కోలు కోలమ్మా.. కోలో… లిరిక్స్
చిత్రం: విరాటపర్వం (2021)
సంగీతం: సురేశ్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య మాలిక, సురేశ్ బొబ్బిలి
నటీనటులు: రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్
దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాణం: సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు దగ్గుబాటి
విడుదల తేది: 2021
Kolu Kolu Song Telugu Lyrics
కోలు కోలో కోలోయమ్మ… కొమ్మా చివరన పూలు పూసే, కోలో
పువ్వులాంటి సిన్నదేమో… మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే
హే పిల్లగాడి మాటలన్ని… గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
కుర్రవాడి చూపులన్ని… కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా
వాడి గూర్చి ఆలోచనే… వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే
పాదమేమో వాడిదంట… పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా
అక్షరాలు వాడివంట… అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా
ప్రాణమంతా వాడేనంటా… ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే
Virata Parvam Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
nice
super song
O lachha gummadi song lyrics kuda add cheyand
my favorite song is kolu kolu song only