అయ్యో.. ప్రేమించేశాను… లిరిక్స్
చిత్రం: ట్రూ లవ్ ఎండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (2019)
నటీనటులు: భరత్ బండారు, రోహిణి రాచెల్, స్వాతి భీమి రెడ్డి
సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
సాహిత్యం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
గానం: అపర్ణ నందన్
దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి అటుకుల
నిర్మాణం : శ్రీధర్ రెడ్డి అటుకుల
విడుదల తేది: 2019
అరె నన్ను దాటి
నీ వైపే నడిచే
మనసును చూసానూ..
అది నాకు కూడ
కొత్తగనే ఉన్న
నవ్వుతు నిలిచాను.. !
ఇది ప్రేమొ ఏమొ మరి
తెలియక నేనే
నన్నే అడిగానూ..
నీ నవ్వు చూసి నా
మురిసే పెదవుల
ఔనుని విన్నాను.. !
అరె నన్ను దాటి
నీ వైపే నడిచే
మనసును చూసానూ..
అది నాకు కూడ
కొత్తగనే ఉన్న
నవ్వుతు నిలిచాను.. !
ఇది ప్రేమొ ఏమొ మరి
తెలియక నేనే
నన్నే అడిగానూ..
నీ నవ్వు చూసి నా
మురిసే పెదవుల
ఔనుని విన్నాను.. !
కదిలే ఈ కనులది కాదు
కల అంటే ఎదలోతుల గూడు..
కలిసే ఈ హృదయం కాదు
కథ అంటే పలు జన్మల తోడు..
నీ దారిలో అడుగే నేనూ…
నీ ప్రేమలో పడిపోయాను.. !
అయ్యో.. ప్రేమించేశాను
నిన్నే.. ప్రేమించేశాను
అయ్యో.. ప్రేమించేశాను
నన్నే.. రాసిచ్చేశాను
పెదవుల దాడికి
పదములు నిలువక
నవ్వును చిందించాను
తనువుల తాకిడి
మనసుని మీటితే
బదులుగా ఏమివను.. !
చెరి ఒక సగమని
చేతులు కలపని
చెంతకు చేరనీ.. !
మిగిలిన మనముని
మౌనం విడువని
ఊపిరి భాషవనీ.. !
గదులు దాటిన
గరుతులు కాదు
తీయని గాయమిదీ.. !
గడిచిపోయిన
గతమైపోదు
నీతో నా ఉనికీ.. !
అయ్యో.. ప్రేమించేశాను
నిన్నే.. ప్రేమించేశాను
అయ్యో.. ప్రేమించేశాను
నన్నే.. రాసిచ్చేశాను
అయ్యో.. ప్రేమించేశాను
నిన్నే.. ప్రేమించేశాను
అయ్యో.. ప్రేమించేశాను
నన్నే.. రాసిచ్చేశాను
********** ********** ********** **********
నీకు నాకు నడుమనా… లిరిక్స్
చిత్రం: ట్రూ లవ్ ఎండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (2019)
నటీనటులు: భరత్ బండారు, రోహిణి రాచెల్, స్వాతి భీమి రెడ్డి
సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
సాహిత్యం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
గానం: అశ్విని చెపురి, అపర్ణ నందన్, పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి అటుకుల
నిర్మాణం : శ్రీధర్ రెడ్డి అటుకుల
విడుదల తేది: 2019
నీకు నాకు నడుమనా.. అఆ..
నలుగుతు కదులుతుంది నడుమేనా..
నుదురు పదును తెలుపుతుంది
బెదురు మనసు భయమునీ..
అదుపు దాటి తరుముతుంది
పొదుపు సొగసు హొయలనీ..
సాగే.. సరాగాలలో..
ఆగే ..ఈ అడుగుకర్థం
అల్లుకోమనీ…
నీకు నాకు నడుమనా..
నలుగుతు కదులుతుంది నడుమేనా..
కురుల తెరలు
నిమురుతుంటె ఏమనుకోనూ..
కనుల కొనలు
తగులుతుంటె ఏమైపోను
పెదవి తడిని
తడిమి చూడ తపియించానూ..
తనువు చనువు
పెరుగుతుంటె శృతిమించాను
జారు పైట పాడని
జావలీల పాటనీ..
జాలిలేని ఆటని
జామురేయి సాగనీ..
సరసములిక
సరిగమలుగ
మోగనీ..
నీకు నాకు నడుమనా.. అఆ..
నలుగుతు కదులుతుంది నడుమేనా..
నుదురు పదును తెలుపుతుంది
బెదురు మనసు భయమునీ..
అదుపు దాటి తరుముతుంది
పొదుపు సొగసు హొయలనీ..
సాగే.. సరాగాలలో..
ఆగే ..ఈ అడుగుకర్థం
అల్లుకోమనీ…
నీకు నాకు నడుమనా..
నలుగుతు కదులుతుంది నడుమేనా..
********** ********** ********** **********
నిందించకు ఏ రోజునీ… లిరిక్స్
చిత్రం: ట్రూ లవ్ ఎండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (2019)
నటీనటులు: భరత్ బండారు, రోహిణి రాచెల్, స్వాతి భీమి రెడ్డి
సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
సాహిత్యం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
గానం: కె.ఎన్ రాహుల్
దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి అటుకుల
నిర్మాణం : శ్రీధర్ రెడ్డి అటుకుల
విడుదల తేది: 2019
నీ.. అడుగు నీది
నీ.. దారి నీది
ఏ గమ్యం చేరాలో
బ్రతుకు నేర్చుకుంది
నీ.. మనసు నీది
నీ.. మరుపు నీది
ఏ గూటికి చెందాలో
గుండె తెలుసుకుంది
గాలి ఏ వైపు సాగినా..
గమనం తీరు మార్చినా..
నుదుటన చెదిరే స్వేధాన్నీ..
తుడిచే వెళ్ళిందీ..
కష్టం నిన్ను వదలకపోయినా..
కదిలించే బాధను ఇచ్చినా..
కాలంతో పోరాడే..
తెగువని పెంచిందీ..
నిందించకు ఏ రోజునీ..
అందించు ఆనందాన్నీ..
ఓదార్పులో ఏమున్నదీ..
నీ మార్పులో రేపున్నదీ..
కలలో కథ కాదు
మన ముందు
జరిగే.. నిజం వేరు
మదిలో.. వ్యధ చేదు
ఇక రాదు
గడిచిన గతం నేడు
నదిలో నావ కాదు
బ్రతుకు పోరు
మహచిత్రం దాని తీరు
గదిలో గొడవ కాదు
మనసు వేరు వేల
బాధలు మోసే కన్నీరు
ఓడిన వీడిన
ముందడుగేయడమే జీవితం
ఆగిన సాగిన
ఏదో.. తీరం
చేరద సంద్రం
నిందించకు ఏ రోజునీ..
అందించు ఆనందాన్నీ..
ఓదార్పులో ఏమున్నదీ..
నీ మార్పులో రేపున్నదీ..
అరెరె బదులేది
ఋజువేది అని
అడిగే ప్రశ్నైపోకు
ఇదిగో ఇది నీది
అది నాది అని
అన్నీ పంచుకుపో..
చెదిరే ఆశ ఏది
దరికిచేరి నిన్ను
నిలబడనీకుంటే..
వదిలే శ్వాస ఏది
ద్యాస మారి నీ
ఊపిరి తడబడితే..
నీదని కాదని నిన్నే..
నిందిచిన ఏ క్షణం
నాదని బదులివ్వని
నివ్వెరపోని ఈ ప్రపంచం
నిందించకు ఏ రోజునీ..
అందించు ఆనందాన్నీ..
ఓదార్పులో ఏమున్నదీ..
నీ మార్పులో రేపున్నదీ..
********** ********** ********** **********
రానా.. రాజు వెనక… లిరిక్స్
చిత్రం: ట్రూ లవ్ ఎండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (2019)
నటీనటులు: భరత్ బండారు, రోహిణి రాచెల్, స్వాతి భీమి రెడ్డి
సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
సాహిత్యం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
గానం: అపర్ణ నందన్
దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి అటుకుల
నిర్మాణం : శ్రీధర్ రెడ్డి అటుకుల
విడుదల తేది: 2019
కురిసే మాటకు కబురే లేదు
కలవరమైంది మనసు
కథమొదలైంది తెలుసు
చూసే చూపులు నిలకడలేదు
చిగురించింది నవ్వు
చిత్రంగుంది చనువు
నిన్న మొన్న ఇల లేనే లేదు
నన్ను నిన్ను నీ రూపం చూడు
మాయో ఏమో మరి మాటలు లేవు
నిన్నే చూస్తుంటే…
నీకు నాకు అనే భేదం లేదు
నీతోడు నేనే ఇక వదిలేపోను..
నిన్ను నన్ను కలపాలని
దేవుడు కాలం గడిపాడు..
రానా.. రాజు వెనక
రాణీ.. రోజు నడక
సాగే ఆ..గననక
తన ప్రేమలో తడిసాక
రానా.. రాజు వెనక
రాణీ.. రోజు నడక
సాగే ఆ..గననక
తన ప్రేమలో తడిసాక
నువెళ్ళే దారి ఏ వైపు ఉన్న
నీ వెంటే అడుగేస్తా..
నీతోనే ఉండి ఏ కాలమైన
అందంగ గడిపేస్తా..
నీ చేయి తాకితే నా ఊపిరింక
భారంగ విడిచేస్తా..
నీ నవ్వు చూస్తే ఈ జన్మకింక
ఇది చాలు బతికేస్తా..
ఏదో.. మనసేదేదో..
చెబుతోంది వినలేదా..
నీదో.. మరి నాదో.. ఈ
అలజడి కథ ఏదో..
ముందో.. వెనకుందో నా దారే ఈ వేళ
బందీ కానుందో.. నీ చుట్టూ వీరా..
రానా.. రాజు వెనక
రాణీ.. రోజు నడక
సాగే ఆ..గననక
తన ప్రేమలో తడిసాక
రానా.. రాజు వెనక
రాణీ.. రోజు నడక
సాగే ఆ..గననక
తన ప్రేమలో తడిసాక
కురిసే మాటకు కబురే లేదు
కలవరమైంది మనసు
కథమొదలైంది తెలుసు
చూసే చూపులు నిలకడలేదు
చిగురించింది నవ్వు
చిత్రంగుంది చనువు
నిన్న మొన్న ఇల లేనే లేదు
నన్ను నిన్ను నీ రూపం చూడు
మాయో ఏమో మరి మాటలు లేవు
నిన్నే చూస్తుంటే…
నీకు నాకు అనే భేదం లేదు
నీతోడు నేనే ఇక వదిలేపోను..
నిన్ను నన్ను కలపాలని
దేవుడు కాలం గడిపాడు..
రానా.. రాజు వెనక
రాణీ.. రోజు నడక
సాగే ఆ..గననక
తన ప్రేమలో తడిసాక
రానా.. రాజు వెనక
రాణీ.. రోజు నడక
సాగే ఆ..గననక
తన ప్రేమలో తడిసాక
********** ********** ********** **********
నింగి నేల ఏకం ఐనా… లిరిక్స్
చిత్రం: ట్రూ లవ్ ఎండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (2019)
నటీనటులు: భరత్ బండారు, రోహిణి రాచెల్, స్వాతి భీమి రెడ్డి
సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
సాహిత్యం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
గానం: అపర్ణ నందన్, కె.ఎన్ రాహుల్, పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి అటుకుల
నిర్మాణం : శ్రీధర్ రెడ్డి అటుకుల
విడుదల తేది: 2019
ఒకసారిటు చూడు
నిను వదిలిన తోడు
నీ గూడు చేరిందా..
గతమన్నది నేడు
మిగిలిన కల కాదు
మౌనంగ దాగిందా..
ఎదురుగున్న రూపాన్ని
యెదకు హత్తుకో ఒకసారీ..
నిండి ఉన్న నీటిని
కళ్ళ నుండి జారని ఈసారీ..
నింగి నేల ఏకం ఐనా..
నీ ప్రేమని ఎవరు తీసుకెళ్ళరూ..
నీకని రాసుంటే.. నీదని నమ్ముంటే..
వెనకే వస్తాయి ప్రేమ గురుతులూ..
ఆకాశాన్నైనా.. ఎక్కామనుకున్నావు
ఆ.. వెన్నెలిదిగో.. అంత ప్రేమనివ్వు
కడలి అలల లాగే పడిలేస్తానన్నావు
కెరట మెదురయింది బతుకు నేర్పనివ్వు
ఇదిగో కళ్ళ ముందు కాంతి ఉండగా..
గడిచిన క్షణము చాటు చీకటేంటిలా..
సంద్రం హోరు దాటి నావ చేరగా..
తడిసిన తెరలు చూసి మాటలేంటిలా..
దరి చేరిన ఆనందం అందుకో..
నింగి నేల ఏకం ఐనా..
నీ ప్రేమని ఎవరు తీసుకెళ్ళరూ..
నీకని రాసుంటే.. నీదని నమ్ముంటే..
వెనకే వస్తాయి ప్రేమ గురుతులూ..
ఈ గాలి లాగే చుట్టూంటానన్నావు
తన గుండెలో నిండే ఊపిరి అవ్వు
ఈ నేల తీరే అడుగవుతానన్నావు
తానెళ్ళె దారి నువు కాచుకొండు
అరెరె ఇంత ఆనందముండగా..
నవ్వును దాచుకుంటు బాధ ఏంటిలా..
జరిగే కథలు చూసి కాలముండదూ..
మిగిలిన స్మృతుల వెంట పరుగులేంటిలా..
నీకోసం వచ్చిన ప్రేమందుకో..
నింగి నేల ఏకం ఐనా..
నీ ప్రేమని ఎవరు తీసుకెళ్ళరూ..
నీకని రాసుంటే.. నీదని నమ్ముంటే..
వెనకే వస్తాయి ప్రేమ గురుతులూ..
********** ********** ********** **********
మేమెం చేశాము (Female Version)… లిరిక్స్
చిత్రం: ట్రూ లవ్ ఎండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (2019)
నటీనటులు: భరత్ బండారు, రోహిణి రాచెల్, స్వాతి భీమి రెడ్డి
సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
సాహిత్యం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
గానం: అపర్ణ నందన్
దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి అటుకుల
నిర్మాణం : శ్రీధర్ రెడ్డి అటుకుల
విడుదల తేది: 2019
కలిసే ఉందామనుకున్నా..
కలలను కంటూ కూర్చున్నా..
నిజమయ్యే క్షణమెదురయ్యేసరికి
ఇంతగ మారాలా..
నీలోనే జీవిస్తున్నా..
నీతో జీవితమనుకున్నా..
బదులుగ మిగిలిన బాధల భారం
మోస్తూ బ్రతకాలా..
ఇరుగురు కన్నా ఈ కలలో..
చెరి ఒకరైనా ఈ కథలో..
నేరం చేసిందెవరు
అంటూ అడిగే ప్రశ్నై మిగలాల
మనదనుకున్నా రేపటిలో..
మనమేం అయ్యాం ఇంతటిలో..
సాయం చేసే బంధం బందించేస్తే..
వద్దని చెప్పాలా..
మేమెం చేశాము, ప్రేమించేశాము
తప్పేం చేశాము, మా కథ రాశాము
మేమెం చేశాము, ప్రేమించేశాము
తప్పేం చేశాము, మా కథ రాశాము
********** ********** ********** **********
మేమెం చేశాము (Male Version)… లిరిక్స్
చిత్రం: ట్రూ లవ్ ఎండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (2019)
నటీనటులు: భరత్ బండారు, రోహిణి రాచెల్, స్వాతి భీమి రెడ్డి
సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
సాహిత్యం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
గానం: కె.ఎన్ రాహుల్, పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి అటుకుల
నిర్మాణం : శ్రీధర్ రెడ్డి అటుకుల
విడుదల తేది: 2019
కలిసే ఉందామనుకున్నా..
కలలను కంటూ కూర్చున్నా..
నిజమయ్యే క్షణమెదురయ్యేసరికి
ఇంతగ మారాలా..
నీలోనే జీవిస్తున్నా..
నీతో జీవితమనుకున్నా..
బదులుగ మిగిలిన బాధల భారం
మోస్తూ బ్రతకాలా..
ఇరుగురు కన్నా ఈ కలలో..
చెరి ఒకరైనా ఈ కథలో..
నేరం చేసిందెవరు
అంటూ అడిగే ప్రశ్నై మిగలాల
మనదనుకున్నా రేపటిలో..
మనమేం అయ్యాం ఇంతటిలో..
సాయం చేసే బంధం బందించేస్తే..
వద్దని చెప్పాలా..
మేమెం చేశాము, ప్రేమించేశాము
తప్పేం చేశాము, మా కథ రాశాము
మేమెం చేశాము, ప్రేమించేశాము
తప్పేం చేశాము, మా కథ రాశాము