చిత్రం: వేట (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: చిరంజీవి, జయప్రద , సుమలత
దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డి
నిర్మాత: ధనుంజయ రెడ్డి
విడుదల తేది: 28.05.1986
పల్లవి:
ఓ రాణి… మహరాణి
ప్రియదర్శిని రసవర్షిణి రావే
ఈ రాణి… అలివేణి
నవరాగిణి యువమోహిని నీదే
సుధలా నా పెదవుల్లో ప్రవహించే…
ఎదలా పైఎద మీద పవళించే
మధురభావనల మౌనగీతికలోనా…
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ
ఓ రాణి… మహరాణి
నవరాగిణి యువమోహిని నీదే
చరణం: 1
వేసవి చిగురాకునై
నీ గాలిలో డోలలూగానులే
ఆమని తొలి పూవునై
నీ ప్రేమకే పూజ చేశానులే
ఇన్నాళ్ల ఎడబాటులో ఒడిగట్టినా ఆశనై
ఎడబెట్టినా ఆశతో బిగబట్టి నాశ్వాసనై
ఎదురు చూచితిని ఎదను చాచితిని నీకై…
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ…
ఈ రాణి… అలివేణి
ప్రియదర్శిని రసవర్షిణి రావే
చరణం: 2
వెన్నెలా కను గిన్నెలా
నీకోసమే నింపుకున్నానులే
వానలా తడి వీణలా
నీ పాటనే చల్లుకున్నానులే
ఇన్నాళ్ల విరహాగ్నిలో తడి ఆరినా ప్రేమనై
ఈనాటి ఈ హాయిలో తనువంత కర్పూరమై
కరిగిపోతిని కలిసిపోతిని నీలో…
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ
ఓ రాణి.. మహరాణి…
ప్రియదర్శిని రసవర్షిణి రావే
ఈ రాణి… అలివేణి
నవరాగిణి యువమోహిని.. నీదే
సుధలా నా పెదవుల్లో ప్రవహించే…
ఎదలా పైఎద మీద పవళించే
మధురభావనల… మౌనగీతికలోనా..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ