చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి రామకృష్ణ
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాత: పి.ఎస్.రామకృష్ణారావు
సమర్పణ: భానుమతి రామకృష్ణ
విడుదల తేది: 10.12.1954
(పి.ఎస్.రామకృష్ణారావు గారు భానుమతి గారి భర్త)
పల్లవి:
విరహే.. ఏ.. ఏ.. ఏ.. ఏ.. తవ దీనా… ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా
చరణం: 1
నిందతి చందన మిందు కిరణమను విందతి ఖేద మదీరం
వ్యాల నిలయ మిలనేన గరళమివ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వ్యాల నిలయ మిలనేన గరళమివ కలయతి మలయ సమీరం
సావిరహే తవ దీనా
చరణం: 2
కుసుమ విషిఖసర తల్పం అనల్ప విలాస కళా కమనీయం
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం
సావిరహే తవ దీనా
చరణం: 3
ప్రతిపదం ఇదమపి నిగదతి మాధవ
నిగదతి మాధవ
నిగదతి మాధవ తవ చరణే పతితాహం
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా
కృష్ణ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తావవిరహే తవ దీనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
****** ****** ******
చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఏ. ఎం. రాజా
పల్లవి :
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు
వెదజల్లె నెత్తావి విరబూచి విరులు
విరితేనెలాని మైమరచు తుమ్మెదలు
లేచెను విహగాళి లేచెను నిదురా
చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు
రేయి వేగినది వేళాయె పూజలకు
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
చరణం: 1
పరిమళద్రవ్యాలు బహువిధములౌ నిధులు గైకొని దివ్యులు
కపిలధేనువును అద్దమ్ముపూని మహర్షి పుంగవులు
మురువుగా పాడ తుంబురు నారదులును
నీ సేవకై వచ్చె నిలచియున్నారు
సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని మొగసాల కాచియున్నారు
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
చరణం: 2
దేవరవారికై పూవుల సరులు తెచ్చిన
తొండరడిప్పొడి మురియ
స్నేహదయాదృష్టి చిల్కగా జేసి
పెద్దను విడి కటాక్షింప రావయ్యా
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
****** ****** ******
చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఏ. ఎం. రాజా
పల్లవి:
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
కరుణాంతరంగ శ్రీరంగా…
పాలించర రంగా..
చరణం: 1
మరువని తల్లివి… తండ్రివి నీవని…
మరువని తల్లివి… తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా…
మొరవిని పాలించే..ఏ.. దొరవని
మొరవిని పాలించే..ఏ..ఏ.. దొరవని
శరణంటినిరా… శ్రీరంగా
పాలించర రంగా…
చరణం: 2
మనసున నీ స్మృతి మాయకమునుపే …
మనసున నీ స్మృతి మాయకమునుపే
కనులను పొరలూ మూయకమునుపే
కనరారా… ఆ… ఆ…
కనరారా నీ కమనీయాకృతి
కనియద మనసారా ..ఆ..ఆ…రంగా
కనియద మనసారా…
పాలించరా రంగా …పరిపాలించరా రంగా
చరణం: 3
కరులును హరులును మణిమందిరములు
కరులును హరులును మణిమందిరములు
సురభోగాలను కోరనురా …సురభోగాలను కోరనురా
దరి కనరానీ భవసాగరమును….
దాటించుమురా గరుడ తురంగా…
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
పాలించర రంగా..
****** ****** ******
చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఏ. ఎం. రాజా
పల్లవి:
చూడు మదే చెలియా కనులా…చూడు మదే చెలియా
చూడు మదే చెలియా కనులా…చూడు మదే చెలియా
బృందావనిలో నందకిషోరుడు…
బృందావనిలో నందకిషోరుడు… అందముగా దీపించే లీల
చూడు మదే చెలియా కనులా… చూడు మదే చెలియా
చరణం: 1
మురళీకృష్ణుని మోహనగీతికి…
మురళీ కృష్ణుని మోహనగీతికి…పరవశమైనవి లోకములే…ఏ..
పరవశమైనవి లోకములే… విరబూసినవి పొన్నలు.. పొగడలు
విరబూసినవి పొన్నలు పొగడలు…
పరిమళం ఎగసెను మలయానిలమున తూలెను .. యమునా
చూడు మదే చెలియా కనులా…చూడు మదే చెలియా
చరణం: 2
నారి నారి నడుమ మురారి…
నారి నారి నడుమ మురారి…
హరికి.. హరికి నడుమ వయ్యారి
హరికి.. హరికి నడుమ వయ్యారి…
తానొకడైనా ..ఆ..ఆ..ఆ..ఆ…ఆ
తానొకడైనా … తలకొక రూపై
తానొకడైనా… తలకొక రూపై…
మనసులు దోచే రాధా మాధవ కేళి నటనా…
చూడు మదే చెలియ …కనులా…చూడు మదే చెలియా
****** ****** ******
చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి రామకృష్ణ
పల్లవి:
ఓ..ఓ..ఓ..ఓ..ఓ….ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా…
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా…
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా….
చరణం: 1
వన్నెవన్నె చిన్నెలేను ఈ విలాసం…
వన్నెవన్నె చిన్నెలేను ఈ విలాసం
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం…
నిన్నేలువాని లీలలేరా..
నిన్నేలువాని లీలలేరా..
కన్నార కనరా ఏలుకోరా..
కన్నార కనరా ఏలుకోరా…
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా…
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా…
చరణం: 2
అందరాని విందుపైన ఆశలేలా
అందరాని విందుపైన ఆశలేలా..
పొందుకోరు చిన్నదాని పోందవేలా…
అందాలరాయా అందరారా…
అందాలరాయా అందరారా…
అనందమిదియే అందుకోరా
అనందమిదియే అందుకోరా…ఓ..ఓ..ఓ..
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా…
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా…