చిత్రం: తోడికోడళ్లు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల
నటీనటులు: అక్కినెని నాగేశ్వర రావు , సావిత్రి, కన్నాంబ , సూర్యకాంతం
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి.మధుసూదనరావు
విడుదల తేది: 11.01.1957
కారులో షికారు కెళ్ళే
పాలబుగ్గల పసిడి దానా
బుగ్గమీద గులాబి రంగు
ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్ను మించిన కన్నెలెందరో
మండుటెండలో మాడిపోతే
నిన్ను మించిన కన్నెలెందరో
మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు
వచ్చి చేరెను తెలుసుకో
కారులో షికారు కెళ్ళే
పాలబుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజా నిజాలు
చలువ రాతి మేడలోన
కులుకుతావే కుర్రదానా
చలువ రాతి మేడలోన
కులుకుతావే కుర్రదానా
మేడకట్టిన చలువరాయి
ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపు కాలే కష్టజీవులు
ఒడలు విరిచి గనులు తొలిచి
కడుపు కాలే కష్టజీవులు
ఒడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను
తీర్చినారు తెలుసుకో
కారులో షికారు కెళ్ళే
పాలబుగ్గల పసిడి దానా
బుగ్గమీద గులాబి రంగు
ఎలా వచ్చెనో చెప్పగలవా
గాలిలోనా తేలిపోయే చీరకట్టిన చిన్నదానా
గాలిలోనా తేలిపోయే చీరకట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారు కెళ్ళే
పాలబుగ్గల పసిడి దానా
బుగ్గమీద గులాబి రంగు
ఎలా వచ్చెనో చెప్పగలవా
******** ******** *******
చిత్రం: తోడికోడళ్లు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, పి. సుశీల
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరుమొకటై చేయికలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరుమొకటై చేయికలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
ఒంపులు తిరిగి ఒయ్యారంగా
ఊపుతు విసురుతు గూడేస్తుంటే
ఒంపులు తిరిగి ఒయ్యారంగా
ఊపుతు విసురుతు గూడేస్తుంటే
నీ గాజులు ఘల్లని మ్రోగుతుంటే
నా మనస్సు ఝల్లు మంటున్నది
నా మనసు ఝల్లు మంటున్నది
తీరని కోరికలూరింపంగా
ఓరగంట నను చూస్తుంటే
తీరని కోరికలూరింపంగా
ఓరగంట నను చూస్తుంటే
చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి
చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి
సిగ్గు ముంచుకొస్తున్నది
నను సిగ్గు ముంచుకొస్తున్నది
చెదరి జారిన కుంకుమ రేఖలు
పెదవులపైన మెరుస్తు ఉంటే
చెదరి జారిన కుంకుమ రేఖలు
పెదవులపైన మెరుస్తు ఉంటే
తీయని తలుపులు నాలో ఏమో
తీయని తలుపులు నాలో ఏమో
తికమక చేస్తూ ఉన్నవి
అహ… తికమక చేస్తూ ఉన్నవి
మాటల్లో మోమాటం నిలిపి
రాగంలో అనురాగం కలిపి
పాటపాడుతుంటే
నా మది పరవశమై పోతున్నది
అహ పరవశమైపోతున్నది
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరుమొకటై చేయికలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది