రేపవలు వేకనుల… లిరిక్స్
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020)
నటీనటులు: సత్యదేవ్, నరేష్, సుహాస్, రూప కొడువాయూర్
సంగీతం: బిజీబల్
సాహిత్యం: రెహమాన్, రఘుకుల్ మోకిరాలా
గానం: బిజీబల్, సంగీత శ్రీకాంత్
దర్శకత్వం: వెంకటేష్ మహా
నిర్మాణం : విజయ ప్రవీణ పరుచూరి, శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 2020
లా ల ల ల… లా ల ల ల…
లా లా లా లా లా…
రేపవలు వేకనుల… నిన్నే చూస్తున్నా
లా ల ల ల… లా ల ల ల…
నా తనివి తీరదుగ ఎన్నాళ్ళైనా…
రావా ల ల… నీవే ల ల…
మరలా కురిసే వరములు తేవా…
ఆ ఆ… లోకాన ప్రేమంతా… రూపాన వేరైనా
చేరేటి తీరాన నీవా… ల ల ల ల
కాలాన్నాపి నాతో ఉండి పోవా…
రేపవలు వేకనుల… నిన్నే చూస్తున్నా
నా తనివి తీరదుగ ఎన్నాళ్ళైనా…
సమయం పరుగున కదిలే… మలుపులు తిరిగే
చక చక ఎన్నో మారేలే…
అయినా తొలకరి చెలిమే… తొణకని గుణమే
చెరగని నవ్వే తాకేలే…
నీ చూపు నా వైపు చూస్తుంటే… చూశాను నీలోని కేరింతే
ఇంకా అలాగే ఎలాగో ఈ పసితనం…
ఎదలో తొలి పరవశమే… కలిగిన క్షణమే కరగక కాలంతో పాటే
ఎదిగే ప్రతి ఒక దినమే… గురుతుల వనమే
పెరిగెను దూరంతో పాటే…
ఏమైనా మారేనా నా నిన్న… నాలానే నేడున్న రేపైనా
ఇంతే ప్రపంచం సమస్తం… ఈ మనిషికి…
నా మనసు నీ కొరకు శిల్పంలా ఉన్న…
నీ తలంపులో మునిగి జీవిస్తున్నా…
నిన్నే నేడై కలిసి మురిసే క్షణములలోన…
ఈ దూర భారాలు… ఇన్నాళ్ల మౌనాలు
తీరేటి దారేదో చూపీ…
ప్రాణంలోన పాటై నిండిపోవా…
********** ********** ********** **********
ఆనందం, ఆరాటం… లిరిక్స్
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020)
నటీనటులు: సత్యదేవ్, నరేష్, సుహాస్, రూప కొడువాయూర్
సంగీతం: బిజీబల్
సాహిత్యం: రెహమాన్
గానం: గౌతమ్ భరద్వాజ్, సౌమ్యా రామకృష్ణన్
దర్శకత్వం: వెంకటేష్ మహా
నిర్మాణం : విజయ ప్రవీణ పరుచూరి, శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 2020
ఆనందం, ఆరాటం…
ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం…
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం…
చిగురై పుడమి కడుపున… మొదలయ్యేటి ఆ మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురే చూసే… నిమిషాలే నిజమైన వేడుక కాదా
ఫలితం మరిచి పరుగే తీసే పయనం… ప్రతి పూటకోక కానుక అయిపోదా
నీరు ఆవిరిగ ఎగిసినది…
తపన పెరిగి అది కడలినొదిలినది
కారు మబ్బులుగ మెరిసినది…
అణువు అణువు… ఒక మధువుగా మారి
తానే… వానై…
అడుగు అడుగు కలిపి… కదిలిపోయే కడలింటి దారే…
మలుపేదైనా గెలుపే చూసే… అడుగుల్లో అసలైన ఆ ఆనందం
కదిలే నదిలో… ఎగిసే అలలా
ఎదలోపల క్షణమాగని సంగీతం కాదా…
ఇంద్రధనస్సులో వర్ణములే…
పుడమి ఒడిలో పడి… చిగురు తొడిగినవి
శరదృతువులో సరిగమలే…
తొడిమె తడిమే… తొలి పిలుపుగ మారి
దాహం… తీరే…
విరుల సిరులు విరిసి… మురిసిపోయే సరికొత్త మాయే…
ఉబికే మౌనం… ఉరికే ప్రాణం
తనకోసం దిగి వస్తే ఆ ఆకాశం…
కరిగే దూరం… తెరిచే ద్వారం
జగమంతట పులకింతలు పూసే వాసంతం…
ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం…
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం…
చిగురై పుడమి కడుపున… మొదలయ్యేటి ఆ మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురే చూసే… నిమిషాలే నిజమైన వేడుక కాదా
ఫలితం మరిచి పరుగే తీసే పయనం… ప్రతి పూటకోక కానుక అయిపోదా
********** ********** ********** **********
నింగి చుట్టే మేఘం… లిరిక్స్
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020)
నటీనటులు: సత్యదేవ్, నరేష్, సుహాస్, రూప కొడువాయూర్
సంగీతం: బిజీబల్
సాహిత్యం: విశ్వా
గానం: విజయ్ ఏసుదాస్
దర్శకత్వం: వెంకటేష్ మహా
నిర్మాణం : విజయ ప్రవీణ పరుచూరి, శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 2020
నింగి చుట్టే మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…
నింగి చుట్టే.. చిన్ని.. మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…
తమదేదో తమదంటూ.. మితిమీర తగదంటూ..
తమదైన తృణమైన చాలను వరస…
ఉచితాన సలహాలు.. పగలేని కలహాలు..
యెనలేని కదనాలు.. చోటిది బహుశా…
ఆరాటం తెలియని జంజాటం.. తమదిగా చీకు చింత..
తెలియదుగా…
సాగింది ఈ తీరు.. కథ సగటుల చుట్టూ..
నింగి చుట్టే.. మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు.. మునిలా, మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు..
సిసలైన సరదాలు.. పడిలేచే పయణాలు..
తరిమేసి తిమిరాలు.. నడిచేలే మనస…
విసుగేది ధరిరాని.. విధిరాత కదిలేని..
శతకోటి సహనాల.. నడవడి తెలుసా…
చిత్రంగా, కలివిడి సుతారంగా..
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా,
సాగింది ఈ తీరు.. సంగతుల కనికట్టు…
నింగి చుట్టే.. చుట్టే.. మేఘం యెరుగదా.. యెరుగదా
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…