాల వరుని వెతకాలి
పరువు మురిపాల వరుని వెతకాలి
కళల నెరజాణ సరసాల చెలికాన
కళల నెరజాణ సరసాల చెలికాన
మేలు వాని కోరితే చాలు తిరుగాడి
మేలు వాని కోరితే చాలు తిరుగాడి
మోహాలు మించగా మదిని గల ఆశ ఫలించగ
మోహాలు మించగా మదిని గల ఆశ ఫలించగ
నేటికి ఇటు సరసజాణ నటనవేదినెరుగని శరణు చేరి మనసు తీర మురిసిన సురువు పలుకులకు వలపులకు నెర దొరవని విన్నారా కనుల నినుగన్నారా మనసుగొని వున్నారా ఏలుకోర

నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగా
నీవెగా రార నీవెగా

*************  ************  ************

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ – రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి

పల్లవి:
తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

చరణం: 1
తరుణలలో నా సరి జాణ
సరసుల నీకు సరి లేరు నెరజాణ
తరుణలలో నా సరి జాణ
సరసుల నీకు సరి లేరు నెరజాణ
ఆటలపాటలలో వినోదాల వేడుకలో
ఆటలపాటలలో వినోదాల వేడుకలో
వాటముగా నిన్ను లాలింతురా దొర
వాటముగా నిన్ను లాలింతురా దొర

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

చరణం: 2
వన్నెల మేడ వెన్నెల నీడ
వాడని మల్లియల వాడలలో హాయిగా
వన్నెల మేడ వెన్నెల నీడ
వాడని మల్లియల వాడలలో హాయిగా
వింతలు చేయుదురా విలాసాల తేలుదురా
వింతలు చేయుదురా విలాసాల తేలుదురా
చూతుమురా స్వర్గవైభోగమే ఇలా
చూతుమురా స్వర్గవైభోగమే ఇలా

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

*************  ************  ************

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ – రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: గంటసాల

చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగ ఈ కోటలో
చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగ ఈ కోటలో
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ నీ మాట దక్కించుకో బాబయా
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ నీ మాట దక్కించుకో బాబయా

నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ
కొమ్మ కొమ్మ విరగ బూసి వేలాదిగా
నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ
కొమ్మ కొమ్మ విరగ బూసి వేలాదిగా
ఇక కాయాలి బంగారు కాయలు భోచెయ్యాలి మీ పిల్ల కాయలు
కాయాలి బంగారు కాయలు భోచెయ్యాలి మీ పిల్ల కాయలు

రహ దారి వెంట మొక్క నాటి పెంచరా
కలవాడు లేనివాడు నిన్ను తలచురా
రహ దారి వెంట మొక్క నాటి పెంచరా
కలవాడు లేనివాడు నిన్ను తలచురా
భువిని తరతరలు నీ పేరు నిలుచురా
పని చేయువాడె ఫలములారగింతురా