Yamudiki Mogudu (1988)

Yamudiki Mogudu (1988)

చిత్రం: యముడికి మొగుడు (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం:  వేటూరి
గానం:  మనో,  సుశీల
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, రాధ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాతలు: నారాయణ రావు, సుధాకర్
విడుదల తేది: 29.04.1988

పల్లవి:
ఎక్కూ బండెక్కు మావా.. ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే మావా.. గుండె వేడెక్కె మావా
గూట్లో చటుంది రారా… అయ్యో రామా

ఇదిగున్నది  ఈడొచ్చాక.. అది ఆగదు మనసిచ్చాక
నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా
లేచిరమ్మంటే ముద్దుకు.. జున్నంటి ముద్దుకు చంటివాడా

ఎక్కూ బండెక్కు మావా.. ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా

చరణం: 1
కన్నే కొట్టెసి చూడు..  చెయ్యే పట్టెసి చూడు
ఘాటుగా కాస్త నాటుగా
నన్నే చుట్టేసి చూడు.. చుట్టు కొలతెంతో చూడు
చాటుగా చెట్టు చాటుగా

ఓర్లో పాపిష్టి కళ్ళు… చేలో కోపిష్టి ముళ్ళు
ఒళ్లంత గుచ్చుకోవా
నాకే ఇచ్చేసి ఒళ్ళు… నాలో కట్టేసి ఇల్లు
రేయంత రెచ్చిపోకా

నీ మగసిరితోటే బేరం… నా సొగసే నీకిక లాభం
గుత్తి వంకాయ కూరలా గుమ్మెత్తిపోయెరా వన్నెలాడి
కొత్తరాటావకాయలా చిరెత్తినప్పుడే నువ్వు జోడి

ఎక్కూ బండెక్కు మావా.. ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే మావా.. గుండె వేడెక్కె మావా
గూట్లో చటుంది రారా… అయ్యో రామా

చరణం: 2
రవ్వాలడేట్టుకుంటా.. రాత్రి ముద్దెట్టుకుంటా
నేర్పవా… దారి చూపవా
ఈడే పెట్టెసుకుంటా.. ఈదీ ఒడ్డందుకుంటా
దక్కవా.. చేత చిక్కవా

ఉప్పుకారాలు తిన్న ఊసే నీ దగ్గరుంటే
నీదంత కట్టుకోనా
మునగాకడంటి నిన్ను ముద్దపప్పంటి నేను
ముప్పూటలొండుకోనా

నీ తట్టను నే దులిపేస్తా… నీ పిట్టకు నే వల వేస్తా
 ఎంత బాలా కుమారుడే లీలా వినోదుడే పిల్లవాడు
అబ్బా… నందాకిశోరుదే.. అందాల చోరుడే చిన్నవాడు

ఎక్కూ బండెక్కు మావా.. ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే భామా.. గుండె వేడెక్కె భామా
గూట్లో రూపాయి బిల్ల నాదే భామా

ఇదిగున్నది ఈడొచ్చాక…   అది ఆగదు మనసిచ్చాక
నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా
లేచి రమ్మంటే ముందుకు వచ్చాను అందుకు ముద్దులాడా..

**********  **********  **********

చిత్రం: యముడికి మొగుడు (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా..
తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా..
నీ ఒంపులో నా కొంపలే.. నేనెప్పుడో వేశానులే
జళ్ళో పువ్వు… ఒళ్ళో నువ్వు… మళ్ళీ నవ్వేదింకెన్నడు

బహుశా నీకు అందంలో నచ్చి ఉంటా…
సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా..
కవ్వింపుతో నా సొంపులే కైపెక్కగా కరిగానులే
ఆకు వక్కా దిండు పక్క చెమ్మచెక్క ఇంకెన్నడు

చరణం: 1
అటో అందము.. ఇటో అందము… అసలే అందమంటూండగా
ఒకే పరువము చెరో పక్కనా ఇక నీ సొంతమౌతుండగా
హేయ్.. ఊసులాడి ఊరించుకో.. ఊపు మీద కవ్వించుకో
రాత్రి పగలే రప్పించుకో.. రాసలీలే ఆడించుకో
ఆ మాటిచ్చి.. ఓమాటోచ్చి.. ఈమాటిచ్చే రుచులందుకో

బహుశా నీకు అందంలో నచ్చి ఉంటా…
తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా..

చరణం: 2
పొదచాటుగా పొరపాటుగా బులపాటాలు పండించగా
చెలి పైటలో చలి పాటలే యమతాళాలు వాయించగా
హేయ్.. పూలు పెట్టి పండందుకో… పైట లాగి పాలించుకో…
రెచ్చకొట్టి రేయుండిపో… చిచ్చుపెట్టే సిగ్గంటుకో
ఒకటే పిచ్చి.. నీలో హెచ్చి.. గిల్లిగిచ్చి లాలించుకో
బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా..
సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా..
నీ ఒంపులో నా కొంపలే.. నేనెప్పుడో వేశానులే
ఆకు వక్కా దిండు పక్క చెమ్మచెక్క ఇంకెన్నడు

**********  **********  **********

చిత్రం: యముడికి మొగుడు (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి. బాలు, యస్. జానకి

పల్లవి:
వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే .. లయలే చూసి లాలించుకో
ఓ.. వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో .. జతులాడాలి జతచేరుకో ..ఓ..
వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా

చరణం: 1
వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో .. వద్దు లేదు నా భాషలో
మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో .. హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరి తాకితే..  ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే హోయ్ సోకితే.. కోరికన్నదే రేగదా?
వడగట్టేసి బిడియాలనే .. ఒడి చేరాను వాటేసుకో..
 వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా… నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా

చరణం: 2
అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా… చీరకట్టు తానాగునా
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా… జారుపైట తానాగునా
క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే .. గొడుగేసాను తలదాచుకో
వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా

చితచితలాడు ఈ చిందులో .. జతులాడాలి జతచేరుకో ..ఓ..

**********  **********  **********

చిత్రం: యముడికి మొగుడు (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి. బాలు, యస్. జానకి

పల్లవి:
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది…
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది… ఎట్టాగమ్మ

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట…ఆ…ఆ..

చరణం: 1
ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో… వచ్చి వాటేసుకో
కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో… మంచు ముద్దు ఇచ్చుకో
పల్లె అందంలో పైటే జారితే… పడుచు గంధంలో పాటే పుట్టదా..
వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో … వయ్యారంగా ఒక రోజు గడుపుకో
పాఠం… గుణపాఠం… చెలి వాటం… చెలగాటం
ఇది ఎక్కిదిగిదిగిఎక్కే యవ్వారం..

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట

చరణం: 2
ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో… నీడగా ఉండవా
పండు చిలకమ్మ పసి గట్టే వేళలో… పైటగా ఉండవా
బ్యూటి తోడుంటే ఊటి దండగ… స్వీటి కౌగిట్లో పూటా పండగ
నీ కల్లలో చెస్తాలే కాపురం.. కట్టేస్తాలే నా ప్రేమ గొపురం
పాశం …యమపాశం …చలిమాసం… చెలి కోసం
ఇది కింద మీద ఉందా లేదా యవ్వారం

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది…
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది… ఎట్టాగమ్మ….
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట..ఆ…ఆహ

**********  **********  **********

చిత్రం: యముడికి మొగుడు (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ.. అందాలనేది.. అందగనే.. సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెను లే..

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం

చరణం: 1
చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో
చలిగా ముచ్చటలాడిన ఉక్కిరిగుంటలలో…
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మెళ్ళెకాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే.. రుచితెలిపే.. తొలివలపే.. హా
ఓడివలపై మొగమెరుపై జతకలిపే.. హా..
తీయనిది.. తెర తీయనిది…
తీరా అది చేజిక్కినది..
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే..హోయ్

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అ.. ఆహ…
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం త.. త్తర
తగిలే సుమ బాణం త.. త్తర

కువవకువవా.. కువవకువవా

సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్

చరణం: 2
వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై.. హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ..హై
ఇచ్చినదీ.. కడు నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే.. హే..

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అ.. ఆహ…
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం ఎ.. ఎహే
తగిలే సుమ బాణం అ.. ఆహా
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ.. అందాలనేది.. అందగనే.. సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెను లే..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top