వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా… లిరిక్స్
చిత్రం: యముడికి మొగుడు (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, ఎస్. జానకి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, రాధ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాణం: నారాయణ రావు, సుధాకర్
విడుదల తేది: 29.04.1988
Vana Jallu Gilluthunte Telugu Song Lyrics
పల్లవి:
వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా..
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా..
సన్నతొడిమంటి నడుముందిలే.. లయలే చూసి లాలించుకో..
ఓ.. వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా..
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా..
చితచితలాడు ఈ చిందులో.. జతులాడాలి జతచేరుకో..
ఓ.. వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా..
చరణం: 1
వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో.. వద్దు లేదు నా భాషలో..
మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో.. హద్దు లేదు ఈ హాయిలో..
కోడె ఊపిరి తాకితే.. ఈడు ఆవిరే.. ఆరదా..?
కోక గాలులే హోయ్ సోకితే.. కోరికన్నదే.. రేగదా..?
వడగట్టేసి బిడియాలనే.. ఒడి చేరాను వాటేసుకో..
మ్.. వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా..
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా..
చరణం: 2
అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా… చీరకట్టు తానాగునా..
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా… జారుపైట తానాగునా..
క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా..
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా..
తొడగొట్టేసి జడివానకే.. గొడుగేసాను తలదాచుకో..
ఓ.. వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా..
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా..
చితచితలాడు ఈ చిందులో.. జతులాడాలి జతచేరుకో.. ఓ..
Telugu Rain Songs
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
good