మరువాలి కాలాన్నే… లిరిక్స్
చిత్రం: తూటా (2020)
నటీనటులు: ధనుష్, మేఘా ఆకాష్
సంగీతం: దర్బుక శివ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్
దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాణం : జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి
విడుదల తేది: 01.01.2020
మరువాలి కాలాన్నే..
మరువాలి లోకాలనే..
మౌనంగా తలవాల్చీ
ఒడిలో నిధురించవే..
విరిపాణ్పు ఓలే..
పరిచానే హృదయం!
పసిపాప నీవై
పవలించి ఈ సమయం!
గగనాన్ని చేరాలే..
గతమన్న ఆలోచన…
మరునాటి గంధాలే..
కురవాలి ఈ రోజునా!
అడుగైన వెయ్యినీనె
విధినైన ఈ వీధినా..
సుడి నుంచి తేల్చాలే..
నిను నేడు నా.. లాలనా!
నడిరేయి కోరల్లో..
నలిగేటి ఆ.. రోజులు
విడిచేసి ఆ చీకటిలో…
విహరించు ఈ వెన్నెలలో…
గదిలోంచీ విరహాన్నే..
తరిమేసా రాదే…
గడియారం వినిపించే..
పిడివాదం లేదే…
మనలోనే మనం
మసలే ఈ క్షణం
జగమే… విడిపొనీ..
యుగమే… గడిచైనీ…
కనుపాపలో నుంచి
నువు రాల్చు కావేరిని
కలిపేసుకుంటా.. కడలై..
కురిసేను మళ్ళీ.. కలలై..
నువు లేని నిమిషాన్ని..
వెలివేసా.. నేడు..
నిలువెల్ల నువు నిండే
మనసయ్యా.. చూడు
ఇక నీ.. చేతిని విడిపోలేనని
ప్రళయం… ఎదురైనా
మరణం… ఎదురైనా
మరువాలి కాలాన్నే..
మరువాలి లోకాలనే..
మౌనంగా తలవాల్చీ
ఒడిలో నిధురించవే..
విరిపాణ్పు ఓలే..
పరిచానే హృదయం!
పసిపాప నీవై
పవలించి ఈ సమయం!
గగనాన్ని చేరాలే..
గతమన్న ఆలోచన…
మరునాటి గంధాలే..
కురవాలి ఈ రోజునా!
అడుగైన వెయ్యినీనె
విధినైన ఈ వీధినా..
సుడి నుంచి తేల్చాలే..
నిను నేడు నా.. లాలనా!
మరువాలి కాలాన్నే..
మరువాలి లోకాలనే…
********** ********** ********** **********
కాలం కదలదే… లిరిక్స్
చిత్రం: తూటా (2020)
నటీనటులు: ధనుష్, మేఘా ఆకాష్
సంగీతం: దర్బుక శివ
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: సత్య ప్రకాష్
దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాణం : జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి
విడుదల తేది: 01.01.2020
కాలం కదలదే.. ఎలా..
పాఠం విసుగురా…
గమ్యం అసలే లేదుగా…
గాలి కూడా రాదిలా…
ఒక తామర నీరిది లేనిదే… పూచేనేడే…
తిరు పాదము నేలను తాకీ… అవి కందేనులే…
ఓ బొమ్మది కాగితం పైనే… వెయ్యలేదే…
విరజిమ్మిన రంగులు మనిషైన అమ్మాయిదే…
నాకిపుడేంటో… ఊపిరాడదే…
ఒంటిలో వేడి వంద దాటేలే…
ఆశలు అన్నీ… ఆమె పైననే…
ఓ కథ లాగా సాగే రోజులే…
వాలన తనపై పూల వాననై
పాపను తాకీ… పాపం పోవునే…
ఈ చెలి వల్లే… గాలి వీచెలే…
నా జగమంతా… మారే పోయెలే…
లేస్తా… ఇప్పుడు అనుదినం
చూస్తా… చెలి ముఖం
అవుతా… ప్రతి శుభోదయం
నాకు.. నేనే… పరిచయం
ఎటు పూచెనో,పూచెనో ఇట్టా… ఈ పూదోట
సరికొత్తగా మత్తుగా నన్నే… చుట్టేస్తున్నదే…
తననెప్పుడు తప్పక చూస్తాను… అనుకోగా…
నను ఉక్కిరి బిక్కిరి చేస్తూ… ఎద ఝల్లన్నదే…
నాకిపుడేంటో… ఊపిరాడదే…
ఒంటిలో వేడి వంద దాటేలే…
ఆశలు అన్నీ… ఆమె పైననే…
ఓ కథ లాగా సాగే రోజులే…
ఏ గత జన్మో… తీపి బందమో…
నేనిన్ను చూస్తే… గుర్తుకొచ్చేలే…
ఇంటిలో కూడా… కొంటే రూపమే…
నా మది నిన్నే… గెల్చేదెప్పుడో…
ఓ వెన్నెల దూరంగా… నువ్వుండి పోరాదే…
హృదయం నిన్నే… నా వైపు రమ్మన్నా… రావేమే…
నీతోటి కాసింత మాట్లాడగా…
మార్చి ఉంచాను మాటల్ని ముత్యాలుగా…
మౌనాలు చాలింక ఆ మంచునీ… తొలగించనీ…
********** ********** ********** **********
ఎటు మనం పోగలం… లిరిక్స్
చిత్రం: తూటా (2020)
నటీనటులు: ధనుష్, మేఘా ఆకాష్
సంగీతం: దర్బుక శివ
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: సిద్ శ్రీరామ్, షాషా తిరుపతి
దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాణం : జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి
విడుదల తేది: 01.01.2020
ఎటు మనం పోగలం
ఎంతకీ చెప్పలేను జంటగా
ఉందాము ఇక్కడే..
నీ ముద్దులే మత్తులో తోసె
నన్ను చూడరా.. ఈ పిల్ల పోకిరే..
వేవేల కుర్రాళ్ళకీ,
నేడు నువ్వేగా,
స్వప్నాల సుందరీ..
నువు కన్నా ,
కలల్లో మాత్రమూ..
చెలి వచ్చి,
చేస్తానే అల్లరీ..
ఓ చిరుగాలి నవ్వు వీచొద్దే..
ఓఒ ఓఒ ఓఒ ఓఒ….
ఓ చిరుగాలి నవ్వు వీచొద్దే..
వస్తా శ్వాసై విసిరీ..
నట్టింట్లో నువ్వే ఉంటే,
చెలి నే నమ్మలేక చూస్తున్నానే…
తోటల్లో నువు నిలుచుంటే,
భలే.. పువ్వంటూ నిన్నే కోస్తున్నానే..
నేడు పూమాలలు సన్మాలలు,
నీ కోసం నే వదిలచ్చానే..
నువు నా సింగారము బంగారమూ
నా ప్రాయం నా ప్రాణం నువ్వే.. నువ్వేలే..
నీతోటే నే వస్తుంటే భువి,
స్వర్గంలా మారి కనిపిస్తోందే..
కోపాలు పరితాపాలు, బిగి
కౌగిట్లో మాయం అవుతున్నాయే..
నిన్నే నే చూడక మాటడక,
ఉంటానా.. నిన్నాడించక
భుజం నీవుండగా నా అండగా,
నాలోన ఆనంద గంగా నువ్వేలే..
ఎటు మనం పోగలం
ఎంతకీ చెప్పలేను జంటగా
ఉందాము ఇక్కడే..
నీ ముద్దులే మత్తులో తోసె
నన్ను చూడరా.. ఈ పిల్ల పోకిరే..
ఈ మంచి మగాడినీ, ఇలా రోజూ
నన్నే వరించమంటినే..
చంపేస్తున్న చేతి స్పర్శతో,
నీ ఎదపైన గువ్వై వాలానులే..
ఓ గాలి నవ్వు వీచొద్దే..
ఓఒ ఓఒ ఓఒ ఓఒ….
ఓ గాలి నవ్వు వీచొద్దే..
వస్తా శ్వాసై విసిరీ..
********** ********** ********** **********
అవునా నేనా… లిరిక్స్
చిత్రం: తూటా (2020)
నటీనటులు: ధనుష్, మేఘా ఆకాష్
సంగీతం: దర్బుక శివ
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: నకుల్ అభ్యాంకర్
దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాణం : జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి
విడుదల తేది: 01.01.2020
అవునా నేనా.. మనిషిలా మిగిలినాన
చెలియా నువ్వే.. హృదయమైంటివో
మనసులో ఆశ, తనవులో శ్వాశ
నీవేగా.. వేరుగ వెళ్ళకే..
వదలదీ ఒక్క, చెమటతో చొక్కా
అయ్యహో తడిసే…
మొదలా, తుదవా.. మొదటే చెప్పూ..
నిజమా, కలవా.. నిజమే చెప్పూ..
అధరం అంచు తియ్యగా..
తేనే వంచి పంచేగా..
సరదా చిన్ని చూపులే..
కరకు ముల్లై తాకెలే..
ఏంటో.. నిన్న నేడు
ఏమి తోచదులే..
నన్నే చేరనీ ఒడి
త్వరగా తెల్లవారితే..
తపనా సుఖమే.. అనేనా.. మది
మొదలా, తుదవా.. మొదటే చెప్పూ..
నిజమా, కలవా.. నిజమే చెప్పూ..
అవునా నేనా.. మనిషిలా మిగిలినాన
చెలియా నువ్వే.. హృదయమైంటివో
మనసులో ఆశ, తనవులో శ్వాశ
నీవేగా.. వేరుగ వెళ్ళకే..
వదలదీ ఒక్క, చెమటతో చొక్కా
అయ్యహో తడిసే…
మొదలా, తుదవా.. మొదటే చెప్పూ..
నిజమా, కలవా.. నిజమే చెప్పూ..
********** ********** ********** **********
ఫ్రీక్ అవుట్… లిరిక్స్
చిత్రం: తూటా (2020)
నటీనటులు: ధనుష్, మేఘా ఆకాష్
సంగీతం: దర్బుక శివ
సాహిత్యం: చైతన్య ప్రసాద్, రాకేందు మౌలి
గానం: సంజన కల్మంజే, సత్య ప్రకాష్, దర్బుక శివ, రాకేందు మౌలి
దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాణం : జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి
విడుదల తేది: 01.01.2020
ఫ్రీక్ అవుట్ ఓ యే..
ఫ్రీక్ అవుట్ ఓ యే..
ఫ్రీక్ అవుట్ ఓ యే..
ఫ్రీక్ అవుట్ ఓ యే..
తిరిగాడే.. తిరిగాడే..
వెంటెంటే.. వాడు చమక్కు
పిలగాడే.. పిలగాడే..
గుండెల్లో.. మెరిసే తళ్ళుక్కు
ఒక పంతం తన సొంతం,
తన కళ్ళే చూస్తే చురుక్కు
అనురాగం అనుబంధం,
తనకుందో లేదో అడక్కు
అతడు తనవును స్పృశిస్తే,
ప్రేమ మంత్రాలే జపిస్తే,
కనులు కలబడి కలిస్తే,
తన్మయత్వం తడితే..
నిలకడన్నదే తెలియదులే,
నింగికెగిసినా తెలియదులే,
నెమలి కన్నెనై నర్తిస్తూ,
మరిచా మరియాదే..
కలను ఆపడం తెలియదులే,
కాంక్ష కాల్చినా తెలియదులే,
మనసు జారిపడి పోతుంటే,
మధురం ఆ బాధే..
ఫ్రీక్ అవుట్ ఓ యే..
ఫ్రీక్ అవుట్ ఓ యే..
ఫ్రీక్ అవుట్ ఓ యే..
ఫ్రీక్ అవుట్ ఓ యే..
తిరిగాడే.. తిరిగాడే..
వెంటెంటే.. వాడు చమక్కు
పిలగాడే.. పిలగాడే..
గుండెల్లో.. మెరిసే తళ్ళుక్కు
ఒక పంతం తన సొంతం,
తన కళ్ళే చూస్తే చురుక్కు
అనురాగం అనుబంధం,
తనకుందో లేదో అడక్కు
అతడు తనవును స్పృశిస్తే,
ప్రేమ మంత్రాలే జపిస్తే,
కనులు కలబడి కలిస్తే,
తన్మయత్వం తడితే..
నిలకడన్నదే తెలియదులే,
నింగికెగిసినా తెలియదులే,
నెమలి కన్నెనై నర్తిస్తూ,
మరిచా మరియాదే..
కలను ఆపడం తెలియదులే,
కాంక్ష కాల్చినా తెలియదులే,
మనసు జారిపడి పోతుంటే,
మధురం ఆ బాధే..
కనిపిస్తావ్ ప్రతిచోట,
నా కళ్ళ కేమైందో..
కలలోకే వచ్చేస్తావ్,
నీలోన ఏముందో..
మాటల్నే మరిచాక,
మనసంతా నవ్విందే..
ఎదగమ్యం వదిలాక,
ఎటువైపో నడిచిందే..
మనసుతో చదివా మనసు,
అభిరుచులన్నీ.. తెలుసు..
ఉరికిన హృదయం,
ఇది కోరింది నిన్నే..
అణగదు గొడవా, గొడవా,
అనుమతి నిడవా మగువా,
అధిమితే ఎదకే,
అది తెగువా, తెగువా..
నిలకడన్నదే తెలియదులే,
నింగికెగిసినా తెలియదులే,
నెమలి కన్నెనై నర్తిస్తూ,
మరిచా మరియాదే..
కలను ఆపడం తెలియదులే,
కాంక్ష కాల్చినా తెలియదులే,
మనసు జారిపడి పోతుంటే,
మధురం ఆ బాధే..
ఒయ్యారి, గాట్ ఏ బీచ్ బాడి
ఈ ప్యారి.. టక్కరి, లేడి కిల్లాడి
నిను ముద్దాడి, చేసే కచ్చేరి
పక్కనుంది జ్యూస్ గ్లాస్ ఒకటి హే..
దాన్ని మించి ఊరగాయ్ అదిగో.. హే..
ఐ యామ్ గోయింగ్ టు టేక్ యు డౌన్ హే..
ఊరికెళ్తే డిస్కో బౌన్స్ బీచ్ బాడీ గర్ల్
ఇఫ్ యు వాన్నా పార్టీ ఛలో ఛలో.. గర్ల్
బీచ్ బాడీ గర్ల్, ఇఫ్ యు వాన్నా పార్టీ పద పద గర్ల్
బౌన్స్ గొన్నా పార్టీ.. బౌన్స్ గొన్నా పార్టీ..
బౌన్స్ గొన్నా పార్టీ.. బౌన్స్ గొన్నా పార్టీ..
బౌన్స్ గొన్నా పార్టీ.. బౌన్స్ గొన్నా పార్టీ..
బౌన్స్ గొన్నా పార్టీ.. బౌన్స్ గొన్నా పార్టీ..
********** ********** ********** **********