చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: బాలక్రిష్ణ , సౌందర్య
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాతలు: వెంకటరావు ముల్పూరు, అచంట గోపీనాథ్
విడుదల: 09.12.1994
పల్లవి:
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరె తకజుం.. తకజుం.. తకజుం.. తక జుం
తకథిమి నడకల నడుములో..
నలిగిన సొగసులు తడుముతా
పెదవి మదుపు పెడతా.. హోయ్..
వలపు తలపు తడతా.. హోయ్
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
చరణం: 1
సన్న జాజుల చినుకులలో
స్నానమాడిన తమకముతో
వన్నె దేరిన వయసా వారెవా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కన్ను సైగల తాకిడిలో..
ఎన్నడరెగని తహతహతో..
నన్ను లాగిన చొరవా వారెవా..
తారకలా..ఆ..ఆ
దరిచేరగ రా..ఆ
కోరికతో.. అభిసారికనై
నిలిచానా.. చంద్రమా
చూసానే అందమా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
చరణం: 2
తేనె కోరే తుమ్మెదగా
చేర వస్తా నెమ్మదిగా
పూలతీగ రానా అతిథిగా
కమ్ముకొస్తే కాదనకా
కౌగిలిస్తా.. కానుకగా
తేనెటీగా రావోయ్ మృదువుగా
వందనమే..ఊఁ..ఊఁ నవనందనమా.. ఊఁ..ఊఁ
స్వాగతమా..యువదొరతనమా నిలువెల్లా ఏలుకో
జతవళ్ళో వాలిపో..
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరె తకజుం.. తకజుం.. తకజుం.. తక జుం
తకథిమి నడకల నడుములో..
నలిగిన సొగసులు తడుముతా
పెదవి మదుపు పెడతా.. హోయ్..
వలపు తలపు తడతా.. హోయ్
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
******* ******* ********
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: యస్.పి.బాలు, చిత్ర
జామురాతిరి కాసుకోమరి
కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
చేరుకో ఒడి చెయ్యి గారడీ
కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
రవికకు పుడితే కితకితలు
బుగ్గలకెందుకు నిగనిగలు
గుండెకు పుడితే గుబ గుబలు
తనువుల కెందుకు తహ తహాలు
కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2)
జర బోలో బోలో బోలో బోలో బోలో బోలో బోలో… హేయ్
దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
చరణం: 1
కామయ్యకు కబురెడదాం
కవ్వింతల కథ చెబుదాం
కోరస్: ఒహొహొ హో ఒహొహొ హో (2)
హో కామయ్యకు కబురెడదాం
కవ్వింతల కథ చెబుదాం
ఏకాంతం కనిపెడదాం ఏకంగా జతకడదాం
మోజుల్ని త్వరపెడదాం మోమాటం విడగొడదాం
కౌగిళ్ళకు పదునెడదాం ఆరాటం పని పడదాం
ఐసా పైసా తేల్చేద్దాం
కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్
ఆనందం లో మునకేదాం
కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2)
సరే కానీ కానీ కానీ కానీ కానీ కానీ కానీ… హేయ్
దిన్ దిన్ తా దిగి దిగి తా (4)
చరణం: 2
సంపెంగల సవ్వడిలో సై అన్నదిలే వయసు
కోరస్: ఒహొహొ హో ఒహొహొ హో (2)
సంపెంగల సవ్వడిలో సై అన్నదిలే వయసు
శ్రీ గంధపు ఆవిరినై శోధిస్తా నీ సొగసు
వెయ్యేళ్ల అనురాగం నా ఒళ్ళో ఒదిగేనా
లే వలపు వీణల్లో రాగాలు తరిగేనా
ఈ గిలిగింతల రాతిరిలో
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్
మైమరపింపుల జాతరలె
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్
కొరస్ : హాయ్ రె హాయ్ రే హాయ్ రే హాయ్ (2)
అది ఏమో ఏమో ఏమో ఏమో ఏమో ఏమో ఏమో… హేయ్
దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
జామురాతిరి కాసుకోమరి
కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
చేరుకో ఒడి చెయ్యి గారడీ
కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
రవికకు పుడితే కితకితలు
బుగ్గలకెందుకు నిగనిగలు
గుండెకు పుడితే గుబ గుబలు
తనువుల కెందుకు తహ తహాలు
కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2)
జర బోలో బోలో బోలో బోలో బోలో బోలో బోలో… హేయ్
దిన్ దిన్ తా దిగి దిగి తా (4)
please upload samajavaragamana song Balakrishna song