చిత్రం: తాళి (1997)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , శ్వేతా, స్నేహ, స్వాతి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. వి. వి. సత్యన్నారాయణ
మాటలు: పోసాని కృష్ణమురళి
నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
విడుదల తేది: 24.01.1997
ఓసోసి కన్నె శశీ ఊరించే కొంటె కసి
ఓరోరి ప్రేమ ఋషి ఊగించే చిలిపి ఖుషి
దిక్కులతో నును సిగ్గులతో నీ బుగ్గలు ఇటు రాని
మక్కువతో చలి ఎక్కువతో నీ దగ్గర జతకాని
ఓసోసి కన్నె శశీ ఊరించే కొంటె కసి
ఓరోరి ప్రేమ ఋషి ఊగించే చిలిపి ఖుషి
చరణం: 1
సరిగా గురిగా దరిగా జరిగా
అడిగా మనసడిగా
గుండెలోని ప్రేమ నా సాక్షిగా
చెలిగా మెలిగా గిలిగా నలిగా
ఉడిగా జతపడగా అల్లరల్లుకున్న నీ తోడుగా
జారె స్వాతిచినుకా చీర చాటు చిలకా
చీర సిగ్గుపడకా వేసా మల్లె పడక
తియ్యని కోరికా తీరుతున్న తీరిక
ఓసోసి కన్నె శశీ ఊరించే కొంటె కసి
ఓరోరి ప్రేమ ఋషి ఊగించే చిలిపి ఖుషి
చరణం: 2
దొరికే ఉరికే దొరికె దొరికి చిలకే ఎదవణికె
వచ్చి చేరుకుంది నీ దారికి
ఉలికే పలికే కులుకె చిలికి కలికి కలలోలికె
నచ్చి వచ్చి ఇచ్చె ఈనాటికే
కంగారరేమిలేని శృంగారాలు కాని
సింగారాలు చెదిరే చిత్రాలెన్నో కానీ
ఊపిరే ధూపమై వెచ్చనైన తాకిడి
ఓసోసి కన్నె శశీ ఊరించే కొంటె కసి
ఓరోరి ప్రేమ ఋషి ఊగించే చిలిపి ఖుషి
దిక్కులతో నును సిగ్గులతో నీ బుగ్గలు ఇటు రాని
మక్కువతో చలి ఎక్కువతో నీ దగ్గర జతకాని