చిత్రం: వంశీ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: మహేష్ బాబు, నమ్రతా శిరోడ్కర్, కృష్ణ ఘట్టమనేని
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: జి. ఆది శేషగిరిరావు
విడుదల తేది: 04.10.2000
వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి
ఊహలకె ఊపిరొచ్చేలే ఊసులకే ఊహ తెలిసెలే
ఊరించే ఆశలెన్నొ మధిలో…
మనసంతా పరవసించెనే నీకోసం పరితపించెలే
నీరూపం నిండివుంది ఎదలో
వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి
నీ మాటల్లో ఏవో సరిగమలు
నీ మౌనంలో ఏవో గుసగుసలు
నీ కన్నుల్లో రంగుల రాగాలు
ఆరాదంలో ఏవో విరహాలు
ఓ చెలియా చెంత చేరునా
మత్తెక్కె మాయ చేయన
నీ పెదవిని పాలకరించిపోనా
మురిపించే మాట చెప్పనా
కరిగించే కౌగిలివ్వనా
ముద్దులనే మూటగట్టి తేనా
వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి
నీ సిరిమువ్వల సవ్వడి నను తాకే ఓ
నీ చిరునవ్వుల వల నను బంధించే
నా హృదయంలో అలజడి వైనావే ఓ
నా శ్వాసకు నువ్ శృతివై నిలిచావే
ప్రియురాలా ప్రేమ పంచుకో
పరువాల పల్లవందుకో
గుండెల్లో నన్ను దాచుకోవే…
అధర మాధరాలవెందుకు
వయసార పిలిచినందుకు
తనువార నన్ను దోచినావే
వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి
మనసంతా పరవసించెనే నీకోసం పరితపించెనే
నీరూపం నిండివుంది ఎదలో
ఊహలకె ఊపిరొచ్చేలే ఊసులకే ఊహ తెలిసెలే
ఊరించే ఆశలెన్నొ మధిలో
వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి