చిత్రం: త్రిమూర్తులు (1987)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: వెంకటేష్ , రాజేంద్రప్రసాద్, అర్జున్ సార్జా, శోభన, కుష్బూ, అశ్వని
దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు
నిర్మాత: టి.సుబ్బిరామిరెడ్డి
విడుదల తేది: 29.05.1987
ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు
హ ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు
సలాం అల్లా హోలీ జీసస్ నమో ఈశ
రంపర రంపర రంపర రంపర రంపం పా
సిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం
ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు
ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు
సలాం అల్లా హోయి జీసస్ నమో ఈశ
రంపర రంపర రంపర రంపర రంపం పా
సిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం
చరణం: 1
ఆకాశ దేశాన్ని ఏలేటి ఆ తారలే
దివినుంచి దిగి వచ్చే ఈనాడు నా కోసమే
కలతోటి మీరు కవ్వించగలరు మనసున్న సాటి లోకాన్ని
పలికించగలను నా చిలిపి కళను నేను నేను మీ వాన్ని
రంపర రంపర రంపర రంపర రంపం పా
ముసి ముసి నవ్వుల మిల మిల తారలకాహ్వానం
ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు
సలాం అల్లా హోయి జీసస్ నమో ఈశ
రంపర రంపర రంపర రంపర రంపం పం
రం పం పం పం పా
సిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం
చరణం: 2
హీరో లాగా వెలగాలంటూ స్వప్నాలెన్నో కన్నా నేను
ఉల్టా సీదా చదరంగంలో చోటా బేరర్ అయ్యా నేను
అటు నందమూరి ఇటు అక్కినేని సినిమాలు నేను చూశాను
శృంగారములకు శ్రీదేవి వలపు చూసి చిత్తైపోయాను
రంపర రంపర రంపర రంపర రంపం పా
విధినే గెలిచి విదిగా వస్తా నీ కోసం
ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు
సలాం అల్లా హోలీ జీసస్ నమో ఈశ
రంపర రంపర రంపర రంపర రంపం పం
రం పం పం పం పా
సిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం