Varasudu (1993)

varasudu 1993

చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: బాలక్రిష్ణ , కృష్ణ , నగ్మా
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: డి.కిషోర్
విడుదల తేది: 05.05.1993

పల్లవి:
ఒ..ఒ..ఒ.. ఓరియా
ఒ..ఒ..ఒ.. ఓరియా

సిలకలాగా కులుకుతుంటే
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే

ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా
ఇచ్చే కమ్మగా గుమ్ముగా  ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా

సిలకలాగా కులుకుతుంటే
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే

చరణం: 1
పాపా పాపా పైరగాలిలో పైటలాగా చుట్టుకోనా
బావా బావా వంగతోటలో ఒడుపు చూపితే ఒప్పుకోనా
మాయమాటలింక చాలు పోకిరి ఇటు రా మరి
కాక మీద ఉంది పిల్ల డింగరి చూసై గురి
కరగదీయనా… అరగదీయనా…
చిక్కావులే ఎడాపెడా చిన్నారి

ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా..
ఇచ్చే కమ్మగా గుమ్ముగా  ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య..
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా

సిలకలాగా కులుకుతుంటే
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే

చరణం: 2
ఉంగా ఉంగా ఓరి నాయనో..
ఓపలేనురోయ్ వన్నెకాడా
వయ్యారంగా అస్కుబుస్కులు
మొదలు పెట్టనా మంచెకాడా
తీపి తిక్క రేగుతోంది పిల్లడా నీ జిమ్మడ
సోకు వెచ్చ బెట్టుకుంటే పోతదే పద గుమ్మడి
దొరికినానని కొరకమాకురో
సందిట్లో చెడమడా బావయ్యో

ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా..
ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య..
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా

సిలకలాగా..ఓయ్.. కులుకుతుంటే..ఓయ్..
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని..ఓయ్..
కుదురుగుంటే..ఓయ్..
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే

ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా
ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా

*******   ********   ********

చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్…  యమ డేంజర్
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్…  యమ డేంజర్

విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్…  యమ డేంజర్
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్…  యమ డేంజర్

మెత్త మెత్తగా తలకెక్కుతుంతది
మత్తు మత్తుగా అహ ముంచుతుంతది
నులి వెచ్చని ఎత్తుల జిత్తుల గాలమేసి గోలుమాలు చేస్తుంది ..
డేంజర్…  యమ డేంజర్

వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్…  యమ డేంజర్
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్…  యమ డేంజర్

చరణం: 1
ఒక్క లుక్కే చాలు
ఒక్క లుక్కే చాలు..
చమక్ చం చం… చుక్కలన్నీ నక్కే చోటికి
నే దూసుకుపోతా
ఒక్కటిస్తే చాలు
ఒక్కటిస్తే చాలు…
జమక్ జం జం… సిగ్గుపడ్డ సొగసంతా
నీకే సొంతం చేస్తా
వయ్యారమహో వల వేసే
ఇది కనికట్టు…  అది కనిపెట్టు
కవ్వింపులతో కలబోసి
ఇది తొలిమెట్టు…  ఇక తలపెట్టు

కన్ను గీటితే…  వెన్ను మీటనా
చిరునవ్వులు రువ్వుకు పొమ్మని
కన్నె సోకు కరగదీసి పోతుంది

డేంజర్…  యమ డేంజర్
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్…  యమ డేంజర్

విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్…  యమ డేంజర్

చరణం: 2
బుగ్గ కాటే బాయ్యో…
బుగ్గ కాటే బాయ్యో…
ధనక్ దన దన… కొత్త కోక నలిగే
కౌగిలిలో బానిసనవుతా

సిగ్గు దాటేయ్ పిల్లో…
సిగ్గు దాటేయ్ పిల్లో….
సమక్ సం సం… కుర్ర వేడి ముదిరే
నీ ఒడిలో జాతర చేస్తా

తయ్యారు రా హో తెర తీశా
ఇది మలిమెట్టు ఇక జతకట్టు

అయ్యారే సుఖం శృతి చేశా
ఇది ఎవెరెస్ట్ … ఇక నో రెస్ట్
చోటు దొరికితే… చాటు చేరనా
ఎరుపెక్కిన ఒంపులు సొంపులు
లంచమిచ్చి లొంగదీయు ప్రేమంటే

డేంజర్…  యమ డేంజర్
యమ యమ యమ యమ డేంజర్

*******   ********   ********

చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
ధీం తనక్ ధీం… ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ…
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా… ఓ…

ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున

ధీం తనక్ ధీం… ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ…
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా… ఓ…

చరణం: 1
చలో మేరీ స్వీటీ బుల్ బుల్ బ్యూటీ
భలేగుంది భేటీనీతోటి
నిదానించు నాటీ ఏమా ధాటి
మజా కాదు పోటీ మనతోటి
సిగ్గు లూటీ… చేసెయ్యి కళ్లతోటి
ఇచ్చేయి ముద్దు చీటీ… కౌగిళ్లు దాటి
ఒకటే సరదా…  వయసే వరద
కలలే కనక కథలే వినక మర్యాద
చురుక్కు చలెక్కి అడక్క అడిగిన

ధీం తనక్ ధీం… ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ…
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా… ఓ…

చరణం: 2
ఇదేం ప్రేమ బాబూ ఇలా చంపుతుంది
అదే ధ్యాస నాలో మొదలైంది
పదారేళ్ల ప్రేమ కథంతేను లేమ్మా
అదో కొత్త క్రేజీ హంగామా
పొద్దుపోదు…  ముద్దైనా ముట్టనీదు
నిద్రైనా పట్టనీదు…  నా వల్ల కాదు
ఒకటే గొడవ…  ఒడిలో పడవా
నిన్న మొన్న లేనే లేదు ఈ చొరవ
ఇవాళ ఇలాగ దొరక్క దొరికిన

ధీం తనక్ ధీం… ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ…
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా… ఓ…

ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున

ధీం తనక్ ధీం… ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ…
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా… ఓ…

*******   ********   ********

చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా
ముద్దెలేని చెంపకు పొద్దె పోదు చంపకూ
పెదవి పెదవి కలిసినప్పుడు
చిలిపి చదువు చదివినప్పుడు
ఎదుట నిలిచె యెదను తొలిచె
వలపు ఒడిని వొదిగినప్పుడు

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా

తనువులకు తపనలు రేగె అడిగినది అచ్చటా
చొరవలకు దరువులు ఊగీ ముదిరినది ముచ్చటా
చలేసి గుండె గంట కొట్టెనంటా
బలేగ తేనె మంట పుట్టెనంటా
అనాస పండు లాంటి అందమంటా
తినేసి చూపుతోటి జుర్రుకుంటా
తియ్యనైన రేయిలో విహారమూ
మోయలేని హాయిలో ప్రయానము
మోగుతుంది మోజులో అలారమూ
ఆగలేక రేగె నీ వయ్యరమూ
సొగసు దిగులు పెరిగినప్పుడు
వయసు సెగలు చెరిగినప్పుడు
మనసు తెలిసి పనులు కలిసి
కలలు విరిసి మురిసినప్పుడు

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా

కులుకులకు కుదిరిన జొడి కొసరినది సందిటా
అలకల్కు అదిరిన డెడీ దొరికినది దోసిటా
చలాకి ఈడు నేడు చెమ్మ గిల్లె
గులాబి బుగా కంది సొమ్మ సిల్లె
పలానిదేదొ కోరె జాజి మల్లె
ఫలాలు పంచమంటు మోజు గిల్లె
ఆకతాయి చూపులో యేదో గిలి
ఆకలేసి మబ్బులో బలే చలీ
కమ్మనైన విందులో కదాకలీ
కమ్ముకున్న హాయిలొ బలాబలీ
ఒదిగి ఒదిగి కధలు పెరిగి
జరిగి జరిగి రుచులు మరిగి
ఎదురు తిరిగి ఎదలు కరిగి
పడిచు గొడవ ముదిరినప్పుడు

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా

*******   ********   ********

చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటు
ఉడుకు వయసుల జోడీ
కిటుకు తెలిసె కిలాడీ
ఓ మై లేడి నీపై దాడీ
పట్టుకొ పట్టుకొ పట్టుకొ
పట్టుకొ పట్టుకొ కుక్కూ

బుజ్జి పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటూ

నీ పిక్కల పిట పిట చూస్తె
చీప…చిక్కెనమో
traffic jam – traffic jam
కైపెక్కిన మక్కెలు చూస్టె
నొర్ముయ్….కిక్కెనమ్మో
చా… పపరం పపరం
అ కసికసి ఎత్తులలో… ఏయ్
కదలింతలు చూస్తుంటే
నీ పసి పసి బుగ్గలలో
గిలిగింతలు పూస్తుంటే
sexy figure ఆవొ ఇదర్
kiss me kiss me kiss me
kiss me kiss me కుక్కూ

పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటు

నీ ప్రేమె దక్కని నాడు పస్తేనమ్మో…
very good…. జాగారం జాగారం
నే జోడి కట్టని నాడు చస్తానమ్మో
better…. శంతి ఓం శాంతి ఓం
ఈ జగమిక మాయేలే
నా బ్రతుకిక రాయేలే
నీ ఒడి ఎడమైపోతే
నే సుడిలొ దూకాలే ….దూకెయ్
రావె చెలి అనార్కలీ
love me love me love me
love me love me కుక్కూ

బుజ్జి పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటు
ఉడుకు వయసుల జోడీ
కిటుకు తెలిసె కిలాడీ.
ఓ మై లేడి నీపై దాడి
పట్టుకొ పట్టుకొ పట్టుకొ
పట్టుకొ పట్టుకొ కుక్కూ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top