చిత్రం: వివేకం (2017)
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సత్యప్రకాష్, షాషాతిరుపతి
నటీనటులు: అజిత్, కాజల్ అగర్వాల్, అక్షర హసన్, వివేక్ ఒబేరాయ్
దర్శకత్వం: సిరుతై శివ
నిర్మాత: త్యాగరాజన్
విడుదల తేది: 24.08.2017
ఆనందమానందం ఆనందమే
ఒక్కోక్షణం నీతో అద్భుతమే
సరసాలు రాగాలు ఆనందమే
సరిపోని బింకాలు అద్భుతమే
కనుల నిండా కలల నిండా ఉంది నీవేలే
ఊపిరైనా ఊపిరల్లే ఉంది నీవల్లే
నా యీ జీవితం నీదే మరేదీ కోరికే లేదే
స్వయానా నువ్వుగా ప్రేమేఇలా నను కోరి చేరిందే
ఆనందమానందమానందమే
ఒక్కోక్షణం నీతో అద్భుతమే
సరసాలు రాగాలు ఆనందమే
సరిపోని బింకాలు అద్భుతమే
ఒక నువ్వు పక్కనుంటే చాలునంటానే
స్వర్గమైనా నరకమైనా మరచిపోతానే
అర ముద్దులొ చలిమల్లెపూవై నలిగిపొతాలే
తెల్లారి పొద్దులో నీ గుండెగువ్వై ఒదిగిపోతాలే
నీవు నేను ఒక్కరె అనీవేళ చాటాలే
చంటి పాపై జననమై మన ప్రేమ వెలగాలే
ఆనందమానందం ఆనందమే
ఆనందమానందం ఆనందమే
ఆనందమానందం ఆనందమే