తిన్న తిరం పడుతలే… లిరిక్స్
నటీనటులు: నాగ దుర్గ, సిద్ధార్థ
సంగీతం: తిరుపతి మాట్ల
సాహిత్యం: తిరుపతి మాట్ల
గానం: లక్ష్మి
దర్శకత్వం: కిషోర్ దైవాలా
నిర్మాణం : మణి, రాజు
విడుదల తేది: 04.08.2020
తిన్న తిరం పడుతలే… కూసున్న తిరం పడుతలే
ఏడున్న తిరం పడుతలే… ఎవలున్న తిరం పడుతలే
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా…
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా…
నువ్వు సిర్రా సిటుక బట్టి… డప్పుల్లా దరువులేస్తే
తనువంత తాట కలిసే… ప్రేమ ఇత్తునాలు మొలిసే
గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయెనుల్ల…
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా…
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా…
నువ్వు నేను దూరమాయి… ఏడాదినరుదమోయి
పొదుమాపు ఎదురుసూపు… జాడన్న తెలువదోయి
గిట్ల గోసలు పెట్టా… నీకు ఎట్లా మనసాయే పిలగా..!!
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా…
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా…
రవ్వంత గోసులాట… అగ్గోలె రాసుకుంది
ఇక మాట మాట పెరిగే… ఇద్దరి మనసు ఇరిగే
కొవ్వత్తివోలె కరిగే… కోపాలు ఎందుకోయి పిలగా…!!
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా…
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే… నీ యాదిలో మనసంతా…
పసిదాన్ని కాదా నేను… పగవట్టబోకు నన్ను
పంతాలు ఇడుసబెట్టు… ఇకనన్న సేయి బట్టు
నా గుండెల భాధ… నీ గుండెకు గురుతోస్తలేదా..!!
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా…
బాధైతుందే నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా…
బాధైతుందే… నీ యాదిలో మనసంతా…
మస్తు బరువైతుందే… నీ యాదిలో మనసంతా
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
???????? ???? ????????????????????????
super
super
nice song