చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సోను నిగమ్, రాహుల్ నంబియర్
నటీనటులు: యశో సాగర్, స్నేహ ఉల్లాల్
దర్శకత్వం: ఎ. కరుణాకర్
నిర్మాతలు: జి. యస్.రంగనాథ్, బి. పి.సోము
విడుదల తేది: 18.07.2008
ఎంత అందమో ఎంత అందమో
నమ్మలేను నా కళ్ళని
ఎంత సేపిలా ఎంత చూసినా
నిన్ను వీడి నే వెళ్లనే
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా
ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా తరిగిపోని లావణ్యమా
ప్రియతమా విరగబూసే వాసంతమా
ప్రియతమా ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా
సఖి చెలి సఖి చెలి సుధామాధురి
నిజానికి నువ్వే మరి సదా నా సిరి
గులాబీలో శ్వాసే చేరగా చలాకీగా నీలా మారదా
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
హో చామంతి కైనా పూబంతి కైనా లేదు ఇంత సున్నితం
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా
ప్రియా అని ప్రియా అని పిలుస్తావని
నరాలలో ప్రతి కణం నిరీక్షించని
సరాగమా నీపై ధ్యాసతో
ప్రతి క్షణం ఉన్నా ఆశతో
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
హో నీ చేతిలోన ఉన్నాయి నేడు నా చేతి గీతలు
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా
ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా తరిగిపోని లావణ్యమా
ప్రియతమా విరగబూసే వాసంతమా
ప్రియతమా ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా