Yamagola Malli Modalayindi (2007)

చిత్రం: యమగోల మళ్ళీ మొదలైంది (2007)
సంగీతం: జీవన్ థామస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మురళి ,
నటీనటులు: శ్రీకాంత్ , వేణు, మీరా జాస్మిన్ , రీమా సేన్
దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి
నిర్మాతలు: అమర్ , రాజశేఖర్, సతీష్
విడుదల తేది: 23.08.2007

ఓ సుబ్బారావు ఓ అప్పారావు
ఓ వెంకట్రావు ఓ రంగారావు
ఓ సుబ్బారావు ఓ అప్పారావు
ఓ వెంకట్రావు ఓ రంగారావు
ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే
మీరొచ్చారా ఐనా కానీ రెడీ రెడీ రెడీ రెడీ
అంగట్లో అన్ని ఉన్నాయ్
వాగిట్లో అందాలున్నాయ్
చీకట్లో చిందులు ఉన్నాయ్
ఏం కావాలి నీకు ఏమేం కావాలి
ఏం చెయ్యాలి నేను ఏమేం చెయ్యాలి

నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
జోరు మీద ఉన్నాను జోడు కడతావా
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా
బంగారు కొండ మీద శృంగార తోటలోన
చిలకుంది తెమ్మంటావా గిలకుంది ఇమ్మంటావా
ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా
హారాలకే అగ్రహారాలు  రాసిస్తా
అందాల గని ఉంది తవ్వి తీసుకో
నీకందాక పని ఉంటే నన్ను చూసుకో

నా పరువం నీ కోసం  నా పరువం నీ కోసం
పల్లవి పాడుతున్నది  మెల్లగ ఆడుతున్నది
కోరిక పండగా నిండుగా
నా పరువం నీ కోసం నా పరువం నీ కోసం
రాకరాక వచ్చారోయ్ మా ఇంటికి నా పడకింటికి
చూడగానే నచ్చారోయ్ నా కంటికి నీ కలకంటికి
ఈ సమయం నా హృదయం
ఈ సమయం నా హృదయం
ఇంతలోనే నాగులాగ ఊగుతున్నది చెలరేగుతుంది
నా పరువం నీ కోసం నా పరువం నీ కోసం

పుట్టింటోళ్ళు తరిమేశారు
కట్టుకున్నోడు వదిలేశాడు
అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు
కట్టుకున్నోడు వదిలేశాడు
పట్టుమని పదారేళ్ళురా నా సామి
కట్టుకుంటే మూడే ముళ్ళురా
అయ్యోపాపం పాపాయమ్మ
టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపాయమ్మ
టింగురంగా బంగారమ్మ
అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి
కట్టుకథలు చెప్పమాకులే
ఆఁ అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి
కట్టుకథలు చెప్పమాకులే
చుట్టుకొలత ముప్పైఆరులే
చెవిలోన పూలుగట్రా పెట్టమాకులే

పుట్టింటోళ్ళు తరిమేశారు
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేశాడు
టింగురంగా బంగారమ్మ

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్ ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

error: Content is protected !!