చిత్రం: వింతకాపురం (1968)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర
గానం: గంటసాల , పి.సుశీల
నటీనటులు: కృష్ణ , కాంచన
దర్శకత్వం: అబ్బి
నిర్మాత: వి.వెంకటేశ్వరులు
విడుదల తేది: 08.11.1968
పల్లవి:
చూడు తడాఖా కాదు మజాకా
కాదు మజాకా నా దారికి లేదు డోకా
కోరస్: చూడు తడాఖా కాదు మజాకా
ఆపవోయి నీ బాకా బాకా బాకా బాకా బాకా
మ్మె మ్మె మ్మె మేక
డొక్కు కారు దొరగారు టెక్కు చూపుతున్నారు
నిక్కీ నీల్గి పోటీకొస్తే చిక్కుల్లో పడతారు
కోరస్: బహు చిక్కుల్లో పడతారు
కుర్రకారు దొరసాన్లు నేర్చారు ఫ్యాషన్లు
మగాళ్ల దుస్తులు ధరించగానే
దువ్వలేరు మీసాలు
ఆడదంటే నాజూకు ఆ పేరే పువ్వుల రేకు
గయ్యాలిగా మారినప్పుడు వెయ్యాలి బ్రేక్
చేతగాని మగవాడు నీతి బోధ చేస్తాడు
పాతకాలపు గొప్పకు పోతే
భలే చిత్తు అవుతాడు
కోరస్: ఆకతాయి పిల్లోడా రాలుగాయి బుల్లోడా
ఆడవాళ్ళతో డీడిక్కీ అంటే తింటావోయ్ ఖాజా
చ చ ఆప్ట్ డేట్ లేడీస్ తగ్గుట ఎంతో నైసు
హద్దుమీరి చెలగాటం ఆడితే ఆట అంతతో క్లోజ్
కోరస్: బాకా బాకా బాకా బాకా మ్మో య్య య్య