చిత్రం: తోడు నీడ (1965)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, భానుమతి రామకృష్ణ, జమున
మాటలు: సముద్రాల జూనియర్
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాతలు: యన్.యన్.భట్, ఎ. రామిరెడ్డి
విడుదల తేది: 12.05.1965
పల్లవి:
మళ్లున్నా మాణ్యాలున్నా…మంచె మీద మగువ ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా…పంచుకొనే మనిషి ఉండాలి
మళ్లున్నా మాణ్యాలున్నా…మంచె మీద మగువ ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా…పంచుకొనే మనిషి ఉండాలి
చరణం: 1
పైరు మీది చల్లని గాలి
పైట చెరగును ఎగరేయాలి
పైరు మీది చల్లని గాలి
పైట చెరగును ఎగరేయాలి
పక్కన ఉన్న పడుచువానికి
పరువం ఉరకలు వేయాలి
పక్కన ఉన్న పడుచువానికి
పరువం ఉరకలు వేయాలి
మళ్లున్నా మాణ్యాలున్నా
మంచె మీద మగువు ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకోనే మనిషి ఉండాలి
చరణం: 2
ఏతమెక్కి గడవేస్తుంటే
ఎవరీ మొనగాడనుకోవాలి
ఎవరీ మొనగాడనుకోవాలి
ఏతమెక్కి గడవేస్తుంటే
ఎవరీ మొనగాడనుకోవాలి
ఎవరీ మొనగాడనుకోవాలి
వంగి బానలు చేదుతు ఉంటే
వంపుసొంపులు చూడాలి
వంగి బానలు చేదుతు ఉంటే
వంపుసొంపులు చూడాలి
మళ్లున్నా మాణ్యాలున్నా
మంచెమీద మగువ ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకొనే మనిషి ఉండాలి
చరణం: 3
కాలి దువ్వి కోవెల బసవడు
ఖంగుమని రంకేయాలి
కాలి దువ్వి కోవెల బసవడు
ఖంగుమని రంకేయాలి
దడవనులే మావారున్నారు
వారి ఎదలో నేనుంటాను…
దడవనులే మావారున్నారు
వారి ఎదలో నేనుంటాను…
మళ్లున్నా మాణ్యాలున్నా
మంచెమీద మగువ ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకొనే మనిషి ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకొనే మనిషి ఉండాలి
****** ***** ******
చిత్రం: తోడు-నీడ (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల
పల్లవి:
ఓఒల్ల్ల ఆయీ ఆయీ హాయి హాయి హాయి హాయి
ఓఒల్ల్ల హాయి లాలీ లాలీ లాలీ లాలి …
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా…ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా…
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా…ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా…
ఆడుకొని ఆడుకొని అలసిపోతివా…ఆడుకొని ఆడుకొని అలసిపోతివా…
అలుపు తీర బజ్జో మా అందాల బొమ్మ
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా…ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..
చరణం: 1
అమ్మలు కన్నుళ్ళు తమ్మి పూవుళ్ళు…
అమ్మలు కన్నుళ్ళు తమ్మి పూవుళ్ళు…
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు…
ఆ వెన్నెలను ముసేనే కన్నీటి జల్లు…
వెన్నెలను ముసేనే కన్నీటి జల్లు.
కన్నీరు రానీకు కరుగు నెడదల్లు ….
ఓఒల్ల్ల ఆయీ….
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా…ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..
చరణం: 2
కనిపించే దేవుళ్ళు కమ్మని పాపళ్లు..
కనిపెంచే తల్లికి కన్నుల జ్యోతుళ్లు…
వేయాలి పాపాయి తప్పతడుగుళ్లు…
వేయాలి పాపాయి తప్పతడుగుళ్లు…
చేయాలి ఆపైన గొప్ప చేతలు ….
ఓఒల్ల్ల ఆయీ ఆయీ హాయి హాయి హాయి హాయి
ఓఒల్ల్ల హాయి లాలీ లాలీ లాలీ లాలి …
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా…ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా…ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..