చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రామ్ పోతినేని, లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 27.10.2017
ఉన్నది ఒకటే జిందగి
ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా
ఈ జిందగి మొత్తం మనతో ఉండేవాడే
నిజమైన ఫ్రెండ్
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ నుండి బైక్ లోకి మారినా
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా
నోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి మారినా
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాక
కాలింగ్ మారినా…
ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారునా
ఫీలింగ్ మారునా….
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
ఎండ్ కాని బాండ్ పేరే ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే
పుల్ల ఐస్ నుండి క్రీమ్ స్టోన్ కి మారినా
రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్పే
ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ఫోన్ కి మారినా
మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే
టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారినా
పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్పే
పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
ఎండ్ కాని బాండ్ పేరే ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే
పెన్సిళ్ల నుండి పెండ్రైవ్ కి మారినా
నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్పే
ఫ్రూటీల నుండి బీరులోకి మారినా
పొందుతున్న కిక్ పేరే ఫ్రెండ్షిప్పే
మొట్టికాయ నుండి గట్టిపంచ్ లోకి మారినా
నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్పే
అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
ఎండ్ కాని బాండ్ పేరే ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే
******** ********* *********
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవి శ్రీ ప్రసాద్
ఆ.. మైక్ ఉన్నదే పాట లేదు
డప్పు ఉన్నదే బీటే లేదు
స్పీకరున్నదే పెప్పే లేదూ
స్టేజు ఉన్నదే స్టెప్పే లేదూ
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
పంచ్ ఉన్నదే కౌంటర్ లేదు
సర్కిలున్నదే సెంటర్ లేదు
ఈడు ఉన్నదే ఈలే లేదు
బాడీ లోపల గోలే లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
హే రాగమున్నది రంభే లేదు
రంగు ఉన్నది పొంగే లేదు
బ్యాండ్ ఉన్నది సౌండే లేదు
గ్యాంగ్ ఉన్నది బాంగే లేదు
మేజువాని ఉన్నా ఏ జవాని లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
అరె వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా అయ్యో..
టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్లి బుక్కైనట్టు
రేటింగ్ చూసి రెచ్చిపోయి డిన్నర్ కెళ్ళి లాకైనట్టు
క్రేజ్ చూసి మోజుపడి చైనా ఫోన్ కి ఫూలైనట్టు
ఆఫరుంటే ఆశపడి ఆన్లైన్ మని బ్లాకైనట్టు
వెల్కమ్ పోస్టర్ ఉంది కాని పార్టీ ఊసే లేదు
డిస్కో డాన్స్ ఉందీ కాని జ్యోతిలక్ష్మీ లేదూ
గ్లామర్ బోలెడు ఉంది కాని ఓ గ్రామరంటు లేదు
రాతిరి మొత్తం ఉంది జాతర జాగరమే లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
అరె వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ
ఆ పండగేల తెచ్చుకున్న థౌసాండ్ వాలా తుస్సన్నట్టు
కల్లు తాగి కోతిపిల్ల లోల్లే మరచి తొంగున్నట్టు
పవర్ బాంక్ ఫుల్ గున్నా ఛార్జింగ్ కేబుల్ కట్టైనట్టు
ఫ్రైడే రోజు పబ్బు ఉన్నా ట్రై డే అంటూ బోర్డెట్టినట్టు
గ్రూపు ట్రూపు ఉంది ఊపులేమి లేవు
బారు బీరు ఉంది ఏ జోరు లేనే లేదు
మ్యాటర్ బోలెడు ఉంది ఓ మీటరంటు లేదు
ప్రాణం పంచే స్నేహం ఉంది మనసే పంచే మార్గం లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
అమ్మ వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ
******** ********* *********
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్
ఎవరెస్ట్ హైటే చాలదే ఓ..
పసిఫిక్ లోతే చెల్లదే ఓ…
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైలుకు ఓ స్కేల్ ఎందుకు
ఎవరెస్ట్ హైటే చాలదే ఓ..
పసిఫిక్ లోతే చెల్లదే ఓ…
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైలుకు ఓ స్కేల్ ఎందుకు
అర్ ఎక్సయిట్మెంట్ ఎగ్జామ్పులై పద ముందుకు
ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
లైఫే ఒక పాఠశాల
కష్టం నష్టం మన బెంచ్ మేట్సే
ఎన్నో అనుభవాల
మన పయనాలే మొత్తం బెంచ్ మర్క్స్
చిరు చిరు గొడవల పిడుగుల వానొచ్చినా
మన చెలిమను గొడుగును దాటొచ్చునా
మన అడుగుల కలిపిన ఓ నిచ్చెనే స్నేహం హం హం హం
ఒడి దుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా
ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
కడదాం ఓ కొత్త కంట్రీ
స్నేహం కోసం ఖండాలు దాటి
పెడదాం ఓ కొత్త పార్టీ
ఫ్రెండ్షిప్పంటూ మరి పేరు పెట్టి
డేట్ అఫ్ బర్త్ ని మార్చే వీలుండదే
మన జర్నీ ఎండ్ కి డేటుండదే
నడి మధ్యలో లైఫ్ ని గిఫ్ట్ గ ఫీలవుదాం ధామ్ ధామ్
ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం
ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
******* ********* ********
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దివ్య కుమార్ , యమ్.యమ్.మానసి
స రి గ రి స ని స ని స
ప ని మ ప ఆ అ అ ఆ
ప మ ప మ గ ప మ
స గ స గ స ని
గ స ని ప
స స ని ప ని
ని ని ప మ ప
గ మ గ మ
మ ప మ ప
అ ఆఆ ఆ ఆఆ ఆఆఆ
హా రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో
స గ స గ రి స ని ప
హే ఘల్లు ఘల్లు మంటూ
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో
సా… గ స గమ ప మ గ
నీలాకాశం ఎంత దూరం ఉన్నా
ఎగిరామంటే,అందదా
ఊహ లోకం ఎక్కడెక్కడున్న
పిలిచామంటే నిజాంగా నిజం కదా ..
రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో
ఆ ఆఆఆఆ
ఘల్లు ఘల్లు మంటూ
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో
స రి ప ని స రి మ గ రి స
స రి గ ప మ గ రి స
స రి ప ని స రి మ గ రి స
స రి గ ప మ గ ద …
ప ద ప మ గ మ గ రి గ రి
రి గ మ ప గ రి స రి
ప ద ప మ గ మ గ రి గ రి
రి గ మ ప గ
ఒక్క అడుగైనా వేసి చూడందే
వద్దకొచ్చేనా కలల తీరమే
ఒక్క కలనైనా
నిజము చేయందే
నిదుర పోనందే గెలుపు ఖాయమే
స్వేచ్ఛ అంటే అర్థం
ఏ కుక్క పిల్లో కాదు
కోరుకున్న నిజము ఎగిరి వెళ్లిపోదామే
రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో
ఘల్లు ఘల్లు మంటూ
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో
హ ఆ ఆఆ… దారి చూపించే
వెలుగు వెంటుంటే
కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులొ
బొమ్మ గీయించి కుంచె తోడుంటే
రేయిని సైతం ఎన్నెన్ని రంగులో
చెలిమి అంటే అర్థం పరిచయాలు కాదు
తోడు నీడ కాలి నడకలో పరుగులు
రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో
ఓ ఓహోహో .. ఘల్లు ఘల్లు మంటూ
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో
******** ******** ********
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యాజిన్ నిజార్ , ప్రియ హిమేష్
యల్లో అంటే స్వేచ్చా
ఆరెంజ్ అంటే ఆశా
బ్లూ అంటే సంతోషం
రెడ్ అంటే ఆవేసం
గ్రీన్ అంటే ప్రసాంతం
వైలెట్ అంటే పంతం
ఇండిగో ప్రేమల సిద్దాంతం
రంగులన్ని చల్లిన కాగితం జీవితం
లైఫ్ ఇస్ అ రెయిన్.బో
రంగుల్లో రంగైపో
ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో
రంగుల్లో రంగైపో
గయ్స్ టునైట్ ఐయాం గోఇంగ్ టూ
ఇంట్రడ్యూస్ టూ యూ ఆల్ బ్యుటిఫుల్ వాఇస్
హూ’స్ గోన్న రాక్ యు
లేడీస్ అండ్ జెంటిల్మెన్
ప్లీస్ వెల్కం మహా
హా ఆ ఆ ఆ ఆ మేఘంలాగ మొదలైంది
నాలోని రాగం
గాలే వచ్చి కదిలించింది
ఓ తీపి స్నేహం
మెరుపయ్యింది ఉరుమయ్యింది
ఇన్నాల్ల మౌనం
వానయ్యింది వరదయ్యింది
ఈ నాటి గానం
నా పాటె ఓ వానై వస్తే
మీరంత ఓ వెలుగై ఉంటే
హెయ్ నా పాటె ఓ వానై వస్తే
మీరంత ఓ వెలుగై ఉంటే
వాన వెలుగు కలిసిన వేల
ఆనందాల హరివిల్లె రాదా
లైఫ్ ఇస్ అ రెయిన్.బో
రంగుల్లో రంగైపో
ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో
రంగుల్లో రంగైపో
హా..ఆ..మాటె తీయ్యని పాటవుతుంది
స్వరమే తోడుంటే
భాదే చివరకి బలమౌతుంది
చెలిమే తోడుంటే
హోయ్ కడలే ఎగసే అలలవుతుంది
కలలే తోడుంటే
కలలే కంటె నిజమౌతుంది
తపనే తోడుంటే
నమ్మకమే నీ తోడై ఉంటే
అరె నిమిషాలన్నీ నిచ్చెన కావా
హొ హో నమ్మకమే నీ తోడై ఉంటే
నిమిషాలన్ని నిచ్చన కావా
చిరునవ్వే తోడై ఉంటే
నీ చిరునామ హరివిల్లే కాదా
లైఫ్ ఇస్ అ రెయిన్.బో
రంగుల్లో రంగైపో
ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో
రంగుల్లో రంగైపో