చిత్రం: తొలివలపు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్ , చిత్ర
నటీనటులు: గోపిచంద్ , స్నేహ, పి.రవిశంకర్
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: యమ్.నాగేశ్వరరావు
విడుదల తేది: 03.08.2001
పల్లవి:
పాలతో కడిగిన పావురమా
తేనెతో తుడిచిన పూవనమా
నేలపై గగణమా నీటిలో కిరణమా
నువులేక గాలి పీల్చుట నా తరమా
పాలతో కడిగిన పావురమా
తేనెతో తుడిచిన పూవనమా
చరణం: 1
నాలో ఇంతలోనే ఏమయ్యిందో
నిన్నే చూడగానే ప్రేమయ్యిందో
జాబిల్లిలో మచ్చ మాయం చేస్తే
చూపించునే చెలి నీ వధనం
రోజాలలో ముళ్ళు మెత్తగ చేస్తే
కనిపించునే చెలి నీ నయణం
మంచు పొగలు ఎండ సెగలు
కలబోస్తే కన్నె ఒగలు
జగతిలోన అందం ఓ మిగిలిలేదు కొంచం
అందమంత మొత్తం నీకు అయ్యే సొంతం
పాలతో కడిగిన పావురమా
తేనెతో తుడిచిన పూవనమా
చరణం: 2
ఎన్నో తరాలు నీ చూపుల్లో
ఎన్నో పుస్తకాలు నీ సొంపుల్లో
నా గుండెలో చిరు చెమటలు పొసే
కనురెప్పతో గాలి విసరాలే
నా మేనిలో ప్రేమ మొలకలు వేసే
నీ ముద్దుతో నీరు చిలకాలే
నువు దారం నేను రాట్నం
పంచుకుందాం ప్రేమ వస్త్రం
గౌరి కిచ్చెనంట ఆ శివుడు అర్ధభాగం
నీకు ఇచ్చుకుంటా నా తనువు పూర్తి భాగం
పాలతో కడిగిన పావురమా
తేనెతో తుడిచిన పూవనమా
నేలపై గగణమా నీటిలో కిరణమా
నువులేక గాలి పీల్చుట నా తరమా