చిత్రం: తొలిరేయి గడిచింది (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల, ఎస్.పి.బాలు
నటీనటులు: మురళీమోహన్, జయచిత్ర, మోహన్ బాబు
దర్శకత్వం: కె.ఎస్.రామిరెడ్డి
నిర్మాత: ఎమ్. గోపాలకృష్ణారెడ్డి
విడుదల తేది: 17.11.1977
ఈ తీయని వేళ నా ఊహల లోన
మల్లెలు విరిసే తేనెలు కురిసే
జల జల జల జల
ఈ తీయని వేళ నా ఊహల లోన
నీల మేఘమాలికలోన
నీ కురులూగెనులే
పైరగాలి ఊయలలోన
నీ మది పాడెనులే
నా మదిలోని రాగిణులన్నీ
నీకై మ్రోగెనులే
ఈ తీయని వేళ నా ఊహల లోన
లేలేత కోరికలన్నీ
పూచెను పరువాలై
దాచలేని భావనలన్నీ
లేచెను కెరటాలై
కన్నులలోన కలకల లాడే
కలలే కిరణాలై
ఈ తీయని వేళ నా ఊహల లోన