Thodu Needa (1983)

చిత్రం: తోడు నీడ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు:  శోభన్ బాబు, రాధిక, సరిత, నళిని,
మాటలు: ఆచార్య ఆత్రేయ
దర్శకత్వం: వి.జనార్దన్
నిర్మాత: ఎస్.పి.వెంకన్నబాబు
విడుదల తేది: 1983

పల్లవి:
నా తోడువై..నా నీడవై
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై

నా తోడువై… నా నీడవై
నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై

చరణం: 1
నీ రూపం కలకాలం..నా ఏదలొ కదలాడే అపురూప అనురాగ దీపం
నీ నవ్వుల సిరి మువ్వల చిరునాదం ప్రతి ఉదయం వినిపించు..భూపాల రాగం
మన లోకం…అందాల లోకం
మన గీతం…ఆనంద గీతం
మన బ్రతుకు తుది లేని సెలయేటి గానం

నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై

చరణం: 2
నీ చెంపల ఎరుపెక్కే..నును కెంపుల సొంపులలో.. పూచింది మందార కుసుమం
నీ మమతలు విరజల్లే విరి తేనెల మదురిమలు.. విరిసింది నవ పారిజాతం

నీ రాగం…అతిలోక బందం
నీ స్నేహం…ఎనలేని దాహం
అనుదినము ఒక అనుభవం రసమయ సంసారం

నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Preyasi Raave Lyrics
Preyasi Raave (1999)
error: Content is protected !!