చిత్రం: తులసి (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: దేవి శ్రీ ప్రసాద్, మాల్గాడి శుభ
నటీనటులు: వెంకటేష్ , నయన తార
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది:12.10.2007
నే చుక్ చుక్ బండినిరో…
నే చుక్ చుక్ బండినిరో అరె కుదురుగా ఉండనురో
నా ఇంజను మీదే చెయ్యేసి హీటెక్కించు
కూ… చుకు చుకోక్ చుకు చుకోక్
నే చక చక చక్రంరో అరె కదిలితే ఆగనురో
నా ఘాడి పట్టాలెక్కించి జర లాగించు
కూ… చుకు చుకోక్ చుకు చుకోక్
హే మిర్యాగూడ స్టేషన్ కాడ ముస్కాఇస్తు సోకుల్ మాడా
హే మిర్యాగూడ స్టేషన్ కాడ ముస్కాఇస్తు సోకుల్ మాడా
బస్తీ పోరలు ఠయ్ రో అన్న జారే అన్ననులే
హే బీబీనగరం జంక్షన్ కాడ బిచాచేస్తూ తోడా తోడా
లాలు షేటు సై సై అన్నా నై నై చెప్పెనులే
అరె గాడ్నుంచి పరుగుల్ పెట్టి నేనీడకొచ్చి గీడనే ఆగినలే
గీడ్నే ఎందుకాగినవే పోరి
హే రాజా రాజా బొబ్బిలి రాజా
కంటి చూపుతోనే ఊపిండే లాల్ జండా
ఓ చకు చుకు బండమ్మో…
ఓ చుకు బండమ్మో మా కులుకుల గుంటమ్మో
నా చెయ్యేస్తే నీ ఇంజను పేలిపోద్దమ్మో
ఓ చకచక పరుగమ్మో నీ ఉరుకులు ఆపమ్మో
నా గాడ్లో పడితే నీ పట్టాలే ఫట్టమ్మో
చరణం: 1
నువ్వు అచ్చా టీకంటే నా ఏ.సి. భోగినే
కూల్ కమ్రా లెక్క ముస్తాబుచేసీ తీసుకొస్తానులే
కూ… చుకు చుకోక్ చుకు చుకోక్
నీ స్పీడు చూస్తుంటే అసలాగేలా లేవేే
నువ్వు టిక్కెట్టిస్తే ఒక్కసారి టూర్ కొస్తన్లే
కూ… చుకు చుకోక్ చుకు చుకోక్
హా పందిరిమంచం బెర్త్ లో నింపి
అత్తరు గంధం మస్త్ గా కలిపి
బిల్కుల్ నీకే బిస్తర్ వేస్తా తిన్పీయ్ రా కుల్ఫీ
హే ఊయ్యాలూగే ఊపులతోటి
కొండాకోనలు మలుపులు దాటి
ఘాడి నింకా చేరుద్దాంలే ఖండాలా దాటి
అరె మల్పుల కలగల్పుగా నను పడుకోనీరా నీతోనే పల్టీ
హే రాజా రాజా బొబ్బిలి రాజా
కంటి చూపుతోనే ఊపిండే లాల్ జండా
చరణం: 2
నువ్ గింత చోటిస్తే బెర్తేసి లేనట్టే
నీ కూపేకొచ్చి కోకరైక కూపితీస్తనులే
కూ… చుకు చుకోక్ చుకు చుకోక్
నువ్వు సీటీ కొట్టేస్తే నా చీరల కొంగుల్నే
ఆ సిగ్నల్ లెక్క గాల్లో కిట్లా గిర్రాటేస్తనులే
కూ… చుకు చుకోక్ చుకు చుకోక్
కిటికీ పక్కన చోటే పట్టి చీకటి తెరలే చాటే పెట్టి
అప్పుడౌను ఒకటయ్యేలా కిటుకే చేస్తనులే
హే ప్యాసింజర్లని పక్కకు నెట్టి పాసల్‌గూర నీకే ఇచ్చి
మస్క్ ల కొద్ది మష్క్ ల నీకే ఇష్క్ లు ఇస్తనులే
ఇక వర్సగా భలే బిర్సుగా నా గొల్సే గుంజర జల్సా నెల్వంక
హే రాజా రాజా రాజా బొబ్బిలి రాజా
కంటి చూపుతోనే ఊపిండే లాల్ జండా
********* ********* ********
చిత్రం: తులసి (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ప్రియ , టిప్పు
పల్లవి :
అరె తుల తుల తులసి నీ జోరు తెలిసి
వచ్చాను తెరతీసి మంచమేసి ఆ దుప్పటేసి
నిను కలి కలి కలిసి నీ గుండె గెలిచి
వచ్చాను నీకేసి గొళ్ళెమేసి గంతులేసి
సి సి సి ఎదురు చూసి సి సి
ఎదను మూసి, సి సి ఉన్నది ప్రేయసి
సి సి సి సొగసు తీసి సి సి
వగలు వేసి సి సి కాల్చుకోనా కసి
అరె తుల తుల తులసి నీ జోరు తెలిసి
వచ్చాను తెరతీసి ఆ మంచమేసి ఆ దుప్పటేసి
చరణం: 1
హో ఇంటి పేరు మార్చుకున్నా పరువమంత పేర్చుకున్నా
వయసు వండి వార్చుకున్నా నిన్ను నమ్మేసి
హేయ్ ఇన్నినాళ్ళు ఓర్చుకున్నా నిన్ను నాలో చేర్చుకోనా
ఉన్నదంత ఊర్చుకోనా కౌగిల్లు కమ్మేసి
హే పచ్చి అ పచ్చి అ పచ్చి అందాలు గుట్టు
తెచ్చి తెచ్చి తెచ్చి నాలోన నిన్ను ముంచి
అ ముంచి అ ముంచి కమ్మేసుకుంట పైనుంచి
ఓ వచ్చి వచ్చి వచ్చి నీ పండు నేను తుంచి
అ తుంచి అ తుంచి నా వేడి నీకు పంచి
అ పంచి అ పంచి నే వెళ్ళిపోను నీనుంచి
అరె తుల తుల తులసి నీ జోరు తెలిసి
వచ్చాను తెరతీసి ఆ మంచమేసి ఆ దుప్పటేసి
నిను కలి కలి కలిసి నీ గుండె గెలిసి వచ్చాను నీకేసి
గొళ్ళెమేసి హా గంతులేసి హేయ్
చరణం: 2
హా మువ్వలాగా ఝల్లుమంటా
పువ్వులాగా ఘొల్లుమంటా
తలుపులాగా బళ్ళుమంటా నిన్ను అల్లేసి
అరెరరె మబ్బులాగా ఝల్లుమంటా
మెరుపులాగా ఝల్లు మంటా
పిడుగులాగా ఫెళ్ళుమంటా నీపైన ఒల్లేసి
ఓ నచ్చి అ నచ్చి అనచ్చి నువ్వంటే నాకు పిచ్చి
అ పిచ్చి అ పిచ్చి నీవెంటే నేను వచ్చి
అ వచ్చి అ వచ్చి అందించు కుంటా నా రుచి
ఆ రెచ్చి ఆ రెచ్చి ఆ రెచ్చి నీ రెక్కపైన గిచ్చి
అ గిచ్చి అ గిచ్చి నీ పక్కలోన చచ్చి
ఆ బుడ్డి అ చచ్చి ఆడేసుకుంటా దోబూచి
అరె తుల తుల తులసి నీ జోరు తెలిసి
వచ్చాను తెరతీసి ఆ మంచమేసి దుప్పటేసి
నిను కలి కలి కలిసి నీ గుండె గెలిసి వచ్చాను నీకేసి
గొళ్ళెమేసి సి సి గంతులేసి సి సి
********* ********* *********
చిత్రం: తులసి (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: చిత్ర, సాగర్
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం
అడుగునౌతాను నీ వెంట నేనూ
తోడుగా నడవగా చివరి దాకా
గొడుగునౌతాను ఇకపైన నేనూ
వానలో నిన్నిలా తడవనీకా
నిన్నొదిలి క్షణమైన అసలుండలేను
చిరునవ్వు నౌతాను పెదవంచునా
నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలిసిగ్గు నేనవ్వనా !
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం
హా వెన్నెలౌతాను ప్రతి రేయి
నేను చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరౌతాను నీలోన నేను
ఎన్నడూ నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ
నేనుండిపోతాను పారాణిలా
చిరుచెమట పడుతుంటే నీ నుదుటిపైనా
వస్తాను చిరుగాలిలా!
********* ********* ********
చిత్రం: తులసి (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సునీత, వేణు
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి
వచ్చాయే నువ్వే నవ్వంగా
నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి
చేరాయే నువ్వే చూడగా
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
చరణం: 1
నాపేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే
నారూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే
తీయ్యంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా
ప్రేమంటూ కానే కాదంటా
విట్టంగా కొత్తంగా ప్రేమను మించే పదమింక
మన జంటే కనిపెట్టాలంట
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
చరణం: 2
గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగిందే
నేలైన నిను తడితే ఎదలో అసూయ కలిగిందే
గారంగా గర్వంగా జొడి మనమే కట్టంగా
ఏడే జన్మలు సరిపోవంటా
దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి
ఎన్నో జన్మలు సృష్టించాలటా
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
******** ********* ********
చిత్రం: తులసి (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మమత మోహన్ దాస్, నవీన్ (నవీన్ మాధవ్)
ఓ మియా మియా మియా
షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా
ఓ మియా మియా మియా
షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా
హేయ్ మియా మియా మియా
షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా
మియా మియా ఓ ఓ మియా మియా ఓ ఓ
ఓ కియా కియా కియా వగువానేసో క్యోం కియా
కియా కియా ఓ ఓ కియా కియా ఓ ఓ
అరకిలో అందంతో పాటు పావుకిలో పొగరుంటుంది
ఒక కిలో ఓవరాక్షన్ చేసి ఆడుకుంటోంది
అరడజన్ అలకలతోపాటు పావుడజన్ మెలికలు తిరిగి
ఒక డజన్ కులుకులునే చూపి కన్‌ఫ్యూజ్ చేస్తుంది
మియా మియా కియా కియా
హే మియా మియా మియా
షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా
మియా మియా ఓ ఓ మియా మియా ఓ ఓ
ఓ కియా కియా కియా వగువానేసో క్యోం కియా
కియా కియా ఓ ఓ కియా కియా ఓ ఓ
చరణం: 1
జనవరిలా వచ్చేస్తారు డిసెంబర్ కెళతారు
క్యాలండర్ లాంటి వాళ్ళు మీకుర్రాళ్ళు
సరికొత్తవి వెతికేస్తారు పాతవి వదిలేస్తారు
కంప్యూటర్ లాంటి వాళ్ళు కంత్రీ గాళ్ళు
ఐమాక్స్ లకి ఐస్ క్రీములకి ఏక్సప్టే చేస్తుంటారు
అన్నీ చేసి క్లైమాక్స్ ల్లో అది ఫ్రెండ్షిప్ అంటారు
తమ ఖర్చులకే బిల్ కట్టిస్తూ బిల్లగేట్సే నువ్వంటారు
కనపడినోళ్ళు వీడెవడంటే కజినంటూ చెబుతారు
మియా మియా కియా కియా
హే మియా మియా మియా
షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా
మియా మియా ఓ ఓ మియా మియా
హే మియా మియా మియా
హి ఈజ్ ద మేన్ మేడ్ ఇన్ ఇండియా
మియా మియా ఓ ఓ కియా కియా
చరణం: 2
చొరవగా మా చెంతకొచ్చి మైక్రోస్కోప్ పెట్టేసి
మా తప్పులు వెతికేస్తారు మీ మగవాళ్ళు
ఒకటికి పది మిక్స్ చేసి సినిమా స్కోప్ వేసేసి
గాసిప్ లు చాటేస్తారు గడసరిగాళ్ళు
మీ అందాన్నే పొగిడామంటే పూలల్లో పూజిస్తారు
మీ లోపాలే తెలిపామంటే పూలన్‌దేవవుతారు
అనుకూలంగా ఉన్నట్టయితే నా స్వామి నువ్వంటారు
అనుమానాలే కలిగాయంటే సునామి చూపిస్తారు
మియా మియా కియా కియా
ఓ మియా మియా మియా
షి ఈస్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా
మియా మియా ఓ ఓ మియా మియా
హే మియా మియా మియా
హి ఈజ్ ద మేన్ మేడ్ ఇన్ ఇండియా
మియా మియా ఓ ఓ మియా మియా
******** ******* *********
చిత్రం: తులసి (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్
ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ స్పైడర్ మాన్
ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్
ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ స్పైడర్ మాన్
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్
హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ ఐ యమ్ మిస్టర్ జీని
తీరుస్తా తీరుస్తా మీ కోరికలేమైనా గానీ
హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ ఐ యమ్ మిస్టర్ జీని
తీరుస్తా తీరుస్తా మీ కోరికలేమైనా గానీ
ఝల్లు మంత్రం వేసి అడిగిందల్లా తెస్తా
హాంఫట్టంటూనే నింగిలోన తారలైనాగాని పట్టుకొస్తా
హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ మై హు మిస్టర్ జీని
తీరుస్తా తీరుస్తా మీ కోరికలేమైనా గానీ
ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ స్పైడర్ మాన్
ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్
ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ స్పైడర్ మాన్
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్
చరణం: 1
గాలిలోన తేలిపోయే మూడు చక్రాల సైకిల్ తెస్తా
నీటిపైన దూసుకెళ్ళే చిక్ బుక్ రైలు చూపుతా
చేతి లోన వాలిపోయే ఏడువర్ణాల రెయిన్బో తెస్తా
జేబులోన నిండిపోయే నీలి ఆకాశాన్ని వంపుతా
ఆకలి పుట్టందంటే ఐస్‌క్రీం బుట్టలు తెస్తా
దాహం కలిగిందంటే మిల్క్ షేక్ వాన లాగ కురిపిస్తా
హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ మై హు మిస్టర్ జీని
తీరుస్తా తీరుస్తా మీ కోరికలేమైనా గానీ
డాడీ యు నో సంథింగ్ ఐ లవ్ యు డాడీ
చరణం: 2
క్లాస్ వర్క్ చేసుకెళ్ళే ఆటోమేటిక్ పెన్సిల్ ఇస్తా
స్కూల్ బ్యాగ్ మోసుకెళ్ళే ఒక్క రోబో నీకై పంపుతా
దూరమున్నా నన్ను చేరే చిన్ని ఫ్లైయింగ్ సాసరే ఇస్తా
ఎన్నడైనా నన్నుచూపే బుల్లి టెలిస్కోప్ దింపుతా
రోబో గీబో వద్దు రోజూ నువు రావాలి
టెలీస్కోపే వద్దు ఎప్పుడూ కళ్ళముందు నువ్వుండాలి