Toorpu Velle Railu (1979)

Toorpu Velle Railu (1979)

చిత్రం: తూర్పు వెళ్ళే రైలు (1979)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: జాలాది
గానం: ఎస్.పి.బాలు, సుశీల
నటీనటులు: మోహన్, జ్యోతి (తొలి పరిచయం)
దర్శకత్వం: బాపు
నిర్మాత: పి.పేర్రాజు
విడుదల తేది: 24. 08.1979

సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
బొమ్మలా ముద్దుగుమ్మలా
పువ్వులా పాలనవ్వులా
మెరుపుతీగమల్లే తళుకుమంటే
ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా

సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

ఆకతాయి బుల్లోడల్లే అల్లరెడితే
రాలుగాయి రాగాలన్ని రచ్చబెడితే
ఎవ్వరైన చూసారంటే అల్లరైపోతానయ్యో
ఎన్నెలంటి బతుకంతా చీకటైపోతాదయ్యో
దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను
దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను

కలవపువ్వు నీవై ఎలుగు నేనై
ఎలతేటి పాటల్లే చెలరేగిపోనా

ముత్తెమంటి ఒళ్ళు తడిసి ముద్దు పుడితే
గుండెలోన ఎండకాసి ఆరబెడితే
ఆశలారిపోకుండా ఊసులాడుకోవాలి
ఊసులెండిపోకుండా ఊట కోర్కెలుండాలి
గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి
గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి

నిన్ను నన్ను చూసి దిష్టి తీసి
ఆ లోకాల దేవుళ్ళే దీవించిపోవాలి

 సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
బొమ్మలా ముద్దుగుమ్మలా
పువ్వులా పాలనవ్వులా
మెరుపుతీగమల్లే తళుకుమంటే
ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా

సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

******   ******   *******

చిత్రం: తూర్పు వెళ్ళే రైలు (1979)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్.పి. బాలు

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా
ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా
పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు
వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లూ

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

Show Comments (0)

Your email address will not be published.