చిత్రం: విజయదశమి (2007)
సంగీతం: శ్రీకాంత దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: సుజాత మోహన్, హరీష్ రాఘవేంద్ర
నటీనటులు: కళ్యాణ్ రామ్, వేదిక
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఈదర రంగారావు
విడుదల తేది: 21.09.2007
ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో
ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
కలవై కలసి కథ మార్చావు
మెరుపై మెరిసి నను తాకావు
కుదురంటు లేకుంది మనసుకు
నిదరంటు రాకుంది ఎందుకు
అందర్నీ చూస్తున్నాను వింతగా
చుక్కల్ని లెక్కేస్తున్నా కొత్తగా
సరదాగా మొదలైన ఈ ప్రయాణం
మొత్తంగా ప్రేమాయణం
ఎటు చూస్తున్నా ఏదో లోకం
అటు నీవుంటే తెగ సంతోషం
ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
చంద్రుడు చేతికి అందెనా
మబ్బులు మాటలు నేర్చెనా
పువ్వులు పాటలు పాడెనా
కొండలు నాట్యములాడెనా
ఏ బ్రహ్మ సృష్టించాడో ప్రేమగానే
జగమంత వింతగుంది నేడు
ఎటు చూస్తున్నా అటు అద్బుతమే
మాయలు చేసే మది సంబరమే
ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో
hi
hi