చిత్రం: విజేత విక్రమ్ (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: వెంకటేష్ , ఫరా
దర్శకత్వం: ఎస్.ఎస్.రవిచంద్ర
నిర్మాత: కె.నరసా రెడ్డి
సమర్పణ: డా.ఎమ్. తిరుపతి రెడ్డి
విడుదల తేది: 14.08.1987
పల్లవి:
గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
ఆహా పొందులో ప్రేమ విందులో
పొందులో ప్రేమ విందులో
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నుల్లో తొలివలపు కళలారాబోసింది జాణలా
రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా
చరణం: 1
చామంతి నిగ్గు చంగావి సిగ్గు చెక్కిళ్ళ కురిసేటి వేళ
అరె ఈ వాలుపొద్దు ఓ పూల ముద్దు కౌగిల్లు కోసరేటి వేళ
గుండెలోన కొత్త కోరుకుంది చెప్పబోతే గొంతు దాటకుంది
గోదారి పొంగల్లె దూకేటి నీ ఈడు నా దారికొచ్చింది లేవమ్మో
నీ దారి నాదారి ఒకటైన వయసల్లే రావయ్యో..
అల్లుకో అల్లిబిల్లిగా మత్తుగా గమ్మత్తుగా
గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా
చరణం: 2
అందాల కొమ్మ అపరంజి బొమ్మ తోడుంటే తీరేను తాపం
ఆ నీలి కళ్ళ వాకిళ్లలోన మెరిసేను ఆకాశ దీపం
తీరకుంది తీపి దాహమేదో ఆరకుంది వింత మోహమేదో
మొగ్గల్లే నువ్వొస్తే సిగ్గిల్లే సిరిమల్లె
సిగురాకు సొగసంత నాదమ్మో
ఈ పూల పందిళ్లు మురిపాల సందిళ్ళు నీకయ్యో
మెత్తగా పూల గుత్తిగా హత్తుకో కొత్త కొత్తగా
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
ఆహా పొందులో ప్రేమ విందులో