Vijetha (1985)

Vijetha (1985)

చిత్రం: విజేత (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: చురంజీవి, భానుప్రియ, జె వి.సోమయాజులు, శారద
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 23.10.1985

పల్లవి:
ఆ.. ఆ..
ఎంత ఎదిగి పోయావయ్యా…
ఎదను పెంచుకున్నావయ్యా…
స్వార్థమనే చీకటి ఇంటిలో
త్యాగమనే దీపం పెట్టి…

ఎంత ఎదిగి పోయావయ్యా… ఆ..ఆ…ఆ..
ఎదను పెంచుకున్నావయ్యా… ఆ..ఆ..ఆ..ఆ

చరణం: 1
ముక్కు పచ్చలారలేదు నలుదిక్కులు చూడలేదు
ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా
మచ్చలేని చంద్రుడి మనసు వెచ్చనైన సూర్యుడి మమతా
నీలోనే చూశామయ్యా  నీకు సాటి ఇంక ఎవరయ్య ఆ.. ఆ..

ఎంత ఎదిగి పోయావయ్యా… ఆ..ఆ..ఆ.. ఓ ఓ

చరణం: 2
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన…
నీకు నీవు రాసుకున్న నుదిటి గీత భగవథ్గీత

Greater love hath no man than this..
that a man lay down his life for his people..

అన్న ఆ బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట
దేవుడనే వాడు ఒకడుంటే  దీవించక తప్పదు నిన్ను..

జీవేన శరదాంశతం
భవామ శరదాంశతం
నందామ శరదాంశతం

********   ********   *********

చిత్రం: విజేత (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

పల్లవి:
హే…హే హే హే హే…
ఓ..లలలలాల…

జీవితమే ఒక పయణం
యవ్వనమే ఒక పవనం
వేగం వలపు రాగం ఎంత మధురం
పోదాం చేరుకుందాం ప్రేమ తీరం

హే..హే… హే… జీవితమే ఒక పయణం

చరణం: 1
లయలో  నీ లయలో  నీ వయ్యారమే చూడనా
జతలో  నీ జతలో  నీ అందాలు వేటాడనా
వడిలో నీ వడిలో   పూల ఉయ్యాలలే ఊగనా
వలపే నా గెలుపై ప్రేమ జండాలు ఎగరేయనా

ఈ లోకమే… మన ఇల్లుగా
పట్టాలే కలిపేసి చెట్టపట్టాలు పట్టెయ్యనా

జీవితమే ఒక పయణం..

చరణం: 2
ఎగిరి  పైకెగసి  నే తారల్ని తడిమెయ్యనా
తారా దృవతారా  నీ తళుకుల్ని ముద్దాడనా
రాణి  మహరాణి  నా పారాణి దిద్దేయ్యనా
బోణీ  విరిబోణి  తొలిబోణీలు చేసేయ్యనా
మేఘాలలో… ఊరేగుతూ
మెరుపుల్లో చినుకుల్లో సిగ్గంత దోచేయ్యనా

జీవితమే ఒక పయణం

చరణం: 3
అలల ఊయలలా నిను ఉర్రుతలూగించనా
తడిసే  నీ ఎదలో నే తాపాలు పుట్టించనా
మురిసే నవ్వులలో ఆణిముత్యాలు పండించనా
మెరిసే కన్నులలో నీలి స్వప్నాలు సృష్టించనా
కెరటాలకే ఎదురీదుతూ
వెన్నెల్లా నావల్లో  ఈ సంద్రాలు దాటెయ్యనా

జీవితమే ఒక పయణం యవ్వనమే ఒక పవనం
వేగం వలపు రాగం ఎంత మధురం
పోదాం చేరుకుందాం ప్రేమ తీరం

హే.. హే హే హే హే హే హే
ఓ..లలలలలాలా…

********  ********  ********

చిత్రం: విజేత (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

పల్లవి:
యాయ యాయ యాయ యాయ…
యాయ యాయ యాయ యాయ…

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన నా గుండె గిల గిలలాడిందమ్మా
కాదు బిడియాలకు వేళా
లేరా సయ్యాటకు రారా
పరువాలకు పాడర జోల….

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా

చరణం: 1
కూకుంటే కునుకొస్తాది
కునుకొస్తే.. హ.. కలలొస్తాయి
తానాలు ఆడేస్తున్నా తాపం తగ్గదురా
దీపాలు పెట్టారంటే ప్రాణం నిలవదురా
మల్లెల మబ్బులు ముసిరే వేళ
ఊహకు ఉరుములు పుట్టే వేళ
చినుకంత ముద్దాడి పోరా….

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన నా గుండె గిల గిలలాడిందమ్మా

చరణం: 2
పగటేల చలి వేస్తాది
నడిరేయి ..హా.. గుబులొస్తాది
పక్కంత దొర్లేస్తున్నా పరువం ఆగదురా
ఒల్లంత నిమిరేస్తున్నా వలపే తీరదురా
మొటిమలు మొగ్గలు పుట్టే వేళ
బుగ్గకు ఎరుపులు పట్టె వేళ
ఎదనిండ అదిమేసుకోరా

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన.. అబ్బా..  నా గుండె గిల గిలలాడిందమ్మా
కాదు బిడియాలకు వేళా
లేరా సయ్యాటకు రారా
పరువాలకు పాడర జోల….

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన నా గుండె గిల గిలలాడిందమ్మా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top