Uppena (2020)

Uppena (2020)

రంగులద్దుకున్నా.. తెల్ల రంగులౌదాం… లిరిక్స్

చిత్రం: ఉప్పెన (2020)
సంగీతం: దేవిశ్రీపసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాజిన్ నిజ‌ర్, హ‌రిప్రియ
నటీనటులు: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్‌ సేతుపతి
దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాణం: నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌
విడుదల తేది: 2020

Ranguladdhukunna Song Telugu Lyrics

జింజిక్ జింజిక్ చా… జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా… జింజిక్ జింజిక్ చా

రంగులద్దుకున్నా… తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా… కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటుకున్నా… పచ్చి పిందెలౌదాం
మట్టి లోపలున్నా… జంట వేరులౌదాం
ఎవ్వరీ కంటిచూపు చేరలేని… ఎక్కడా మన జంట ఊసురాని
చోటున పద నువ్వు నేనుందాం

జింజిక్ జింజిక్ చా… జింజిక్ జింజిక్ చా
హ్మ్ హ్మ్…
రంగులద్దుకున్నా… తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా… కొమ్మలల్లే ఉందాం

తేనె పట్టులోన… తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోన… ప్రేమ గుట్టుగుందిలే
వలలు తప్పించుకెళ్ళు… మీనాల వైనాల
కొంటె కోణాలు తెలుసుకుందాం… ఆఆ
లోకాల చూపుల్ని… ఎట్టా తప్పించుకెళ్ళాలో
కొత్త పాఠాలు నేర్చుకుందాం…
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం… ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం
ఏ క్షణం విడివిడిగా లేమందాం…

రంగులద్దుకున్నా… తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా… కొమ్మలల్లే ఉందాం

మన ఊసు మోసే… గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే… నేలను పాతి పెడదాం
చూస్తున్న సూర్యుని తెచ్చి… లాంతర్లో దీపాన్ని చేసి
చూరుకేలాడదీద్దాం… ఆఆ
సాక్ష్యంగా సంద్రాలు ఉంటె… దిగుడు బావిలో
దాచి మూత పెడదాం…
నేనిలా నీతో ఉండడం కోసం… చేయనీ ఈ చిన్నపాటి మోసం
నేరమేం కాదే… ఇది మన కోసం

రాయిలోన శిల్పం దాగి ఉండునంటా… శిల్పి ఎదురైతే బయటపడునంటా
అద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా… ఆ ఆ
నీలో ఉన్న నేనే బయటపడిపోత… ఆఆ
పాలలో ఉన్న నీటిబొట్టులాగా… నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నీనిలా నీ లోపల దాక్కుంటా…
హైలెస్సా హైలెస్సా హాయ్… హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్… హైలెస్సా హైలెస్సా హాయ్

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ధక్ ధక్ ధక్ సాంగ్… లిరిక్స్

చిత్రం: ఉప్పెన (2020)
సంగీతం: దేవిశ్రీపసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శరత్‌ సంతోష్‌, హరి ప్రియ
నటీనటులు: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్‌ సేతుపతి
దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాణం: నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌
విడుదల తేది: 2020

Dhak Dhak Dhak Song Telugu Lyrics

నువ్వు నేను ఎదురైతే… ధక్ ధక్ ధక్
మనసు మనసు దగ్గరైతే.. ధక్ ధక్ ధక్
ఆశలు అలలై పొంగుతుంటే.. ధక్ ధక్ ధక్
ఆకలి నిద్దుర మింగుతుంటే.. ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే.. ధక్ ధక్ ధక్ ధక్ ధక్

చూపుల పిలుపులు మోగుతుంటే.. ధక్ ధక్ ధక్
మాటలు గొంతుల ఆగుతుంటే.. ధక్ ధక్ ధక్
గుండెకు చెమటలు పడుతుంటే.. ధక్ ధక్ ధక్
ముందుకు వెనకకు నెడుతుంటే.. ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే.. ధక్ ధక్ ధక్ ధక్ ధక్

చీటికీ మాటికీ గుర్తొస్తే.. బౌ బౌ బౌ
మిగతావన్నీ మరుపొస్తే.. కి కి కృ
కాలానికి ఇక కరువొస్తే.. అంబా అంబా అంబా
ఆలోచనలకు బరువొస్తే.. కొ కొ క్కో
ఊపిరి మొత్తం ఉప్పెనైతే.. ధక్ ధక్ ధక్ ధక్ ధక్

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

నీ కన్ను నీలి సముద్రం… లిరిక్స్

చిత్రం: ఉప్పెన (2020)
సంగీతం: దేవిశ్రీపసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జావెద్‌ అలీ
నటీనటులు: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్‌ సేతుపతి
దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాణం: నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌
విడుదల తేది: 2020

Nee Kannu Neeli Samudram Song Telugu Lyrics

ఇష్క్ షిఫాయా, ఇష్క్ షిఫాయా

ఇష్క్ పర్దే మేన్ కిసీ కి ఆంఖాన్ మేన్ లఫ్రేజ్ హై

ఇష్క్ షిఫాయా, మెహబూబ్ కా సాయ
ఇష్క్ మల్-మల్ మేన్ యే లిప్తా హువా తబ్రేజ్ హై

ఇష్క్ హై పీర్ పై-అంబర్, అరె ఇష్క్ అలీ దమ్ మస్త్ ఖలందర్
ఇష్క్ హై పీర్ పై-అంబర్, అరె ఇష్క్ అలీ దమ్ మస్త్ ఖలందర్

ఇష్క్ ఖబీ కర్తా హై, అరె ఇష్క్ ఖబీ హై ఏక్ సమందర్
ఇష్క్ ఖబీ కర్తా హై, అరె ఇష్క్ ఖబీ హై ఏక్ సమందర్

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అంధుట్లో
పడవ ప్రయాణం

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అంధుట్లో
పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాల హారం
నను తీరానికి లాగేటి
దారం దారం

నీ నవ్వు ముత్యాల హారం
నను తీరానికి లాగేటి
దారం దారం

నల్లనైనా ముంగురులే ముంగురులే
అల్లరేదో రేపాయిలే

నువ్వు తప్ప నాకింకో
లోకాన్నీ లేకుండ కప్పాయిలే
ఘల్లుమంటే నీ గాజులే నీ గాజులే
జల్లుమందే నా ప్రాణమే నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులాగా ప్రేమే

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అంధుట్లో
పడవ ప్రయాణం

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అంధుట్లో
పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాల హారం
నను తీరానికి లాగేటి
దారం దారం

నీ నవ్వు ముత్యాల హారం
నను తీరానికి లాగేటి
దారం దారం

చిన్ని ఇసుక గూడు కట్టినా
నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు
పుట్టలేదు తెలుసా ..
ఆ గోరువంక పక్కనా
రామ చిలుక ఎంత చక్కనా
అంతకంటే చక్కనంత
నువ్వుంటే నా పక్కనా ..

అప్పు అడిగానే ..
కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే భూమి  పైన భాషలన్నీ
చెప్పలేమన్నాయే అక్షరాలూ ప్రేమణీ

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అంధుట్లో
పడవ ప్రయాణం

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అంధుట్లో
పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాల హారం
నను తీరానికి లాగేటి
దారం దారం

నీ నవ్వు ముత్యాల హారం
నను తీరానికి లాగేటి
దారం దారం

నీ అందమంత ఉప్పెన
నన్ను ముంచినాది చప్పునా
ఎంత ముంచేసినా తేలే
బంతిని నేనేనానా
చుట్టూ ఎంత చప్పుడొచ్ఛినా
నీ సావదేదో చెప్పదా

ఎంత దాచేసినా నిన్ను
జల్లడేసి పట్టనా ..
నీ ఒగలే ఊపిరైనా పిచ్ఛోడిని
నీ ఊపిరి ప్రాణమైన పిల్లాడిని
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని

ఇష్క్ హై పీర్ పై-అంబర్, అరె ఇష్క్ అలీ దమ్ మస్త్ ఖలందర్
ఇష్క్ హై పీర్ పై-అంబర్, అరె ఇష్క్ అలీ దమ్ మస్త్ ఖలందర్

ఇష్క్ ఖబీ కర్తా హై, అరె ఇష్క్ ఖబీ హై ఏక్ సమందర్
ఇష్క్ ఖబీ కర్తా హై, అరె ఇష్క్ ఖబీ హై ఏక్ సమందర్

ఇష్క్ షిఫాయా, ఇష్క్ షిఫాయా
ఇష్క్ పర్దే మేన్ కిసీ కి ఆంఖాన్ మేన్ లఫ్రేజ్ హై

ఇష్క్ షిఫాయా, మెహబూబ్ కా సాయ
ఇష్క్ మల్-మల్ మేన్ యే లిప్తా హువా తబ్రేజ్ హై

Uppena Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Desamuduru (2007)
error: Content is protected !!