యేటికొక్క పూట… లిరిక్స్
చిత్రం: టక్ జగదీశ్ (2021)
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం:
గానం:
నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాణం: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
విడుదల తేది: 2021
Yetikokka Poota Song Telugu Lyrics
యేటికొక్క పూట యానాది పాట
నాయుడోరి నోట నుంచి వచ్చిందే మాట
ముద్ద పసుపై కురిసే ముచ్చటైన బంధం
బతుకు రాయలేనిదంటా… అమ్మ ముద్దు పాశం
కన్నపేగు పంచుకున్న… అన్నగారు తోడు
అక్కసెల్లెలి సెలబా… సెమ్మగిల్లనీడు
అంగిసుట్టు మడతేసి… మంచిసెడు వడబోసి
సుట్టుముట్టుకుంటాడే… సుట్టమల్లే కాపేసి
ఎర్రలెరువుగ మేసి… ఎర్రబడ్డ భూదేవి
కుర్ర గాలి తగిలాక… కళ్ళు తెర్సుకున్నాది
నిన్ను జూసి నికరంగా… రొమ్ము ఇడ్సుకున్నాది
Tuck Jagadish Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
ఇంకోసారి ఇంకోసారి… లిరిక్స్
చిత్రం: టక్ జగదీశ్ (2021)
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: శ్రేయాఘోషల్, కాళభైరవ
నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాణం: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
విడుదల తేది: 2021
Inkosaari Inkosaari Song Telugu Lyrics
ఇంకోసారి ఇంకోసారి… నీ పిలుపే నా ఎదలో చేరే
మళ్ళోసారి మళ్ళోసారి… పిలవాలంది నువు ప్రతిసారి
మనసుకే మొదలిదే… మొదటి మాటల్లో
వయసుకే వరదిదే… వలపు వానల్లో
కుదురుగా నిలవదే… చిలిపి ఊహల్లో
తగదనీ తెలిసినా… చివరి హద్దుల్లో
నా రాదారిలో… గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో… పున్నాగలా పూచావేమో
ఎగరేసెయ్ ఊహల్నే… చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే… చూసేద్దాం చుక్కల్నే
ఎగరేసెయ్ ఊహల్నే (ఎగరేసెయ్ ఊహల్నే)
చెరిపేసెయ్ హద్దుల్నే (చెరిపేసెయ్ హద్దుల్నే)
దాటేద్దాం దిక్కుల్నే (దాటేద్దాం దిక్కుల్నే)
చూసేద్దాం చుక్కల్నే (చూసేద్దాం చుక్కల్నే)
కవ్విస్తావు నీవు… నీ కంటి బాణాలతో, గుండె అల్లాడేలా
నవ్విస్తావు నీవు… నీ కొంటె కోణాలతో, చంటి పిల్లాడిలా
కన్నె ఈడు కోలాటమాడింది… కంటి పాపలో నిన్నే దాచింది
నిన్న లేని ఇబ్బంది బావుంది… నిన్ను కోరి రమ్మంటుంది