వస్తున్న వచ్చేస్తున్నా… లిరిక్స్
చిత్రం: ‘వి’(2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: శ్రేయా గోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి
నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావ్ హైదరి
దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి
నిర్మాణం: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
విడుదల తేది: 05.09.2020
చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక..
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా…
చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక..
ఏం చేస్తున్న ధ్యాసంతా నీమీదే తెలుసా…
నిను చూడనిదే ఆగనని ఊహల ఉబలాటం..
ఉసి కొడుతుంటే..
వస్తున్న వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా..
కవ్విస్తూ కనబడకున్నా.. ఉవ్వెత్తున ఉరికొస్తున్న…
చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక..
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా…
చెలియా చెలియా.. నీ. తలపే తరిమిందే.
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచనా..
గడియో క్షణమో.. ఈ దూరం కలగాలే..
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా..
మురిపించే ముస్తాబై ఉన్నా..
దరికొస్తే అందిస్తాగా, ఆనందంగా…
ఇప్పటి ఈ ఒప్పందాలే.. ఇబ్బందులు తప్పించాలే..
చీకటితో చెప్పించాలే.. ఏకాంతం ఇప్పించాలే
వస్తున్న వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా..
కవ్విస్తూ కనబడకున్నా.. ఉవ్వెత్తున ఉరికొస్తున్న…
చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక..
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
మనసు మరీ మత్తుగా… లిరిక్స్
చిత్రం: ‘వి’(2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: అమిత్ త్రివేది, షాషా తిరుపతి, యాజిన్ నిజార్
నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావ్ హైదరి
దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి
నిర్మాణం: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
విడుదల తేది: 05.09.2020
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళీ వినాలి కౌగిలి
అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
పూల నావ గాలి తోవ హైలోహైలెసో…
చేరనీవా చేయనీవా సేవలేవేవో…
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల
మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే మరో జన్మాన్నె పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో…
నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో…
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళీ వినాలి కౌగిలి…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
రంగ రంగేళి… లిరిక్స్
చిత్రం: ‘వి’(2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాజిన్ నిజార్, నిఖితా గాంధీ
నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావ్ హైదరి
దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి
నిర్మాణం: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
విడుదల తేది: 05.09.2020
సరసర సర్రా వేడెక్కింది… సాయంత్రం గాలి
(సరసర సర్రా వేడెక్కింది… సాయంత్రం గాలి)
బిర బిర బిర్రా బీచ్ నిండా… బీర్లు పొంగాలి
(బిర బిర బిర్రా బీచ్ నిండా… బీర్లు పొంగాలి)
మత్తై పోవాలి… గమ్మత్తై పోవాలి… చిత్తై పోవాలి
రంగ రంగేళి… రంగ రంగ రంగేళి
మస్తో మస్తుగ మబ్బుల ఎత్తుకు… నిచ్చెన వెయ్యాలి
రంగ రంగేళి… రంగ రంగ రంగేళి
రచ్చో రచ్చగ… పచ్చిగ పిచ్చిగ ముచ్చట తీరాలి
ఓరబ్బా, అబ్బబ్బా… ఓరబ్బా ఆ ఆ ఆఆ
ఓరబ్బా, అబ్బబ్బా… ఓరబ్బా ఆ ఆ ఆఆ
చెక్బక భూమ్ భం… చెక్బక భూమ్ భం
పడి పడి పండ్కో బెట్టి… టచింగ్ టచింగ్
చెల్ మొదలెడుదామా..!
మజ్జా మజ్జా కాళ్ల గజ్జ… సయ్యాటాడి ప్లానెట్ వేడి పెంచేద్దామా
వందే హంగామా… లైన్ అఫ్ కంట్రోల్ హద్దులు మీరి మస్తీ చేద్దామా
ఆఆ… గుర్తుకు తెచ్చుకొని చిట్టా రాయాలి
పెండింగ్ ఉన్న ఫాంటాసిలకు… టిక్కులు పెట్టాలి
ఇల్లై పోవాలి, థ్రిల్లై పోవాలి… చిల్లై పోవాలే… ఏ హే హే హే
రంగ రంగేళి… రంగ రంగ రంగేళి
మస్తో మస్తుగ మబ్బుల ఎత్తుకు… నిచ్చెన వెయ్యాలి
రంగ రంగేళి… రంగ రంగ రంగేళి
రచ్చో రచ్చగ… పచ్చిగ పిచ్చిగ ముచ్చట తీరాలి
ఓరబ్బా, అబ్బబ్బా… ఓరబ్బా ఆ ఆ ఆఆ
ఓరబ్బా, అబ్బబ్బా… ఓరబ్బా ఆ ఆ ఆఆ
బేబె… ఓ ఓ… బేబె… ఓ ఓ… బేబె… ఓ ఓ
చెక్బక భూమ్ భం…
రంగ రంగేళి… రంగ రంగ రంగేళి
రంగ రంగేళి… రంగ రంగ రంగేళి
రంగ రంగేళి… రంగ రంగ రంగేళి
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
వన్నా టచ్ యూ… లిరిక్స్
చిత్రం: ‘వి’(2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: షార్వి యాదవ్
నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావ్ హైదరి
దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి
నిర్మాణం: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
విడుదల తేది: 05.09.2020
మసామసా మైకంలో… ఆన్ ద ఫ్లోర్
మళ్ళీ మళ్ళీ ట్రిప్పైపొరో…
మరీ మరీ మారంతో… డోంట్ లెట్ దిస్ గో
తుళ్ళీ తుళ్ళీ తప్పే చెయ్ రో…
దాహాలే ఆవిరయ్యేలా… మేఘంలా మెరిసి పోరా
కాలాలే కరిగి పోయేలా…అటెన్షనే ఇటేపుగా తిప్పైరా…
వన్నా టచ్ యూ టచ్ యూ… నౌ నౌ నౌ నౌ నౌ…
బేబీ కిస్ మీ కిస్ మీ… నౌ నౌ నౌ నౌ
వన్నా టచ్ యూ టచ్ యూ… నౌ నౌ నౌ నౌ నౌ…
బేబీ కిస్ మీ కిస్ మీ… నౌ…
వన్నా టచ్ యూ టచ్ యూ… నౌ నౌ నౌ నౌ నౌ…
బేబీ కిస్ మీ కిస్ మీ… నౌ నౌ నౌ నౌ
వన్నా టచ్ యూ టచ్ యూ… నౌ నౌ నౌ నౌ నౌ…
బేబీ కిస్ మీ కిస్ మీ… నౌ…
దేహాలే మరి వదిలేసాయా గ్రావిటీ…
కొత్త ఊహల్తోటి మొహాలే రేపి… దాగుందేమో చీకటి
హే ఏ ఏ… పెదవంచులో నవ్వల్లే… నన్నే అల్లుకోరా
తమకంలోనే చూపే ముంచి… కమాన్ కమాన్ కమాన్ దగ్గరగా
వన్నా టచ్ యూ టచ్ యూ… నౌ నౌ నౌ నౌ నౌ…
బేబీ కిస్ మీ కిస్ మీ… నౌ నౌ నౌ నౌ
వన్నా టచ్ యూ టచ్ యూ… నౌ నౌ నౌ నౌ నౌ…
బేబీ కిస్ మీ కిస్ మీ… నౌ… ||2||
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
excellent
Super
superrr
Good