Varsham (2004)
Varsham (2004)

Varsham (2004)

చిత్రం: వర్షం (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, రకీబ్ ఆలం
నటీనటులు: ప్రబాస్, త్రిష , గోపీచంద్
దర్శకత్వం: శోభన్
నిర్మాత: యమ్.ఎస్. రాజు
విడుదల తేది: 14.01.2004

చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట  తరికిట త

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన

ముద్దులొలికే ముక్కుపుడకై
ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా జూకాల్లాగా
చేరుకోవే జిలుగుల చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగా
కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్లో పచ్చల పతకంలాగా
వగలకు నిగ నిగ నగలను తొడిగేలా

నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా
ఆహా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట  తరికిట త

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా

చిన్న నాటి తాయిలంలా
నిన్ను నాలో దాచుకోనా
కన్నె ఏటి సోయగంలా
నన్ను నీలో పోల్చుకోనా
పెదవులు పాడే కిలకిల లోనా
పదములు ఆడే కథకళి లోనా
కనులను తడిపే కలతల లోనా
నా అణువణువున నువు కనిపించేలా

నువ్వొస్తానంటే హా  నేనొద్దంటానా
నువ్వొస్తానంటే ఏయ్ ఏయ్ నేనొద్దంటానా
తరికిట  తరికిట త

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా (4)

*********    **********   *********

చిత్రం: వర్షం (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. చరణ్, సుమంగళి

మెల్లగా తరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా…

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం

నీ మెలికెలలోనా ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోనా నీ పిలుపును వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా
జత పడే స్నేహమై అనునయించనా…
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరుణునుకే ఋణపడిపోనా ఈ పైనా
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే ముడులు వేయనా…
మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా…

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా తరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా…

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

*********    **********   *********

చిత్రం: వర్షం (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సాగర్, సుమంగళి

నీటి ముల్లై నన్ను గిల్లీ
వెల్లిపోకే మల్లె వానా
జంటనల్లే  అందమల్లే
ఉండిపోవే వెండి వానా

తేనెల చినుకులు చవిచూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి
కనుమరుగై  కరిగావ సిరివానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా

*********    **********   *********

చిత్రం: వర్షం(2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: టిప్పు , ఉష

హే లంగా వోణీ నేటితో రద్దై పోని
సింగారాన్నీ చీరతో సిద్దంకాని
నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ
చిందులే ఆపగా ముళ్ళు వేయని
సర్లేగాని చక్కగా పెళ్లైపోని
అల్లర్లన్ని జంటలో చెల్లైపోనీ
లగ్గమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని
సొంతమై అందమే అప్పగించనీ

హే లంగా వోణీ నేటితో రద్దై పోని
సింగారాన్నీ చీరతో సిద్దంకాని

ఓ చూడు మరి దారుణం ఈడునెలా ఆపడం
వెంటపడే శత్రువయే సొంత వయ్యారం
హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం
కళ్లెదురే ఉంది కదా ఇంత సహాయం
పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధానం
హే హే హే హే శిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం

హే లంగా వోణీ నేటితో రద్దై పోని
అరె సింగారాన్నీ చీరతో సిద్దంకాని

సోకు మరీ సున్నితం దాన్ని ఎలా సాకటం
లేత నడుం తాళదు నా గాలి దుమారం
కస్సుమనే లక్షణం చూపనిదే  తక్షణం
జాలిపడే లాలనతో లొంగదు భారం
ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి
ఆర్చీ తీర్చి ఆదుకో గిచ్చీ గిచ్చీ

హాయ్  హాయ్ హాయ్ హాయ్ లంగా వోణీ నేటితో రద్దై పోని
సర్లేగాని చక్కగా పెళ్లైపోని
హేయ్ నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ
చిందులే ఆపగా ముళ్ళు వేయని

*********    **********   *********

చిత్రం: వర్షం (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కల్పన, మల్లికార్జున్

ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
గుండెల్లో శంఖాలూదే సుడిగాలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
పొంగే ఈ గంగనాపే శివుడేలే
వాడంటే వాడే మగ వాడంటే వాడే
ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే

హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
శిరసెక్కి చిందాడిందే జవరాలే

ఆఁ… సూదంటి కళ్ళే అవి తేనెటీగ ముళ్ళై
ఆ సూదంటి కళ్ళే తేనెటీగ ముళ్లే చుక్కల్ని తెంచే చూపులే
పువ్వంటి ఒళ్ళే పచ్చిపాల జల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే
నీ కౌగిలింత నా కోట చేసుకుంటా
చిరు చినుకంత చింతా నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా…

హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
పొంగే ఈ గంగనాపే శివుడేలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
శిరసెక్కి చిందాడిందే జవరాలే

హో చిన్నరి హంస ఇష్టమైన హింస
హేయ్ చిన్నరి హంస ఇష్టమైన హింస రేపావే నాలో లాలస
అహ కొండంత ఆశ నీకు అందజేసా నీ సొంతమేలే బానిస
నీ తాపాన్ని చూశా అరె పాపం అనేసా
ఇక నీదే భారోసా వందేళ్ళ శ్వాస నీ పేరే  రాసేసా                    

హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
గుండెల్లో శంఖాలూదే సుడిగాలే

*********    **********   *********

చిత్రం: వర్షం (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్ ,  శ్రేయ ఘోషాల్

కోపమా  నా పైనా  ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ…
చాలులే నీ నటనా సాగదే ఇటుపైనా
ఎంతగా నసపెడుతున్నా లొంగిపోనె లలనా
దరి చేరిన నెచ్చెలిపైనా దయచూపవ కాస్తయినా
మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ…

ఓ… ఓ… ఓ… ఓ…

ఓ కస్సుమని కారంగా కసిరినది చాలింకా
ఉరుము వెనుక చినుకుతడిగా  కరగవా కనికారంగా
కుదురుగా కడదాకా కలిసి అడుగెయ్యవుగా
కనుల వెనకే కరిగిపోయే కలది గనుకా
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా
నువ్వు గొడుగునే ఎగరేస్తావే జదివానా హొ…

ఓ… ఓ… ఓ… ఓ… ఓ… ఓ…

కోపమా  నా పైనా  ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ…

హొ… తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమేగా
మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనకా
సులువుగా నీలాగ మరిచిపోలేదింక మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక
ఎగసే అల ఏనాడైనా తన కడలిని వెతికేనా
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో

ఓ… ఓ… ఓ… ఓ…

ఆఁ కోపమా  నా పైనా  ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ…

తాననే తనినాన  తాననే తనినాన
తాననే తనినేనాన తన్నే నాన నానే హో

*********    **********   *********

చిత్రం: వర్షం (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అద్నన్ సమి, సునీతా రావ్

హోయ్…
హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి
హే ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని

హేయ్ నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి
ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని

అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి
శాసిస్తే చాలు ఓ సారి సిద్దంగా ఉంది సింగారి
అయ్యరే సయ్యంటుందే తయ్యారై వయ్యారి

నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి
ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని

హే… సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరీ
చాల్లెద్దూ మాట కచేరి దోచేద్దూ తళుకు తినారి
ముదిరావే మాయలమారి
మురిపిస్తే ఎలా మురారి
హే పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావె పొన్నారి
పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనసే చేజారి
గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి

నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి
ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని

హే… వరదల్లే హద్దులు మీరి వచ్చావా పొగడల పోరి
హే సుడిగాలే నిలువున నిమిరి ఎగరేసుకుపోతా నారి
దాటొస్తా సిగ్గుల ప్రహరి
హేయ్ చేరుస్తా చుక్కల నగరి
ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓ సారి
మైకంలో తూరి ఓ సారి కావ్యంలో వాలి ఓసారి
వాహ్ వారే అనిపించాలి వాటేసే ప్రతిసారి

హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి
ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని