Venky Mama (2019)

వెంకీ మామ

ద్రాక్షారం జంగమయ్య భీమలింగయ్య
బిడ్డల కాచుకోవయ్యా.. బిడ్డల కాచుకోవయ్యా
మనసున్న మహిమున్న మాణికాంబిక
చల్లని తల్లి తోడుగా నువ్వు పంచవే దయ


మచ్చెరగని మేనమామ మేలు జాతి రత్నం
ఆ మామకు అల్లుడంటే అంతులేని ప్రాణం
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తియ్యవమ్మా సిరి గోదారి
ఏ పాడు కళ్ళు పడకుండా వీళ్లిద్దరు కలిసుండాలి


మామ మామ మామ
నే పలికిన తొలి పదమా
నాకే దొరికిన వరమా
నాకై నిలిచిన బలమా
నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి
నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి
పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి
నీ పేరై మోగింది గుండె సవ్వడి
అమ్మైనా నాన్నైనా నువ్వెలే వెంకీ మామ
నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామ


నీ భజమెక్కి చూసిన లోకం
నాకెంతో అందమైనది..
నీ జత నడిచి గడిపిన కాలం
గెలిపించే పాఠమైనది..
నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదో
నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది..
నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో
నాలో ప్రతి గుణము నీ పోలికైనది..
అమ్మైనా నాన్నైనా నువ్వెలే వెంకీ మామ
నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామ


ఓ సీతక్క గీతక్క మాలచ్చక్క మంగక్క..
చూడండే ఈ పక్క ఎవరొచ్చారో ఎంచక్క..
హే ఉల్లాసం ఉత్సాహం జోడి కట్టి బండెక్క
మామా అల్లుళ్లు వచ్చారే జాతర గాలే వేడెక్క
ఇట్టా కలిసి వస్తే పక్క పక్క నడిచి వస్తే..
రెప్పలేయడమింక రెండు కళ్లు మరిచిపోవాలే..
వీళ్లేచోటున్నా ఇంతే
రచ్చ రచ్చో రంగుల సంతే..
మంచి ఎగ్గొట్టేసి దిగారంటే పంబ రేగాలే..
సీతక్క.. గీతక్క..


అద్దిరబన్న ఇద్దరికిద్దరు హేమాహేమీ బుల్లోళ్లే
ఊరూవాడా హోరెత్తించే సరదాగాళ్ల చిన్నోళ్లే
వరసకేమో ఓరయ్యో వీళ్లు మామా అల్లుళ్లే
వయసు తేడా తీసేస్తే పక్కా అల్లరి పిల్లోళ్లే
వెంకీ మామ.. వెంకీమామ..ఎన్నాళ్లకో ఎన్నేళ్ళకో


ఎన్నాళ్లకో ఎన్నేళ్ళకో,

ఒంటికాయ సొంటి కమ్ము సెంటు కొట్టెరో,
ఏ ఊహలో లేని గుండెలో,
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో,

ఎడారిలో గోదారిలా,
కుడి కాలు పెట్టి , అలలు యల్లుతాందిరో,

ఏ దారికో ఏ తీరుకో,
ఈ కొంటె అల్లరెల్లి ఆగుతుందిరో 
  
హే వెంకీ మామ
గుండె పెంకులెగరగొట్టె
టీచరమ్మా

ఏ పెంకి మామ
మంకు పట్టు
సంగతేంటొ చూడమ్మా

ఎన్నాళ్లకో ఎన్నేళ్ళకో,
ఒంటికాయ సొంటి కమ్ము సెంటు కొట్టెరో,
ఏ ఊహలో లేని గుండెలో,
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో,

  
Here We Go He Is The Brand New 
Venky Mama 
What A Maama 
O Maama Maama 


మీసకట్టు చూడు
చీర కట్టు తోటి
సిగ్గే పడుతు
స్నేహమేద చేసెయ్
పైరగట్టు చూడు
పిల్లగాలి తోటి
ఉల్లాసంగా కబురులాడెనె,


వానజల్లు వేల
గొడుగుకింద చోటు కూడ
ఒక్కో అడుగు తగ్గిపోతు ఉంటె
మండు వేసవిల వెన్నలాంటి ఊసువింటు
ఉల్లాసాలె పెరిగిపోయెనే,


ఎన్నాళ్లకో ఎన్నేళ్ళకో,
ఒంటికాయ సొంటి కమ్ము సెంటు కొట్టెరో,
ఏ ఊహలో లేని గుండెలో,
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో,
  
హే వెంకీ మామ
గుండె పెంకులెగరగొట్టె
టీచరమ్మా

ఏ పెంకి మామ
మంకు పట్టు
సంగతేంటొ చూడమ్మా
  
ఎన్నాళ్లకో ఎన్నేళ్ళకో,
ఒంటికాయ సొంటి కమ్ము సెంటు కొట్టెరో,
ఏ ఊహలో లేని గుండెలో,
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో.


కోక కోలా పెప్సీమిలిటరి నాయుడు
మిలిటరి నాయుడు


చూస్తే సురసుర
తుపాకులే పేలుడు


విక్టరీ అల్లుడు
విక్టరీ అల్లుడు


వస్తే జరజర
జరీ చీరె జారుడు


సంపావే రాకాసి
సర్జికల్ స్ట్రైక్ జేసి
దింపావే గురి జూసి
నా బుజ్జి గుండెల్లో ఫ్లెక్సీ


అట్ట జేసి
ఇట్ట జేసి
దూరావే
గుండెల్లో టెంటే వేసి


కోక కోలా పెప్సీ ఏయ్
కోక కోలా పెప్సీ ఏయ్


కోక కోలా పెప్సీ
ఈ మామ అల్లుడు సెక్సీ
చల్ అత్తారింటికేసీ
ఎక్కేదామ టాక్సీ


ఏయ్ కోక కోలా పెప్సీ
ఈ మామ అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ చల్ ఎక్కేదామ టాక్సీ
మిలిటరి నాయుడు
మిలిటరి నాయుడు


చూస్తే సురసుర
తుపాకులే పేలుడు


విక్టరీ అల్లుడు
విక్టరీ అల్లుడు


వస్తే జరజర
జరీ చీరె జారుడు


సింగిల్ హ్యాండ్ తో
కొంగును గుంజరో
బలపం పట్టి
భామ వల్లో
కోచింగ్ ఇస్తానే


బ్యాంగిల్ సౌండ్ లో
బ్యాటింగ్ నేర్పరో
హండ్రెడ్ పర్సెంట్
లవ్వు బాల్లో
టీచింగ్ ఇస్తానే


మీస కట్టు
మీ పంచె కట్టు
క్లాస్ మాస్ ఐన
విజిలే కొట్టు


జోడు గుర్రాన
పగ్గం పట్టు


జోరు చూపిస్తాం
లగ్గం పెట్టు


లెఫ్ట్ స్పైసీ
రైట్ జ్యూసీ


మీ హాటు
లిప్పుల్లో మీటా లస్సీ


కోక కోలా పెప్సీ
ఏయ్ కోక కోలా పెప్సీ
ఏయ్ కోక కోలా పెప్సీ
ఈ మామ అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ చల్ ఎక్కేదామ టాక్సీ


ఏయ్ కోక కోలా పెప్సీ
ఈ మామ అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ చల్ ఎక్కేదామ టాక్సీ

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Vamsi (2000)
error: Content is protected !!