Veedhi (2006)

Veedhi Movie Lyrics

బృందావనికే చిందులు నేర్పి… లిరిక్స్

చిత్రం: వీధి (2006)
సంగీతం: అనుప్ రూబెన్స్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: కె.ఎస్.చిత్ర
నటీనటులు: శర్వానంద్, గోపిక
దర్శకత్వం: ఆనంద్ దొరైరాజ్
నిర్మాణం: రామోజీ రావు
విడుదల తేది: 2006

బృందావనికే చిందులు నేర్పి
వెన్నెల వేలకు వన్నెలు కూర్చి
రాసావు ఓ రాసలీలా…

జనకు జనకు జన జనకు జనకు జన ||2||
పదము కదిలె క్రిష్ణా… క్రిష్ణ
ఢమకు ఢమకు యెద ఢోలు మోగె క్రిష్ణ
క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ

జనకు జనకు జన జనకు జనకు జన
పదము కదిలె క్రిష్ణా… క్రిష్ణ
ఢమకు ఢమకు యెద ఢోలు మోగె క్రిష్ణ

బృందావనికే చిందులు నేర్పి
వెన్నెల వేలకు వన్నెలు కూర్చి
రాసావు ఓ రాసలీలా…
వలపుల పాటే ఆలపిస్తూ..
అల్లరి ఆటల మల్లెలు పూస్తూ..
రేపావు ఓ తీపి జ్వాలా…

ఒక పక్కన రక్కసి మూకలతో..
సమారాలను చేసావు
ఈ పక్కన చక్కనిచుక్కలకే..
మరి చీరలు దోచావు
చూసాము నంద నందన ఓ కన్నయ్యా..
మా కన్నుల వెలుగే నీదయ్యా..
గోపాలా….
చూసాము నంద నందన ఓ కన్నయ్యా..
మా కన్నుల వెలుగే నీదయ్యా..

మురళి రవళి విని మధుర సరళ కని
మురిసె యమున క్రిష్ణా.. క్రిష్ణ
ఉలికి ఉలికి పడి ఊయలూగె క్రిష్ణ

మమప మమప మప మపనిదప
మమప మాప మప మమమమరి
మమప మమప మప మపనిదప
మమప రి రి గ రి స

ఏ తోటదో చిలకమ్మా..
ఈ తోటకొచ్చింది, పలుకే నేర్చిందా..
తన కులుకే మార్చిందా ..
ఈ గాలిలో రాగాలే.. ఆ గొంతు పాడింది

మనసే.. మురిసిందా..
హరివిల్లై.. విరిసిందా..

గుండెల్లో సంగీతాలు
శృతిచేసిన సంతోషాలు
అందంగా తారలు చేసి ఎగరేయనీ..
కన్నుల్లో వెలిగే కలలు
కమ్మని చిరు ఆశల అలలు
కోలాటాలాడే వేళకు తెరతీయనీ..
ఈ ఈడులో.. ఒక వీధిలో..
అడుగేస్తె సయ్య సయ్య

బృందావనికే చిందులు నేర్పి
వెన్నెల వేలకు వన్నెలు కూర్చి
రాసావు ఓ రాసలీలా…

కొలను నీటి అలలపైన సాగే…
దీప తోరణాలు…
కలికితనము కోరుకున్న కలలే…
ఈ కాంతి నందనాలు…

దీపాంజలి.. ప్రేమ రూపాంజలి
దివ్యాంజలి.. కిరణ కావ్యాఅంజలి

ఓ చిన్నిది చూపులతో.. బాణాలు వేసింది
ఎవరా?.. సోగ్గాడు తను తిరిగేం చేశాడో..
మాటన్నదే.. మరిచాడు మెలికల్ని తిరిగాడు
అవునా.. కుర్రోడా.. సిగ్గెందుకు? వెర్రోడా..

రా రమ్మని పిలిచెను రాధ..
ప్రేముంటే చెప్పేయ్ రాదా..
లో లోపల ఎందుకు? బాధ
ఓ మాధవా..

సరసాలే సాగే వేళ, సన్యాసం కుదరదు బాల
సందట్లో సందేహాలు సరిపోదురా…
ఈ కేళిలో.. రంగేళిలో..
సరదాల సయ్య సయ్య

బృందావనికే చిందులు నేర్పి
వెన్నెల వేలకు వన్నెలు కూర్చి
రాసావు ఓ రాసలీలా…

గోపీ.. క్రిష్ణ, గోపాల క్రిష్ణ, మువ్వ గోపాలా…
రాధా క్రిష్ణ, జై జై క్రిష్ణ, వేణు గోపాలా… ||2||

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****