Veede (2003)
Veede (2003)

Veede (2003)

చిత్రం: వీడే (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాహితి
గానం: రవివర్మ
నటీనటులు: రవితేజ, ఆర్తి అగర్వాల్, రీమాసేన్
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: సింగణమల రమేష్
విడుదల తేది: 31.10.2003

పల్లవి:
ఓయ్…అమ్మాడి యమ్మ యమారే
అందాలు దుమ్ము దుమారే
పిల్లేమో గుమ్ము గుమారే
ఓయ్…బుగ్గేమో మొగ్గ మజారే
ఒళ్ళంతా పళ్ళ బజారే
కవ్వించే మస్తు బహారే
అయితలకా అయితలకా అయితలకా అయి
ముందెనకా చూడకికా అనుకుంది చెయ్

చరణం: 1
మస్తు మస్తు సొగసులాడి
మనసు కుదుపు వన్నెలేడి
వయసు ఒంపు నాట్యమాడి
చేస్తు ఉంది మెరుపుదాడి
ఒక్కసారి అబ్బదీని ముగ్గులో పడి…
ఇలా కన్నెవొడి…. మజా మెలిక పడి…
వేడి ఈడు జోడు ఆడుకోన దుడుకు కబాడీ…
అయితలకా అయితలకా అయితలకా అయి…
ముందెనకా చూడకికా అనుకుంది చెయ్

చరణం: 2
నడుము చెరుకు గడల మూట
నమలకుండ ఉండేదెట్ట
పలక జామపళ్ళ బుట్ట
సరుకు చూస్తె ఆగె దెట్ట
సందెకాడ వస్తనంటె కంది చేనుకే…
ఇలా లాలిస్తూ…. అలా పండిస్తూ….
మహరాజల్లె గడుపుకోన జామురాతిరే…
అయితలకా అయితలకా అయితలకా అయి…
ముందెనకా చూడకికా అనుకుంది చెయ్