చిత్రం: వసంతం (2003)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయన్, సుజాత
నటీనటులు: వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ , కళ్యాణి
దర్శకత్వం: విక్రమన్
నిర్మాతలు: యన్. వి.ప్రసాద్, యస్.నాగ అశోక్ కుమార్
విడుదల తేది: 11.07.2003
జాంపండువే దోర జాంపండువే
పూ చెండువే మల్లె పూ చెండువే
నీ పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నా మనసున తైతక్క
రవి చూడని రవికను చూస్తే నా వయసుకు తలతిక్క
జాంపండునే దోర జాంపండునే
పూచెండునే మల్లె పూచెండునే
చరణం: 1
ఊగింది ఊగింది నా మనసు ఊగింది
నీకంటి రెప్పల్లో అవి ఏం చిటికెలో అవి ఏం కిటుకులో
ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది
నీ నడుము ఒంపుల్లో అవి ఏం కులుకులో
అవి ఏం మెలికలో
ఇది పంచదార చిలకా అంచులన్నీ కొరకా
మీదికొచ్చి వాలమాకా
ఓ చందనాల చినుకా కుందనాల మొలకా
కోక డాబు కొట్టమాకా
నువ్వే నేనుగా తిరిగాం జంటగా
నిప్పే లేదుగా రగిలాం మంటగా
జాంపండునే దోర జాంపండునే
పూ చెండువే మల్లె పూ చెండువే
చరణం: 2
ఒళ్లంత తుళ్లింతై చెమటెంత పడుతున్నా
ఆ చెమట చేరని చోటు చూపించవే అది చూపించవే
కళ్లంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా
ఆ చెమట చేరని చోటు ఈ పెదవులే కొరికే పెదవులే
నువ్వు ఆడ సోకు చూపి ఈడ కొంత దాచి
కుర్రగుండె కోయమాకా
నన్ను కౌగిలింతలడగ కచ్చికొద్దీ కొరకా
కన్నె సైగ కోరమాకా
మరిగే ఉందిగా చొరవే చేయగా
పరువేం పోదుగా ఒడిలో చేరగా
జాంపండువే దోర జాంపండువే
పూ చెండువే మల్లె పూ చెండువే
నా పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నీ మనసున తైతక్క
రవి చూడని రవికను చూస్తే నీ వయసుకు తలతిక్క
జాంపండువే దోర జాంపండువే
పూ చెండువే మల్లె పూ చెండువే
********* ********* **********
చిత్రం: వసంతం (2003)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వని
ఎన్నడు ఆగనీ పయనమే నీదని
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
చరణం: 1
కనురెప్ప మూసివున్నా నిదరొప్పుకొను అన్నా
నిను నిలువరించేనా ఓ స్వప్నమా
అమవాస్యలెన్నెయినా గ్రహణాలు ఏవైనా
నీ కలను దోచేనా ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ పోల్చదు నేలమ్మ
ఉలి గాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా
మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చీకటే దారిగా వేకువే చేరగా
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
చరణం: 2
చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా
నీరాక ఆపేనా వాసంతమా
ఏ కొండరాళ్ళైనా ఏ కోన ముళ్ళైన
బెదిరేన నీ వాన ఆషాఢమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా
సాగిపో నేస్తమా నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా
కూరిమే సాక్షిగా ఓటమే ఓడగా …
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వని
ఎన్నడు ఆగనీ పయనమే నీదని
********* ********* *********
చిత్రం: వసంతం (2003)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్.పి.బాలు
గోదారల్లే పొంగే నాలో సంతోషం
గోరింటల్లే పూచే నాలో ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస
కలహంస నడకల్లోన అందాల హైలెస్సా
నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం
నిండా నింపిందమ్మా నాలో సంగీతం
గోదారల్లే పొంగే నాలో సంతోషం
గోరింటల్లే పూచే నాలో ఆనందం
చరణం: 1
గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే
కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే
సంక్రాంతే రోజు నామదికి
ఈ అనుభవమే నాకు కొత్త గున్నది
రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల
రాగాలెన్నో తీసిందమ్మా తియ్యతీయగా
గోదారల్లే పొంగే నాలో సంతోషం
గోరింటల్లే పూచే నాలో ఆనందం
చరణం: 2
గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే
హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే
సందేహం లేదే నాకు మరి
ఇది ఆనందం చేసే కొంటె అల్లరి
గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం
మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం
గోదారల్లే పొంగే నాలో సంతోషం
గోరింటల్లే పూచే నాలో ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస
కలహంస నడకల్లోన అందాల హైలెస్సా
నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం
నిండా నింపిందమ్మా నాలో సంగీతం