చిత్రం: విచిత్ర కుటుంబం (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణ , శోభన్ బాబు , సావిత్రి, విజయనిర్మల
దర్శకత్వం: కోవెలమూడి సూర్యప్రకాష్ రావు
( డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గారి నాన్నగారు)
నిర్మాత: కె.వి.పి.సుంకవల్లి
విడుదల తేది: 28.05.1969
సాకీ:
రష్యాలో పుట్టి భారతావనిలో మెట్టి
తెలుగువారి కోడలివై వలపులొలుకు జాజిమల్లి
వలపులొలుకు జాజిమల్లి…
పల్లవి:
ఆడవే… ఆడవే…
ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే
కలహంస లాగా జలకన్య లాగా
కలహంస లాగా జలకన్య లాగా
ఆడవే… ఆడవే
చరణం: 1
ఆదికవి నన్నయ్య అవతరించిన నేల…
ఆ…ఆ…ఆ… ఆ…ఆ…ఆ…
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్రసంస్కృతికి తీయని క్షీరధారలై
జీవకళలొల్కు గోదావరి తరంగాల
ఆడవే… ఆడవే…
చరణం: 2
నాగార్జునుని భోధనలు ఫలించిన చోట
ఆ…ఆ…ఆ… ఆ…ఆ…ఆ…
బౌద్ధమతవృక్షంబు పల్లవించిన చోట…
బుద్ధం శరణం గఛ్చామి…
ధర్మం శరణం గఛ్చామి…
సంఘం శరణం గఛ్చామి…
కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై
రూపు సవరించుకొను నీట…
ఆడవే… ఆడవే
చరణం: 3
కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట
కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట
అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు
తుంగభద్రానదీ తోయమాలికలందు
ఆడవే…ఆడవే
ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే