U Turn (2018)

చిత్రం: U టర్న్ (2018)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: సాయి కిరణ్
గానం: రఘు దిక్సిత్
నటీనటులు: అనిరుద్ రవిచంద్రన్, సమంత, రాహుల్ రవిచంద్రన్, ఆది పినిశెట్టి, భూమిక
దర్శకత్వం: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాస చిత్తూరి
విడుదల తేది: 13.09.2018

దిశల్ని మార్చుకున్న
ఎలాంటి దారిలో పోతున్న
మనస్సు మారుతున్న
గతాల జ్ఞాపకం ఏదైనా

సదా… నువ్వే కదా ప్రతిక్షణానా
సదా… ఎలాగా చూసిన
సంతోషాల రూపం నువ్వే
కదిలిన కన్నీటి ధారవె
నడిపిన బాణం నువ్వే
ముసిరిన భయాల నీడవే

మరొక్క సారి చూడు
కాలాల్లో తేలుతున్న
అవేవే ప్రశ్నలే లోలోనా
ఎలాంటి ఊహలైన
నువ్వైన పత్రాలే ఎన్నైనా

ఏదో తెలీని ప్రయాణమేదో
ఎటో ముగింపనెదేటో
వెతికిన నిజం నువ్వే
కలిసిన ప్రపంచము నువ్వే
నడిచిన దారి నువ్వే
నిలిచిన తీరానివి నువ్వే

మరొక్క సారి చూడు

నువ్వే ఇలా ప్రతి కధ నువ్వేగా
నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా
నువ్వే ఇలా ప్రతి కధ నువ్వేగా
నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా

సదా… నువ్వే కదా ప్రతిక్షణానా
సదా… ఎలాగా చూసిన
నువ్వే ఇలా ప్రతి కధ నువ్వేగా
నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా

మరొక్క సారి చూడు