చిత్రం: ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2012)
సంగీతం: విద్యాసాగర్, బోబో శశి
సాహిత్యం: ఆర్.రాము
గానం: కార్తిక్, అన్వేష
నటీనటులు: బాలక్రిష్ణ, మంచు మనోజ్, మంచు లక్ష్మి
దర్శకత్వం: శేఖర్ రాజా
నిర్మాత: మంచు లక్ష్మి
విడుదల తేది: 27.07.2012
అనురాగమే హారతులాయే అభిమానమె దీవెనలాయె
శుభమేలే నిత్యం చెంతకే వసంతం
అనురాగమే హారతులాయే అభిమానమె దీవెనలాయె
ఆనందంమే నిత్యం చెంతకే సంబరం
ఆ మహలే సిరులకు మూలం అలరించే కళలకు ప్రాణం
ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిధ్యం
అనునిత్యం కమణీయం
అనగనగా ఒక రారాజు మదినేలే ఈ మహారాజు
నిలువెల్లా కరునై పంచునే అమృతం
ఇల వేల్పుగ తానే ఉన్న గొప్పచరితం
కలిమి చెలిమి కలిసి మెలిసి కొలువై ఉన్న నీలోన
మనసు మమతా జతగా మురిసి మెరిసే ఘాంధర్వ భవనం
చెల్లె కన్నకూతురల్లే ఇల్లే ఆరోప్రాణమల్లే
తలచే ధన్యజీవి ఇతనే ఇలలో
కంటి చూపే హారతల్లే కాలి మన్నే కుంకుమల్లే
ఊరే ప్రణమిల్లె
అనగనగా ఒక రారాజు మదినేలే ఈ మహారాజు
నిలువెల్లా కరునై పంచునే అమృతం
ఇల వేల్పుగ తానే ఉన్న గొప్పచరితం
ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం
న్యాయం ధర్మం మనిసై వెలచి నడిపే ఈ రామరాజ్యం
ముప్పే మత్తగజమే పుట్టేదాని కుంభస్థలమే
ఉగ్రసింహమల్లే నిలిచే అతడే
చట్టమైన తప్పుచేస్తే – శిక్ష వేసి రక్షనిచ్చి
రాజే కానీలే
అనురాగమే అక్షతలాయె ఆరాటమె ఆహుతులాయే
ముడివేసే బంధం జంటగా జీవితం
మృదువైన ఊసులు మొత్తం కథ లిఖితం