చిత్రం: యజ్ఞం (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: గోపికా పూర్ణిమ , శ్రీవర్ధిని
నటీనటులు: గోపిచంద్ , సమీరా బెనర్జీ
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాత: పోకూరి బాబూరావు
విడుదల తేది: 02.07.2004
హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా
తియ్యగా కొమ్మ ఒళ్ళో పున్నాగ పువ్వల్లె నవ్వమ్మా
హరివిల్లుగ నవ్వుతు ఉంటే ఎండల్లో వెన్నెల కాయదా
చిరు జల్లుగ నవ్వుతు ఉంటే కొండైనా వాగల్లె పొంగదా
నునుమెత్తగ నవ్వుతు ఉంటే ముల్లైన పువ్వల్లె తాకదా
తొలిపొద్దుగ నవ్వుతు ఉంటే రాయైనా రత్నంగా మారదా
అగ్గిలా మండిపడే నీ పంతమంతా
తగ్గితే చాలుకదా నీ జంట ఉంటా
అడుగే వేయనుగా నువ్వాగమంటే
అల్లరే ఆపు నువ్వే చెలరేగుతుంటే
బుద్ధిగా ఉంటాను అంటే నువ్వు నా బంగారు కొండ
ముద్దుగా నా మాట వింటే నువ్వు నా ముత్యాల దండ
రాముణ్ణై మంచి బాలుణ్ణై నే ఉంటా చక్కా
ఎవ్వరూ నిన్ను యముడే అనుకోరే ఇంక
హద్దులే ఎరగనిది ఈనాటి స్నేహం
వద్దకే చేరదుగా ఏ చిన్న దూరం
ఎప్పుడూ వాడనిది ఈ పూల గంధం
జన్మలో వీడనిది ఈ రాగబంధం
గూటిలో గువ్వలు సాక్షి గుడిలో దివ్వెలు సాక్షి
చెప్పుకున్న ఊసులే సాక్షి చేసుకున్న బాసలే సాక్షి
దైవమా కాపు కాయుమా ఈ పసి జంటకి
కాలమా నువు రాకుమా ఈ పొదరింటికి
********* ********* *********
చిత్రం: యజ్ఞం (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, శ్రేయా ఘోషల్
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే
రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి
సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి
దాడిలో వాడికి ఎప్పుడూ ఆ ధాటి కనలేదని
చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి
చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని
చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి
సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి
మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా
రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకెనే
తరలి రావా ఆ తారలూ రేయి నడిజాములో
వాలుజడసీమలో జాజులై తల దాచుకుంటామని
మురిసిపోవా రాదారులు వాయువేగాలతో
వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే విని
మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా
మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా
కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకనే చూపగా
ఝుమ్మ్నే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ