కోల కళ్ళే ఇలా.. గుండె గిల్లే ఎలా… లిరిక్స్
చిత్రం: వరుడు కావలెను (2021)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: రాంబాబు గోసల
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: నాగ శౌర్య, రీతు వర్మ
దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య
నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ
విడుదల తేది: 2021
Kola Kalle Ilaa Song Telugu Lyrics
చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే
పువ్వులా నా ఊహల గుమ్మంలో
తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే
కొంచమైనా ఇష్టమేనా అడుగుతుందే
మౌనంగా నా ఊపిరే
దూరమున్నా చేరువవుతూ… నాలోని ఈ తొందరే
కోల కళ్ళే ఇలా… గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా… చంపుతుంటే ఎలా
కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళి మళ్ళి రావే… పూల జల్లు తేవే
ఆఆ ఆ ఆఆ … ఏఏ ఏఏ ఏ
నువ్వెల్లే దారులలో… చిరుగాలికి పరిమళమే
అది నన్నే కమ్మేస్తూ ఉందే
నా కంటి రెప్పలలో… కునుకులకిక కలవరమే
ఇది నన్నే వేధిస్తూ ఉందే
నిశినిలా విసురుతూ… శశి నువ్వై మెరవగా
మనసులో పదనిసే… ముసుగే తీసెనా
ఇరువురం ఒకరిగా… జతపడే తీరుగా
మన కదే మలుపులే కోరేనా
కోల కళ్ళే ఇలా… గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా… చంపుతుంటే ఎలా
కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళి మళ్ళి రావే… పూల జల్లు తేవే
చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే
నాన నానా నానా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
నాన నానా నా నాన నానా నా
నాన నానా నానా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
నాన నానా నా నాన నానా నా
మళ్ళి మళ్ళి రావే..
Varudu Kaavalenu All Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
nice
nice songs
nice
wow