చిత్రం: టింగు రంగడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: నందమూరి రాజ
నటీనటులు: చిరంజీవి, గీత
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: తాతినేని ప్రకాష్ రావు
విడుదల తేది: 01.10.1982
పల్లవి:
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..
అర్రెర్రె.. టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
చరణం: 1
రంగడు లొంగని మగవాడు.. రేగితే ఆగని మొనగాడు
హ..హా.. రంగడు లొంగని మగవాడు.. రేగితే ఆగని మొనగాడు
జారి బోలపడ్డావే జాణ కూతురా.. అడ్డ రోడ్డు నవ్విందే అత్త కూతురా..
సరాగాలు ఆడే ఈడులో..ఓ.. సరి జోడు నేనే చూసుకో..ఓ..ఆ..ఆ
సరాగాలు ఆడే ఈడులో..ఓ.. సరి జోడు నేనే చూసుకో..ఓ..
అందమంత కందెనా.. ఆ మందు నీకు వేయనా
తేనటీగ తీపి కుట్టు నే కుట్టనా..
బుజ్జగించి బుగ్గ ముద్దు పెట్టెయ్యనా..
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..
టింగు టింగు టింగో రంగా..ఆహా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..
చరణం: 2
మిస మిస వన్నెల అరిటాకు.. విసరకు చూపుల పిడిబాకు
హా.. మిస మిస వన్నెల అరిటాకు.. విసరకు చూపుల పిడిబాకు
రెచ్చగొట్టి పోమాకు రేపు మాపులో..
రెప్ప కొట్టుకుంటాది కొత్త ఊపులో..
కులాసాల చేసే జోరులో..ఓ.. ఖుషీ తోడు నన్నే చేసుకో..ఓ..ఆ..ఆ
కులాసాల చేసే జోరులో..ఓ.. ఖుషీ తోడు నన్నే చేసుకో..ఓ..
సందమామ కొయ్యనా.. ఆ..సంతకాలు చెయ్యనా
కౌగిలింతలోన నిన్ను కట్టెయ్యనా.. ఆకలింక చూసి బువ్వ పెట్టెయ్యనా
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ..హా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..
టింగు టింగు టింగో రంగా..ఆ..ఆహా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..
హొయ్.. హొయ్.. హా.. హొయ్.. హోయ్..
హా.. హా.. టుర్ర్.. టుర్ర్..