చిత్రం: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (2013)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: శ్వేతా మోహన్ , అంజనా సౌమ్య
నటీనటులు: సందీప్ కిషన్ , రకూల్ ప్రీత్ సింగ్ , బ్రహ్మాజీ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: జెమిని కిరణ్
విడుదల తేది: 29.11.2013
మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక
మరుమల్లెలా వికసించెనే ఎదలోతులో ఈ కలయిక
పెదవంచు దాటి మౌనమే దిగివచ్చెలే ఇలా
పొగమంచును మీటి కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెళ్ల నిండిపోయెనే నువ్వే నేనులా
I LOVE YOU SO … I LOVE YOU SO
I LOVE YOU SO … I LOVE YOU SO
మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక
అనుకోని తీరమైన నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్న చిగురాకులా
నను చూసి ఇలా నాక్కూడా కొత్తగా ఉంది కదా
కల కాదు కదా నీవెంటే ఉన్నది నేనేగా
I LOVE YOU SO … I LOVE YOU SO
I LOVE YOU SO … I LOVE YOU SO
మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక
మెరుపల్లె చేరువైతే చినుకల్లే మారనా
నీలోన నేను కరిగి పులకించనా
నీకోసం ఇలా కదిలేటి నిమిషం ఆపేస్తా
నీతోడు అలా సాగేటి కాలమే నేనవుతా
I LOVE YOU SO … I LOVE YOU SO
I LOVE YOU SO … I LOVE YOU SO
మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక