Thota Ramudu (1975)

చిత్రం: తోటరాముడు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్ పి బాలు
నటీనటులు: చలం, కన్నడ మంజుల
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాతలు: జి.డి.ప్రసాద్ రావు, కొరడా సూర్యనారాయణ
విడుదల తేది: 1975

పల్లవి:
ఓ బంగరు రంగుల చిలకా పలకవే…
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ…
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

ఓ అల్లరి చూపుల రాజా పలకవా…
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ…
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

చరణం: 1
పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే

ఓ బంగరు రంగుల చిలకా పలకవే…
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ…
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

చరణం: 2
సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా…
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ…
నా మీద ప్రేమే ఉందనీ…
నా పైన అలకే లేదనీ…

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Indira (1995)
error: Content is protected !!