Thoorpu Padamara (1976)

చిత్రం: తూర్పూ పడమర (1976)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సినారె (All)
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: మాధవి (తొలి పరిచయం), మురళీమోహన్, నరసింహ రాజు, శ్రీవిద్య, మంజుభార్గవి
కథ: కె.బాలచందర్
దర్శకత్వం: దాసరి నారాయణరావు
అసోసియేట్ డైరెక్టర్: రేలంగి నరసింహారావు
నిర్మాత: కె. రాఘవ
విడుదల తేది: 1976

శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృత వాహిని
ఆఆఆఆఆ…ఆఆఆఆ…
శివరంజని నవరాగిణీ.. ఆఆఆ…

రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
స్వర సుర ఝురీ తరంగానివీ
స్వర సుర ఝురీ తరంగానివీ
సరస హృదయ వీణా వాణివీ

శివరంజని నవరాగిణి.. ఆఆఆఆ..

ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధు కలశం…

శివరంజని నవరాగిణీ…ఆఆఆఆ..

జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి
రాశీకృత నవరసమయ జీవన రాగాచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
రావే…ఏఏఏ.. రావే నా శివరంజని..
మనోరంజని.. రంజని నా రంజని
నీవే నీవే నాలో పలికే నాదానివీ
నీవే నాదానివీ
నా దానివి నీవే నాదానివీ

error: Content is protected !!