చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి, గిరిజ
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: మంగళంపల్లి బ్రదర్స్ ( శాస్త్రి , యం. రంగారావు)
విడుదల తేది: 19.11.1964
పల్లవి:
ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి వరించి చేరవే
తియ్యని మనోరధము నా తియ్యని మనోరధం
ఫలింప చేయవే…
ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి…
చరణం: 1
దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ
దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ
తారక సుధాకరా… తపించసాగినే
హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర…
చరణం: 2
మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత
మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత
రాగమే సరాగమై ప్రమోదమాయెనే
హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర…
చరణం: 3
ఆ హాహాహ….. హాహాహ
ఆ హాహాహ…. హాహాహ
పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే
పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే
ఊహలో ఒయ్యారమో.. నా ఊహలో ఒయ్యారమో
ఉయ్యాలలూగెనే…
ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి…..
****** ****** ******
చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: నార్ల చిరంజీవి
గానం: ఘంటసాల, లీల
పల్లవి:
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి ..
జో జో… జో జో
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
చరణం: 1
చెరసాలలో పుట్టి వ్రేపల్లెలో వెలసి
గొల్ల తల్లుల మనసు కొల్లగొనినాడు
ఏ తల్లి ఒడి జారి ఏలాగు చేరావొ
ఆపదలె కాపుదలలాయేనె నీకు
జో అచ్యుతానంద జోజో ముకుందా…
రార పరమానంద రామగోవిందా…
జో జో…
చరణం: 2
పలు వేసములు పూని పగవారు హింసింప
పల్పోకడలు చూపె బాలగోపాలుడూ
ఈ ఈడుకే ఎన్ని గండాలు గడిచాయొ
ఎంత జాతకుడమ్మ అనిపించినావు
జో అచ్యుతానంద జోజో ముకుందా…
రార పరమానంద రామగోవిందా…
జో జో…
చరణం: 3
కాళింది పొగరణచి కంసుణ్ణి పరిమార్చి
కన్నవారికి చెరలు తొలగించినాడు
వసుదేవ తనయుని వారసత్వము నిలిపి
నీవారి వెతలెల్ల నీవె తీర్చేవు
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
జో జో… జో జో
జో జో… జో జో
జో జో… జో జో