Tholi Prema (2018)

చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్ , యస్.యస్.థమన్
నటీనటులు: వరుణ్ తేజ్ , రాశిఖన్నా
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: బి.వి.యస్.యన్. ప్రసాద్
సినిమాటోగ్రఫీ:
ఎడిటర్:
బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర
విడుదల తేది: 09.02.2018

నిన్నిలా నిన్నిలా చూసానే
కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే

నిన్నిలా నిన్నిలా చూసానే
అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పదే

నిన్ను చేరి పోయే నా ప్రాణం
కోరేనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం నాలో ఆనందం
నన్ను నేను మరచిపోయేలా ఈ క్షణం

ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)

తొలి తొలి ప్రేమ దాచేయికల
చిరు చిరు నవ్వే ఆపేయకీలా
చలి చలి గాలి వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా

నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా

ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)

*******  *******   *******

చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్, దేవన్ ఏకాంబరన్

లవ్లీ లవ్లీ మెలొడీ ఏదొ మదిలో బట్టర్.ఫ్లై చేసా
ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషలో అడుగేసా
కాలాన్నే కాలాన్నే ఆపేసా ఆపేసా
ఆకాసాన్నే దాటేశా

విన్నాన్నే విన్నాన్నే నీ పెదవే చెబుతుంటె విన్నానే
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నన్నే
నీ ఎదలో ఎదలో పుట్టేసింద ప్రేమ నా పైనా
నా మనసే మనసే కనిపించిందా కాస్త లేటయినా
నీ వెనకే వెనకే వచ్చేస్తున్న దూరమెంతున్నా
మరి ఎపుడీ ఎపుడీ రోజు వస్తుందని వేచి చూస్తున్నా
అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పెశావుగా
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టెశావుగా

విన్నాన్నే విన్నాన్నే నీ పెదవే చెబుతుంటె విన్నానే
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నన్నే

నీ పలుకే వింటు తేనెలనే మరిచాలే
నీ అలకే కంటు ఆకలినే విడిచాలే
నీ నిద్దుర కోసం కలల తెరే తెరిచాలే
నీ మెలుకువ కోసం వెలుతురునే పరిచాలే
నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేంటా
నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా
నా పేరె పిలిచే అవసరమైనా నీకు రాదంటా
కన్నీరే తుడిచే వేలు నేనై నీకు తోడుంటా

అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పెశావుగా
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టెశావుగా

విన్నాన్నే విన్నాన్నే నీ పెదవే చెబుతుంటె విన్నానే
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నన్నే

*******  *******   *******

చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రాహుల్ నంబియర్

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా
నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింక్ అవ్వనా
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండర్ అవనా
సునైనా నీతో రానా

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా

ఈ ఆగే పోతె మల్లి రాదె నువ్వేం చేసినా
ఇది ఓపెన్ చేసి బోటిల్ బేబి కాలి చేసెయనా
ఓ లవ్లి లేడి నువ్వే ఎంత మారం చేసినా
మన ఇద్దరి మద్య లందన్ బ్రిడ్జె నేనె దాటెయ్ నా
నాలో సరిగమ నీలో పదనిస కలపవ నువ్ పలకవా
ఆతో పాటిఉగ నాతో మాటగ మారవ నువ్ పాడవా

నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింక్ అవ్వనా
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండర్ అవనా
సునైనా నీతో రానా

*******  *******   *******

చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రఘు దీక్షిత్

Break the rules break the rules
Just break the rules prgaress లో దూసుకెల్లి పోరా
Make the rules make the rules
Lets make the rules మనము కోరుకుంటె దొరికె చల్ రా
సోడియ రేడియ రోడియ హీలియం బేరియం తోరియం ఉంది ఫార్ములా
ఫార్ములా…ఫార్ములా…ఫార్ములా
మన పాటల్లొ లిరిక్స్ మాటల్లొ ఎతిక్స్ గుండెల్లొ ఫ్రీడంకి లేదు ఫార్ములా
ఫార్ములా…ఫార్ములా…ఫార్ములా
క్షణాల జిందగీలో no compromise అనేలా
మన విరగ బరువు తిరగ మరగ కురగ లేని గోలా

Break the rules break the rules
Just break the rules prgaress లో దూసుకెల్లి పోరా
Make the rules make the rules
Lets make the rules మనము కోరుకుంటె దొరికె చల్ రా

మోహన మురలిని వలచిన వాడూ
తియ్య రాధని పిలిచిన వాడూ
కమ్మని వేలల కురిసిన ఆడు
పరిమల వనమున ప్రియమగు వాడు
చిన్ని కృష్నుడు మా చేతికందాడు
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు
చిన్ని కృష్నుడు మా చేతికందాడు
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు
హరే హరే మురారే…హరే హరే మురారే
హరే హరే మురారే…హరే హరే మురారే
హరే హరే మురారే…హరే హరే మురారే

క్లాసు రూంలో బెంచీకే అతుక్కు పోకురా
రెక్కలే విప్పి చూడరా
ఓ ర్యాంకు కోసం పోటినే కాసేపు ఆపరా
రొమాన్సుకీ స్పేసు ఇవ్వరా
తీయ్ పరదా…చేయ్ సరదా
వెలిగి పోదా కలల పరదా
ఆ ఫైరుకి లైఫుకి నీరుకి జోరుకి స్పీడుకి ఉందొక ఫార్ములా
మనలో పొగరు జిగురు వగరు లేదంట ఫార్ములా
యుగాల యువతరంలో సరైన హిష్టరీలా
మన విరగ బరువు తిరగ మరగ కురగ లేని గోలా

Break the rules break the rules
Just break the rules prgaress లో దూసుకెల్లి పోరా
Make the rules make the rules
Lets make the rules మనము కోరుకుంటె దొరికె చల్ రా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Dharma Kshetram (1992)
error: Content is protected !!