Vakeel Saab (2020)

Vakeel Saab (2021)

కంటిపాపా.. కంటిపాపా… లిరిక్స్

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: థమన్ ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్, దీపు, థమన్ ఎస్
నటీనటులు: ప‌వ‌న్‌ కళ్యాణ్, శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాణం: దిల్‌ రాజు, శిరీష్, బోనీ క‌పూర్
విడుదల తేది: 09.04.2021

Kanti Papa Kanti Papa Song Telugu Lyrics

కంటిపాపా కంటిపాపా… చెప్పనైన లేదే
నువ్వంతలా అలా… ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వా కాలి మువ్వా… సవ్వడైనా లేదే
నువ్విన్నినాళ్ళుగా వెంట తిరుగుతున్నా

నీరాక ఏరువాక… నీ చూపే ప్రేమలేఖ
నీలో నువ్వాగిపోకా… కలిసావే కాంతి రేఖ
అంతులేని ప్రేమ నువ్వై … ఇంత దూరం వచ్చినాక
అందమైనా భారమంతా… నాకు పంచినాకా

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు

కంటిపాపా కంటిపాపా… చెప్పనైన లేదే
నువ్వంతలా అలా… ఎన్ని కలలు కన్నా

సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా

సుదతీ సుమలోచినీ సుమనోహర హాసిని
రమణీ ప్రియ భాషిణీ కరుణాగున భాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయవే చెలీ నువు పొందిన ప్రేమనీ
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా

సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా

ఎదలో ఏకాంతము… ఏమయ్యిందో ఏమిటో
ఇదిగో నీ రాకతో… వెళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూశా… నీకో స్నేహితుణ్ని చేశా
కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా

ఆకాశం గొడుగు నీడ… పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండా… ప్రేమే మన కోటగోడ
నాకు నువ్వై నీకు నేనై… ఏ క్షణాన్ని వదలకుండా
గురుతులెన్నో పెంచుకుందాం… గుండె చోటు నిండా

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు ||2||

Vakeel Saab Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

సత్యమేవ జయతే… లిరిక్స్

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: థమన్ ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్, ర్యాప్ – పృథ్వీ చంద్ర
నటీనటులు: ప‌వ‌న్‌ కళ్యాణ్, శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాణం: దిల్‌ రాజు, శిరీష్, బోనీ క‌పూర్
విడుదల తేది: 09.04.2021

Sathyameva Jayathe Song Telugu Lyrics

జన జన జన జనగణమున… కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున… నిలబడగల నిజం మనిషిరా
నిశి ముసిరిన కలలను తన వెలుగుతో… గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక… బలమగు భుజమివ్వగలడురా

వదలనే వదలడు… ఎదురుగా తప్పు జరిగితే
ఇతనిలా ఓ గళం మన వెన్నుదన్నై పోరాడితే
సత్యమేవ జయతే… సత్యమేవ జయతే
సత్యమేవ జయతే… సత్యమేవ జయతే

జన జన జన జనగణమున… కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున… నిలబడగల నిజం మనిషిరా
నిశి ముసిరిన కలలను తన వెలుగుతో… గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక… బలమగు భుజమివ్వగలడురా

గుండెతో స్పందిస్తాడు… అండగా చెయ్యందిస్తాడు

ఇలా చెంప జారెడి… ఆఖరి అశ్రువునాపెడివరకు
అనునిత్యం బలహీనులందరి ఉమ్మడి గొంతుగ
పోరాటమే తన కర్తవ్యం

వకాల్తా పుచ్చుకుని వాదించే ఈ వకీలు
పేదోళ్ళ పక్కనుండి కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు
ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే
గొంతెత్తి ప్రశించాడో అంతా నిశ్చింతే
ఇట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే
మోరెత్తే మోసగాళ్ళ పత్తా గల్లంతే

సత్యమేవ జయతే… సత్యమేవ జయతే
సత్యమేవ జయతే… సత్యమేవ జయతే
సత్యమేవ జయతే

Vakeel Saab Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

మగువా మగువా… లిరిక్స్

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: థమన్ ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: ప‌వ‌న్‌ కళ్యాణ్, శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాణం: దిల్‌ రాజు, శిరీష్, బోనీ క‌పూర్
విడుదల తేది: 09.04.2021

Maguva Maguva Song Telugu Lyrics

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…

అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా..
పరుగులు తీస్తావు ఇంటా బయట..

అలుపని రవ్వంతా అననే అనవంటా..
వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా..

సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..

సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…

నీ కాటుక కనులు విప్పారకపోతే.. ఈ భూమికి తెలవారదుగా..
నీ గాజుల చేయి కదలాడకపోతే.. ఏ మనుగడ కొనసాగదుగా…

ప్రతి వరుసలోను ప్రేమగా..
అల్లుకున్న బంధమా.. అంతులేని నీ శ్రమ అంచనాలకందునా

ఆలయాలు కోరనీ.. ఆదిశక్తి రూపమా..
నీవు లేని జగతిలో దీపమే వెలుగునా..

నీదగు లాలనలో, ప్రియమగు పాలనలో..
ప్రతి ఒక మగవాడు పసివాడేగా..

ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా..
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…

సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..

సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…

Vakeel Saab Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!